Dinner Foods | డయాబెటిస్ ఉన్నవారు ఈ ఆహారాలను రాత్రి పూట తీసుకోకూడదు..!
Dinner Foods | డయాబెటిస్ అంటేనే షుగర్ లెవల్స్ ను నియంత్రించుకోవడం అని అర్థం చేసుకోవాలి. రోజులో ఏ ఆహారాలను తీసుకున్నా, ద్రవాలను తాగినా షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండాలి. అప్పుడే దీని వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి.
Dinner Foods | డయాబెటిస్ అంటేనే షుగర్ లెవల్స్ ను నియంత్రించుకోవడం అని అర్థం చేసుకోవాలి. రోజులో ఏ ఆహారాలను తీసుకున్నా, ద్రవాలను తాగినా షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండాలి. అప్పుడే దీని వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వాకింగ్ చేయాలి. అలాగే పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవాలి. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. ఇక బరువు సరిగ్గానే ఉండేవారు దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. వేళకు నిద్రించాలి. ఇలా అన్ని జాగ్రత్తలను పాటిస్తేనే షుగర్ కంట్రోల్ అవుతుంది. అయితే కొందరు రాత్రి పూట కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో పలు ఆహారాలను తీసుకుంటారు. దీని వల్ల మరుసటి రోజు ఉదయం షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో ఆ రోజంతా షుగర్ లెవల్స్ అధికంగానే ఉంటాయి. కనుక రాత్రి పూట తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌కు చెందిన స్పర్శ్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ ఎంఎన్ అశోక్ తెలిపారు.
అన్నం, రీఫైన్ చేయబడిన పిండి పదార్థాలు..
రాత్రి పూట డయాబెటిస్ పేషెంట్లు ఏ ఆహారాన్ని పడితే దాన్ని తీసుకోకూడదు. దీని వల్ల మరుసటి రోజు ఉదయం షుగర్ లెవల్స్ పెరిగి రోజంతా అలాగే ఉంటుంది. ఇలా దీర్ఘకాలంలో జరిగితే షుగర్ అసలు కంట్రోల్ అవదు. దీంతో అనేక సమస్యలు వస్తాయి.. అని డాక్టర్ అశోక్ తెలిపారు. రాత్రి పూట తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటించాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాత్రి పూట తెల్ల అన్నంతోపాటు రీఫైన్ చేయబడిన పిండి పదార్థాలను అసలు తినకూడదని ఆయన తెలిపారు. ఇవి షుగర్ లెవల్స్‌ను అమాంతం పెంచుతాయి. దీని వల్ల రాత్రిపూట శరీరంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటాయి. వాటిని తగ్గించేందుకు శరీరం బాగా శ్రమించాల్సి వస్తుంది. కనుక రాత్రి పూట అన్నం, ఇతర రీఫైన్ చేయబడిన పిండి పదార్థాలను తీసుకోకూడదు.

వేపుళ్లు, స్నాక్స్..
డయాబెటిస్ ఉన్నవారు రాత్రి పూట వేపుళ్లు, ఆలుగడ్డలు, స్నాక్స్ అసలు తినకూడదు. ఇవి షుగర్ లెవల్స్‌ను పెంచడంతోపాటు శరీరంలో కొవ్వు చేరేలా చేస్తాయి. దీంతో బరువు పెరుగుతారు. దీని వల్ల షుగర్ లెవల్స్ మరింత అధికంగా పెరుగుతాయి. ఈ చక్రం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి రాత్రి పూట వీటిని తినడం కూడా మానేయాలి. అలాగే ఆ సమయంలో చక్కెరతో నిండిన సాస్‌లు, మారినేడ్స్, గ్రేవీలు, స్వీట్ చిల్లీ సాస్, తేనె ఆధారిత డ్రెస్సింగ్స్, రెస్టారెంట్ స్టైల్ గ్రేవీలను తీసుకోకూడదు. ఇవన్నీ అధిక షుగర్ లెవల్స్‌కు కారణం అవుతాయి. అలాగే రాత్రి పూట తెల్ల బ్రెడ్, పావ్, బన్‌లు, రీఫైన్ చేయబడిన పిండితో తయారు చేసే రోటీలు, బేకరీ పదార్థాలు వంటి వాటిని కూడా తీసుకోకూడదు. ఇవన్నీ షుగర్ లెవల్స్ ను అమాంతం పెంచి రోగాలకు కారణం అవుతాయి.
స్వీట్లు, శీతల పానీయాలు..
కొందరు రాత్రి పూట భోజనం తినేటప్పుడు లేదా భోజనం చేసిన అనంతరం స్వీట్లు, ఇతర తీపి పదార్థాలు, శీతల పానీయాలు, డిజర్ట్స్‌ను అధికంగా తీసుకుంటారు. నిజానికి ఇవన్నీ శరీరంపై గ్లైసీమిక్ లోడ్ పడేలా చేస్తాయి. దీంతో రాత్రంతా షుగర్ లెవల్స్ అధికంగానే ఉంటాయి. మరుసటి రోజు ఉదయం వరకు కూడా షుగర్ తగ్గదు. అలాంటి స్థితిలో టెస్టు చేస్తే షుగర్ అధికంగానే ఉన్నట్లు ఫలితం వస్తుంది. కాబట్టి ఈ ఆహారాలను కూడా రాత్రి పూట మానేయడమే మంచిది. అలాగే చక్కెర, కొవ్వులు అధికంగా ఉండే సిరియల్స్ ను కూడా కొందరు రాత్రి పూట తింటారు. వీటిని తినడం వల్ల కూడా హాని కలుగుతుంది. కనుక ఈ అలవాటును కూడా మానేయాలి. ఇలా ఆయా ఆహారాలు, పానీయాలను రాత్రి పూట తీసుకోవడం మానేస్తే షుగర్‌ను అద్భుతంగా కంట్రోల్ చేయవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.. అని డాక్టర్ అశోక్ సూచించారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!
- ●Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!

Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?



