త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | చిరంజీవి కాకాలో మ‌రో హీరోయిన్ – ఫ‌స్ట్ టైమ్ కోలీవుడ్ బ్యూటీతో మెగాస్టార్ రొమాన్స్‌

మెగాస్టార్ చిరంజీవి కాకా మూవీలో కోలీవుడ్ హీరోయిన్ స్నేహ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. టాలీవుడ్‌లో నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌ల‌తో సినిమాలు చేసిన ఈ బ్యూటీ కాకాతో ఫ‌స్ట్ టైమ్ చిరంజీవికి జోడీగా క‌నిపించ‌బోతుంది. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Sep 17, 2026, 12.01 pm IST

Chiranjeevi | చిరంజీవి కాకాలో మ‌రో హీరోయిన్ – ఫ‌స్ట్ టైమ్ కోలీవుడ్ బ్యూటీతో మెగాస్టార్ రొమాన్స్‌
Advertisement

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న కాక మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ స్నేహ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. స్నేహ...2000 ద‌శ‌కంలో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా పేరుతెచ్చుకుంది. వెంక‌టేష్, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న క‌థానాయిక‌గా క‌నిపించింది. చిరంజీవితో క‌లిసి న‌టించే అవ‌కాశం మాత్రం ద‌క్క‌లేదు. మెగాస్టార్‌తో సినిమా చేయాల‌నే క‌ల నెర‌వేర‌లేద‌ని చాలా సార్లు స్నేహ చెప్పింది. ఎట్ట‌కేల‌కు ఆమె చిర‌కాల కోరిక తీర‌బోతున్న‌ట్లు స‌మాచారం. కాకా మూవీలో స్నేహ ఓ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఫ‌స్ట్ టైమ్‌గా మెగాస్టార్ చిరంజీవితో జోడీక‌ట్ట‌బోతుంది.

విన‌య‌విధేయ‌రామ...

2019లో వ‌చ్చిన‌ విన‌య‌విధేయ‌రామ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ వ‌దిన‌గా స్నేహ క‌నిపించింది. ఈ సినిమా త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైన‌ స్నేహ దాదాపు ఏడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మెగాస్టార్ మూవీతో రీఎంట్రీ ఇవ్వ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. కాకా మూవీలో చిరంజీవి భార్య‌గా స్నేహ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

అన‌స్వ‌ర రాజ‌న్

కాకా నివేథా పేతురాజ్, అన‌స్వ‌ర రాజ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. శాండ‌ల్‌వుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ఈ మూవీని థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ చిరంజీవి మ‌రో మూవీ విశ్వంభ‌ర కూడా సంక్రాంతి రేసులోనే నిల‌వ‌డంతో కాకా స‌మ్మ‌ర‌కు వాయిదా ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాకా మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయ‌ల్ రోల్‌లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఫ్యామిలీ మ్యాన్‌గా, గ్యాంగ్‌స్ట‌ర్‌గా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నారు.

 

Advertisement
Advertisement