త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Xiaomi 15 | ఏకంగా రూ.11వేలు ధ‌ర త‌గ్గిన షియోమీ 15 స్మార్ట్ ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫ‌ర్‌..

Xiaomi 15 | ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ ఫోన్ మీకోస‌మే. దీనిపై తాజాగా ఏకంగా రూ.11వేల మేర ధర‌ను త‌గ్గించారు. షియోమీ 15 స్మార్ట్ ఫోన్‌పై ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ప‌వ‌ర్‌, కెమెరా, డిజైన్ ప‌రంగా ఎంతో ఆక‌ట్టుకున్న ఈ ఫోన్ ధ‌ర ఇప్పుడు భారీగా త‌గ్గింది.

S

Technology | Published On Jan 3, 2026, 1.26 pm IST

Xiaomi 15 | ఏకంగా రూ.11వేలు ధ‌ర త‌గ్గిన షియోమీ 15 స్మార్ట్ ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫ‌ర్‌..
Advertisement

Xiaomi 15 | ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ ఫోన్ మీకోస‌మే. దీనిపై తాజాగా ఏకంగా రూ.11వేల మేర ధర‌ను త‌గ్గించారు. షియోమీ 15 స్మార్ట్ ఫోన్‌పై ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ప‌వ‌ర్‌, కెమెరా, డిజైన్ ప‌రంగా ఎంతో ఆక‌ట్టుకున్న ఈ ఫోన్ ధ‌ర ఇప్పుడు భారీగా త‌గ్గింది. దీంతో ఈ ఫోన్‌ను చాలా త‌క్కువ ధ‌ర‌కే ప్ర‌స్తుతం వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. షియోమీ 15 స్మార్ట్ ఫోన్ ప్ర‌స్తుతం ప‌లు బ్యాంకు ఆఫ‌ర్ల అనంత‌రం రూ.64,499 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తున్నారు.

షియోమీ 15 స్మార్ట్ ఫోన్‌పై రూ.11,500 మేర డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్ ధ‌ర రూ.68,449కు చేరుకుంది. అయితే క‌థ అక్క‌డితో ముగియ‌లేదు. ఇంకా దీనిపై 5 శాతం క్యాష్ బ్యాక్‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వాడితే మ‌రో రూ.4వేల క్యాష్ బ్యాక్ వ‌స్తుంది. దీంతో ఈ ఫోన్ ధ‌ర మ‌రింత త‌గ్గి రూ.64,499కి చేరింది. ఇలా ఈ ఫోన్ ను త‌గ్గింపు ధ‌ర‌కు ఫ్లిప్‌కార్ట్‌లో పొంద‌వ‌చ్చు. ఇక దీనిపై ప‌లు ర‌కాల ఈఎంఐ స‌దుపాయాల‌ను కూడా అందిస్తున్నారు. నెల‌కు రూ.2,409 క‌నీస ఈఎంఐతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

షియోమీ 15 ఫోన్‌లో 6.36 ఇంచుల 1.5కె రిజ‌ల్యూషన్ క‌లిగిన ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. క‌నుక డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్య‌మైన దృశ్యాల‌ను తెర‌పై వీక్షించ‌వ‌చ్చు. సూర్య‌కాంతిలోనూ ఫోన్ తెర స్ప‌ష్టంగా క‌నిపించేలా ఏకంగా 3200 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్ ఫీచ‌ర్‌ను ఇందులో అందిస్తున్నారు. హెచ్‌డీఆర్ 10 ప్ల‌స్‌, డాల్బీ విజ‌న్‌కు సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. స్నాప్ డ్రాగ‌న్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఆధారిత హైప‌ర్ ఓఎస్ 2.0 ఇందులో ల‌భిస్తుంది. 5240 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇందులో ఇచ్చారు. దీనికి 90 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌, 50 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ స‌దుపాయాల‌ను కూడా అందిస్తున్నారు. క‌నుక ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. వెనుక వైపు 200 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఇచ్చారు. మ‌రో 50 మెగాపిక్స‌ల్ కెమెరాతోపాటు ఇంకో 50 మెగాపిక్స‌ల్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. అలాగే 50 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఇచ్చారు. ఇక ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇలా ఈ ఫోన్ అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. క‌నుక త‌గ్గింపు ధ‌ర‌కు ఈ ఫోన్‌ను వినియోగ‌దారులు ప్ర‌స్తుతం సొంతం చేసుకోవ‌చ్చు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement