Software Engineer | కోరిక తీర్చలేదని.. 34 ఏండ్ల టెకీని హత్యచేసిన టీనేజర్
కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) దారుణం చోటుచేసుకున్నది. లైంగిక వాంఛ తీర్చేందుకు ఒప్పుకోలేదని 34 ఏండ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని (Software Engineer) ఓ టీనేజర్ హత్య చేశాడు.
త్రినేత్ర.న్యూస్: కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) దారుణం చోటుచేసుకున్నది. లైంగిక వాంఛ తీర్చేందుకు ఒప్పుకోలేదని 34 ఏండ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని (Software Engineer) ఓ టీనేజర్ హత్య చేశాడు.
34 ఏండ్ల శర్మిలా డీకే బెంగళూరులో రామమూర్తి నగర్‌లోని సుబ్రమణి లేఅవుట్‌లో నివాసం ఉంటున్నది. ఆమె ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ యాక్సెంచర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. ఆమె పొరుగింట్లో కర్నాల్ కురయ్ అనే 18 ఏండ్ల యువకుడు ఉంటున్నాడు. అతని కన్ను శర్మిలపై పడింది. ఈ నెల 3న రాత్రి 9 గంటల సమయంలో కిటికీ గుండా శర్మిల ఇంట్లోకి వచ్చిన కర్నాల్ ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. తన కామ వాంఛ తీర్చేందుకు ఒప్పుకోకపోవడంతో కోపోద్రిక్తుడైన కుర్నాల్.. ఆమె నోరు, ముక్కును బలవంతంగా మూసేశాడు. ఈ పెనుగులాటలో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో సృహకోల్పోయింది. అనంతరం మంచంపై ఆమె బట్టలు, ఇతర వస్తువులు వేసి కాల్చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఇల్లంతా పొగ చూరడంతో ఆమె మృతిచెందింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బెడ్‌రూమ్‌లో విఘత జీవిగా పడి ఉన్న ఆమెను గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక, వైజ్ఞానిక ఆధారాల సాయంతో ఆమెది హత్యగా నిర్ధారించారు. పక్కింట్లో ఉండే కర్నాల్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతనిపై హత్యకేసు నమోదుచేశారు.
సంబంధిత వార్తలు

IPL 2026 Playoffs Schedule | ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. అహ్మదాబాద్‌లో 31న ఫైనల్..!
మే 6, 2026

Software Engineer Death | పెళ్లింట తీవ్ర విషాదం.. తమ్ముడి పెళ్లి రోజే డెకరేషన్ వైర్లు తగిలి అన్న మృతి
మే 1, 2026

Bengaluru Rain | బెంగళూరులో భారీ వర్షం.. వాన నీటిలో ఆడిన ఆర్సీబీ ప్లేయర్.. వీడియో
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



