PPF Scheme | నెలకు రూ.10వేలు పొదుపు చేద్దామని చూస్తున్నారా..? అయితే ఇది చాలా సురక్షితమైన స్కీమ్..!
PPF Scheme | డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని పొదుపు చేయాలి. అలా చేసినవారికే భవిష్యత్తులో డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇదే విషయాన్ని మన పెద్దలు కూడా చెబుతుంటారు. ఎంత డబ్బు సంపాదించాం అన్న దాని కన్నా నెల నెలా ఎంత పొదుపు చేశాం అన్నదే చాలా ముఖ్యమని చెబుతుంటారు.
PPF Scheme | డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని పొదుపు చేయాలి. అలా చేసినవారికే భవిష్యత్తులో డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇదే విషయాన్ని మన పెద్దలు కూడా చెబుతుంటారు. ఎంత డబ్బు సంపాదించాం అన్న దాని కన్నా నెల నెలా ఎంత పొదుపు చేశాం అన్నదే చాలా ముఖ్యమని చెబుతుంటారు. ఎందుకంటే డబ్బు సంపాదించడం చాలా మంది చేస్తారు. కానీ దాన్నంతా నెల తిరిగే సరికి ఖర్చు చేస్తారు. అయితే కేవలం కొందరు మాత్రమే తాము తక్కువ డబ్బు సంపాదించినా కచ్చితంగా పొదుపు చేస్తారు. దీంతో అలాంటి వారికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అయితే డబ్బు పొదుపు చేయాలని చూసే వారు సురక్షితమైన మార్గాలను ఎంచుకుంటారు. వాటిల్లో పీపీఎఫ్ స్కీమ్ ఒకటని చెప్పవచ్చు.
కేంద్రమే సెక్యూరిటీగా..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా PPF స్కీమ్‌ను డబ్బు పొదుపు చేసేందుకు అందుబాటులో ఉన్న సురక్షితమైన మార్గాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడే స్కీమ్. అందువల్ల ఇందులో మనం పెట్టే డబ్బుకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుంది. ఇక పీపీఎఫ్ వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతుంది. కనుక ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెరిగిన వడ్డీ రేట్లకు డబ్బును పెట్టుబడిగా పెట్టి ఆమేర ప్రయోజనాలను పొందవచ్చు. కనుకనే పీపీఎఫ్ స్కీమ్‌లో డబ్బును పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక ఈ స్కీమ్‌లో భాగంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 7.1 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది.
ఆన్‌లైన్‌లోనే సదుపాయం..
పీపీఎఫ్ స్కీమ్‌లో చేరేందుకు బయటికి ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ప్రస్తుతం చాలా వరకు బ్యాంకుల్లో ఈ స్కీమ్‌ను ఆన్‌లైన్‌లోనే పొందే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నారు. కనుక ప్రజలు తమ బ్యాంకు ఖాతాలకు అందుబాటులో ఉండే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకుని పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇది చాలా సులభమైన, వేగవంతమైన ప్రక్రియ. కొన్ని బ్యాంకుల్లో పీపీఎఫ్ స్కీమ్ లో చేరితే సేవింగ్స్ ఖాతాల్లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ ఉంచాల్పిన అవసరం లేకుండానే సదుపాయాన్ని అందిస్తున్నారు. కనుక పీపీఎఫ్ స్కీమ్ ద్వారా ఇలాంటి లాభాలను కూడా పొందవచ్చు. ఇక పోస్టాఫీసుల్లోనూ పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చు. అందులో కూడా ఈ స్కీమ్ ద్వారా డబ్బును పొదుపు చేయవచ్చు.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మినహాయింపు..
పీపీఎఫ్ స్కీమ్ పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉంటుంది కనుక మన డబ్బులకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది. ఇక ఈ స్కీమ్ కాల పరిమితి 15 ఏళ్లు కాగా కాల వ్యవధి ముగిసిన అనంతరం అవసరం అనుకుంటే వినియోగదారులు మరో 5 ఏళ్ల వరకు స్కీమ్‌ను పొడిగించుకోవచ్చు. దీంతో రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి. పీపీఎఫ్ స్కీమ్‌లో చేరిన వారు ఏడాదికి కనీసం రూ.500 అందులో పొదుపు చేయవచ్చు. గరిష్టంగా రూ.1.50 లక్షలను పొదుపు చేసేందుకు అనుమతినిచ్చారు. ఈ క్రమంలోనే పీపీఎఫ్ ద్వారా పొదుపు చేసే సొమ్ముకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఇలా పీపీఎఫ్ స్కీమ్ పనిచేస్తుంది.
ఉదాహరణ చూస్తే..
అయితే పీపీఎఫ్ స్కీమ్‌లో భాగంగా ఒక వ్యక్తి నెలకు రూ.10వేలను పొదుపు చేస్తే ఏడాదికి 7.1 శాతం వడ్డీ అనుకుంటే అప్పుడు 15 ఏళ్లు మెచూరిటీ ముగిసిన అనంతరం వినియోగదారుడి చేతిలో మొత్తం రూ.32,54,567 సొమ్ము ఉంటుంది. అయితే వడ్డీ రేటు తరచూ పెరుగుతుంది కనుక ఆ మొత్తం కూడా కచ్చితంగా పెరిగి వినియోగదారుడికి లభిస్తుంది. 15 ఏళ్ల అనంతరం వచ్చే ఆ సొమ్మును రిటైర్మెంట్ కోసం పక్కన పెట్టుకోవచ్చు. లేదా పిల్లల చదువులు, వివాహం కోసం ఉపయోగించవచ్చు. ఇలా పీపీఎఫ్ ద్వారా వచ్చే డబ్బు ఆ వయస్సులో ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక నెల నెలా కాస్త డబ్బును పొదుపు చేయాలని చూస్తున్న వారికి పీపీఎఫ్ స్కీమ్ చాలా అత్యుత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



