Bhatti Vikramarka | సమ్మక్క సారలమ్మ జాతర.. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | సమ్మక్క-సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు ఆత్మగౌరవ ప్రతీకని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో జాతర పనులను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్షించారు.
Bhatti Vikramarka | సమ్మక్క-సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు ఆత్మగౌరవ ప్రతీకని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో జాతర పనులను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అమ్మవార్లను దర్శించుకొని.. మీడియా సమావేశం నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయన్నారు. ఈ జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 260 కోట్లు ఖర్చు చేస్తుందని ఇందులో జాతర నిర్వహణ కోసం రూ.150 కోట్లు శాశ్వతంగా గుడి నిర్మాణ పనులకు రూ.110 కోట్లు ఇస్తున్నట్లు వివరించారు.
నిధుల ఖర్చు చేయాల్సిన పనులు అన్ని విషయాలను మేడారంలో సమీక్షించి ఇక్కడికి ఇక్కడే నిర్ణయాలు చేసినట్టు డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. రెండు రోజుల్లో పనులు పూర్తి కాబోతున్నాయని తెలిపారు. ఇప్పటికీ జాతర పనులు సగటున 85శాతం పూర్తి చేశారు. మిగిలిన పనులు 15న పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. జాతర సందర్భంగా అవసరమైన నిధులు విడుదల చేశామని, పూర్తి చేసిన పనులకు 24గంటల్లో బిల్లులు మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. గతంలో జాతర నిర్వహణకు రూ.75 కోట్లు, రూ.100 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. ప్రధానంగా ఆరోగ్య, విద్యుత్ శాఖ అధికారులు జాతర పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని వీరితో పాటు యావత్ శాఖల సిబ్బంది అధికారులు జాతరను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






