Smart TV Discount Sale | స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరలు.. 74 శాతం వరకు డిస్కౌంట్..
Smart TV Discount Sale | స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా..? అయితే మీకు ఇదో గొప్ప అకాశం అని చెప్పవచ్చు. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ టీవీలపై ప్రత్యేకంగా ఓ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో పలు బ్రాండ్లకు చెందిన స్మార్ట్ టీవీలను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. ఏకంగా 74 శాతం మేర ఈ సేల్‌లో టీవీలపై డిస్కౌంట్‌ను పొందవచ్చు.
Technology | Published On Jan 2, 2026, 11.41 am IST
Smart TV Discount Sale | స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా..? అయితే మీకు ఇదో గొప్ప అకాశం అని చెప్పవచ్చు. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ టీవీలపై ప్రత్యేకంగా ఓ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో పలు బ్రాండ్లకు చెందిన స్మార్ట్ టీవీలను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. ఏకంగా 74 శాతం మేర ఈ సేల్‌లో టీవీలపై డిస్కౌంట్‌ను పొందవచ్చు. సోనీ, టీసీఎల్, రియల్‌మి వంటి కంపెనీలకు చెందిన 55 ఇంచుల స్మార్ట్ టీవీలను తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. ఇందులో భాగంగా 55 ఇంచుల టీవీలను 32 ఇంచుల టీవీల ధరలకు అందిస్తున్నారు. కనుక స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని చూస్తున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా సోనీ కంపెనీకి చెందిన 55 ఇంచుల ఎల్ఈడీ స్మార్ట్ టీవీని రూ.57,990కే అందిస్తున్నారు. ఈ టీవీ వాస్తవ ధర రూ.91,900 ఉండగా, 36 శాతం తగ్గింపు ధరకు దీన్ని ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. ఇందులో గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ ఉంది. కనుక అనేక యాప్స్ లభిస్తాయి. అలాగే 40 వాట్ల పవర్ ఫుల్ స్పీకర్లను ఇందులో ఇచ్చారు. దీంతో అద్భుతమైన ఆడియోను ఆస్వాదించవచ్చు. అలాగే ఈ సేల్‌లో 55 ఇంచుల టీసీఎల్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.32,990గా ఉంది. ఈ టీవీ అసలు ధర రూ.93,999 ఉండగా సేల్‌లో దీన్ని ఏకంగా 64 శాతం తగ్గింపు ధరకు అందిస్తున్నారు. ఈ స్మార్ట్ టీవీలో 24 వాట్ల స్పీకర్ సిస్టమ్‌ను ఇవ్వగా, ఇందులో అద్భుతమైన యాప్స్ ను పొందవచ్చు. ఈ టీవీపై 2 ఏళ్ల వరకు వారంటీ లభిస్తుంది. అలాగే పలు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో ఈ టీవీని కొనుగోలు చేస్తే మరో రూ.6500 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో టీవీ ధర ఇంకా తగ్గుతుంది.
ఈ సేల్‌లో రియల్‌మికి చెందిన టెక్ లైఫ్ 55 ఇంచుల క్యూలెడ్ స్మార్ట్ టీవీని రూ.27,999 ధరకు కొనవచ్చు. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.65,399 ఉండగా దీన్ని ప్రస్తుతం 57 శాతం తగ్గింపు ధరకు అందిస్తున్నారు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగిస్తే టీవీ ధర మరో రూ.6500 వరకు తగ్గుతుంది. ఇక ఫాక్స్ స్కై అనే కంపెనీకి చెందిన 55 ఇంచుల క్యూలెడ్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.98,990 ఉండగా దీన్ని 74 శాతం తగ్గింపుతో రూ.24,999కే అందిస్తున్నారు. ఇందులోనూ గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ ఉంది. 30 వాట్ల స్పీకర్లను ఇచ్చారు. ఇలా ఈ సేల్‌లో ఆయా స్మార్ట్ టీవీలను తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?
- ●Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!






