త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Kisan | ఫిబ్ర‌వ‌రిలో పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు!.. వారి ఖాతాల్లో రూ.4వేలు!

రాష్ట్రంలో ర‌బీసాగు (Rabi Season) ప్రారంభ‌మైంది. చాలా ప్రాంతాల్లో వ‌రి నాట్లు కూడా పూర్త‌య్యాయి. అయితే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు పంట పెట్టుబ‌డి సాయం అందించలేదు.

G

Telangana | Published On Jan 12, 2026, 9.11 am IST

PM Kisan | ఫిబ్ర‌వ‌రిలో పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు!.. వారి ఖాతాల్లో రూ.4వేలు!
Advertisement

త్రినేత్ర‌.నెట్‌: రాష్ట్రంలో ర‌బీసాగు (Rabi Season) ప్రారంభ‌మైంది. చాలా ప్రాంతాల్లో వ‌రి నాట్లు కూడా పూర్త‌య్యాయి. అయితే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు పంట పెట్టుబ‌డి సాయం అందించలేదు. ప్ర‌భుత్వాలు ఇచ్చే సాయం కొంత‌వ‌ర‌కైనా పెట్టుబ‌డికి ఆస‌రాగా మారుతాయ‌ని అన్న‌దాత‌లు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు బంధు కోసం నిధులు స‌మీక‌రిస్తున్న‌ద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే పండుగ త‌ర్వాత ఎప్పుడైనా మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ రానున్న నేప‌థ్యంలో రైతుభ‌రోసాపై (Rythu Bharosa) సందిగ్ధ‌త నెల‌కొన్న‌ది. ఈ క్ర‌మంలో పీఎం కిసాన్ స‌మ్మాన్‌పై (PM Kisan) కేంద్ర ప్ర‌భుత్వం అప్‌డేట్ అందిచింది. 22వ విడ‌త నిధుల‌ను ఫిబ్ర‌వ‌రిలో విడుదల చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) పేరుతో ఏటా రూ.6000 అన్న‌దాత‌ల‌కు ఇస్తున్న‌ది. ఏప్రిల్–జూలై, ఆగస్టు–నవంబర్, డిసెంబర్–మార్చి అనే మూడు దశల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జ‌మ‌చేస్తున్న‌ది. ఇప్పటివరకు 21 విడతల్లో నిధులను అందించింది. కేంద్ర బ‌డ్జెట్‌ను ఫిబ్ర‌వ‌రి 1న ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ నేప‌థ్యంలో పీఎం కిసాన్‌పై పీఎం మోదీ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

21వ విడతకు సంబంధించిన రూ.2 వేల‌ను 2025 నవంబర్‌ రైతుల ఖాతాల్లో కేంద్ర ప్ర‌భుత్వం జమ చేసింది. ఈ క్రమంలో 2026 సంవత్సరానికి సంబంధించిన తొలి విడతగా భావిస్తున్న రూ.2,000ను ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాగా, ఈ సారి ప‌లువురి ఖాతాల్లో రూ.4 వేలు జ‌మ‌కానున్న‌ట్లు తెలిసింది.

ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే..

పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఆ ప్ర‌క్రియ పెండింగ్‌లో ఉంటే 22వ విడత నిధులు ఆగిపోయే అవ‌కాశం ఉంది. అన్న‌దాత‌లు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి ఓటీపీ ఆధారిత ప్రక్రియ ద్వారా ఇంటి నుంచి, లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారానూ కేవైసీ పూర్తి చేయవచ్చు. అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు స‌రిగ్గా ఉన్నాయో? లేదో? అని, ఆధార్ అనుసంధానం అయ్యాయో లేదో చెక్‌చేసుకోవాలి.

మ‌రోవైపు 21వ విడత సమయంలో కేవైసీ పూర్తి చేయని వారికి డబ్బులు రాలేదు. అదేవిధంగా భూ రికార్డులు స‌రిగ్గాలేని వారు, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేయని వారికి కూడా పెట్టుబ‌డి సాయం అంద‌లేదు. ఇలాంటి వారికి ఈసారి రూ.2 వేలకు బదులుగా రూ.4 వేలు ఖాతాలో ప‌డే అవకాశం ఉందని తెలుస్తున్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement