BSNL Prepaid Plan | బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. రోజూ హైస్పీడ్ డేటా.. 365 రోజుల వాలిడిటీ..
BSNL Prepaid Plan | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్లాన్లు, ఆఫర్లతో తన కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంటుంది. ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోలిస్తే ప్లాన్ల చార్జిలను కూడా తక్కువగానే వసూలు చేస్తుంది. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ లో ఇప్పటికే వినియోగదారుల కోసం అనేక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
Technology | Published On Jan 12, 2026, 8.07 am IST
BSNL Prepaid Plan | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్లాన్లు, ఆఫర్లతో తన కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంటుంది. ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోలిస్తే ప్లాన్ల చార్జిలను కూడా తక్కువగానే వసూలు చేస్తుంది. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ లో ఇప్పటికే వినియోగదారుల కోసం అనేక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఓ నూతన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆ సంస్థ ఈ విషయాన్ని ఎక్స్‌లో ఒక పోస్టు ద్వారా తెలియజేసింది. బీఎస్ఎన్ఎల్ ఇటీవలే కేవలం రూ.1కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టి ఆశ్చర్యపరిచింది. ఈ ప్లాన్‌కు ఏకంగా 30 రోజుల వాలిడిటీని అందించింది. అయితే ఇప్పుడు తాజాగా రూ.2799కు ఓ నూతన వార్షిక ప్రీ పెపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలియజేసింది.
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ.2799 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు ఏడాదిపాటు పనిచేస్తుంది. తరచూ రీచార్జి చేయించుకోవడం ఇబ్బందిగా ఉంటుందని ఫీలయ్యేవారు, డేటాను అధికంగా వినియోగించేవారికి ఈ ప్లాన్ ఉపయుక్తంగా ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలియజేసింది. రూ.2799 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కాగా ఇందులో కస్టమర్లకు పలు అద్భుతమైన బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు రోజుకు 3జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా ఉచితంగా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కూడా ఉచితంగానే పంపించుకోవచ్చు. ఇలా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
ఏడాది పాటు రీచార్జి వాలిడిటీని కోరుకునే వారితోపాటు డేటాను రోజూ అధికంగా వినియోగించే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకోవడం వల్ల ఏడాదంతా టెన్షన్ లేకుండా ఉండవచ్చు. మాటి మాటికీ రీచార్జి చేయాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ ప్లాన్‌ను ఫ్రీజ్ ది ప్రైస్, ఫ్యుయెల్ ది ఇయర్ అనే క్యాంపెయిన్‌లో భాగంగా అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. వినియోగదారులకు చాలా తక్కువ ధరకు ఈ ప్లాన్ లభించడంతోపాటు ఏడాదంతా కనెక్టివిటీ ఉంటుందని, డేటాను కూడా ఎక్కువగానే ఉపయోగించుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కాగా బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్‌ను ఆ సంస్థకు చెందిన యాప్ లేదా వెబ్‌సైట్‌తోపాటు పలు ఇతర పేమెంట్ యాప్‌లలోనూ రీచార్జి చేసుకోవచ్చు. దీంతో ఆయా ప్రయోజనాలను పొందవచ్చు.
సంబంధిత వార్తలు

Postpaid Family Plans | ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
మే 16, 2026

Jio | యూత్ కోసం జియో ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్.. ఎన్నో బండిల్డ్ బెనిఫిట్స్..
ఏప్రిల్ 25, 2026

Whatsapp Prepaid Mobile Recharge | ఇక వాట్సాప్‌లో యూజర్లు ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జి కూడా చేసుకోవచ్చు.. వీరికి అందుబాటులోకి..
ఏప్రిల్ 24, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



