త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram Jatara | మేడారం జాత‌ర ప్ర‌త్యేక బ‌స్సుల్లో చార్జీలు 50 శాతం అద‌నం.. మ‌హిళ‌ల‌కు ఉచితం కొన‌సాగేనా?

Medaram Jatara | వ‌న దేవ‌త‌లు కొలువై ఉన్న మేడారం జాత‌ర‌కు (Medaram Jatara) స‌ర్వం స‌న్న‌ద్ధ‌మ‌యింది. ప్ర‌తి రెండేండ్ల‌కు ఒక‌సారి జ‌రిగే జాత‌ర ఈసారి జనవరి 28 నుంచి జనవరి 31 వరకు 4 రోజులపాటు నిర్వ‌హించ‌నున్నారు.

G

Telangana | Published On Jan 12, 2026, 8.05 am IST

Medaram Jatara | మేడారం జాత‌ర ప్ర‌త్యేక బ‌స్సుల్లో చార్జీలు 50 శాతం అద‌నం.. మ‌హిళ‌ల‌కు ఉచితం కొన‌సాగేనా?
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: వ‌న దేవ‌త‌లు కొలువై ఉన్న మేడారం జాత‌ర‌కు (Medaram Jatara) స‌ర్వం స‌న్న‌ద్ధ‌మ‌యింది. ప్ర‌తి రెండేండ్ల‌కు ఒక‌సారి జ‌రిగే జాత‌ర ఈసారి జనవరి 28 నుంచి జనవరి 31 వరకు 4 రోజులపాటు నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌ల‌ను (Sammakka Srakka) పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నారు. ఇక‌ ప్ర‌ధాన జాత‌ర‌కు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లి రానున్నారు. తెలంగాణ‌తోపాటు చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల నుంచి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన‌బోతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ (TGS RTC) ముమ్మ‌ర ఏర్పాట్లు చేస్తున్న‌ది. ఇందులో భాగంగా 3,495 బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ది. అయితే జాత‌ర కోసం న‌డిపే ప్ర‌త్యేక బ‌స్సుల్లో చార్జీలు 50 శాతం అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. దాన్ని వినియోగించుకోవటం ద్వారా సాధారణ చార్జీలను అంతమేర పెంచాలనుంది. అయితే ఈ బ‌స్సుల్లోనూ మ‌హిళ‌ల‌కు ఉచితంగానే సేవ‌లు అందించ‌నుంది.

మహిళలకు ఉచితమే..

ప్ర‌త్యేక బ‌స్సుల్లోను తెలంగాణ మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం కొన‌సాగుతుంద‌ని అధికారులు వెళ్ల‌డించారు. ఆధార్ చెల్లుబాటు కానివారు, ఇత‌రులు బ‌స్సుల్లో ప్ర‌యాణించాలంటే మాత్రం 50 శాతం చార్జీలు అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, గత జాతర సమయంలో 3,491 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ న‌డిపింది. అయితే అవి ఏమాత్రం సరిపోలేదు. దీంతో ఈసారి అంతకంటే ఎక్కువ సంఖ్య‌లో నడపాలని నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ.. బ‌స్సుల కొర‌త ఆర్టీసీని వేధిస్తున్న‌ది. డొక్కు బ‌స్సుల‌తో నెట్టుకొస్తున్న సంస్థ ప్ర‌తి ఏడాది వంద‌ల సంఖ్య‌లో స్క్రాబ్‌కు త‌ర‌లిస్తున్న‌ది. అయితే అంతే మొత్తంలో కొత్త బ‌స్సుల‌ను స‌మ‌కూర్చుకోలేక పోతుండ‌టంతో స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌వాటిలో 3,495 బ‌స్సుల‌ను జాత‌ర కోసం రెడీచేస్తున్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement