Kiritimati Island | 2026 సంవత్సరం ఇంకా మన దేశంలో రాలేదు. ఇంకా 7 నుంచి 8 గంటలు భారత్ వెయిట్ చేస్తే కానీ 2026 వ సంవత్సరం రాదు. కానీ.. ప్రపంచంలోని ఓ దేశం ఇప్పటికే 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అవును.. ఇప్పుడు వాళ్లు 2026లో ఉన్నారు. అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న కిరిబాటి అనే దేశం. అక్కడ ఉన్న కిరిటిమాటి ఐలాండ్ 2026 లో అడుగుపెట్టింది. దీన్నే క్రిస్మస్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. కిరిటిమాటి లోకల్ టైమ్ జీఎంటీ ప్లస్ 14 (GMT + 14) గా ఉంటుంది. అంటే మనకన్నా 9 గంటలు ముందే ఉంటారు. అంటే మన టైమ్‌లో మధ్యాహ్నం 3.30 కే వాళ్లకు కొత్త సంవత్సరం వచ్చేసింది. నార్త్ పసిఫిక్ సముద్రంలో హవాయి దీవులకు దగ్గర ఈ కిరిబాటి దీవులు ఉంటాయి. అందులోని కిరిటిమాటి ఐలాండ్ ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ముందుంటుంది. అందుకే 2026 సంవత్సరాన్ని వాళ్లే ముందుగా ఆహ్వానించారు. ఆ తర్వాత న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 కు న్యూజిలాండ్‌లో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా, జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, చైనా, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియాలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి.