త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oneplus 15 | వ‌న్ ప్ల‌స్ 15 ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఇదే చాన్స్‌..!

Oneplus 15 | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ నిర్వ‌హిస్తున్న ఇయ‌ర్ ఎండ్ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు ధ‌ర‌కు వ‌న్ ప్లస్ 15 ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఫ్లాగ్ షిప్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్న వారు ఈ అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇందులో భాగంగా డిస్కౌంట్ ధ‌ర పోను, ఇత‌ర ఆఫ‌ర్ల‌ను క‌లిపితే ఈ ఫోన్‌ను రూ.50వేల లోపే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

S

Technology | Published On Jan 1, 2026, 7.52 am IST

Oneplus 15 | వ‌న్ ప్ల‌స్ 15 ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఇదే చాన్స్‌..!
Advertisement

Oneplus 15 | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ నిర్వ‌హిస్తున్న ఇయ‌ర్ ఎండ్ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు ధ‌ర‌కు వ‌న్ ప్లస్ 15 ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఫ్లాగ్ షిప్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్న వారు ఈ అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇందులో భాగంగా డిస్కౌంట్ ధ‌ర పోను, ఇత‌ర ఆఫ‌ర్ల‌ను క‌లిపితే ఈ ఫోన్‌ను రూ.50వేల లోపే కొనుగోలు చేయ‌వ‌చ్చు. వ‌న్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడల్‌ను అమెజాన్‌లో రూ.76,999 ధ‌ర‌కు లిస్టింగ్ చేశారు. అయితే ఈ ఫోన్ ధ‌రను సేల్‌లో భాగంగా ప్ర‌స్తుతం త‌గ్గించారు. దీంతో ఈ ఫోన్ రూ.72,999 ధ‌ర‌కు అందుబాటులో ఉంది. అయితే కథ ఇక్క‌డితోనే అయిపోలేదు. ఇంకా దీనిపై ఆఫ‌ర్ల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

రూ.50వేల లోపే..

వ‌న్‌ప్ల‌స్ 15కు చెందిన ఆ మోడ‌ల్‌ను వినియోగ‌దారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి కొనుగోలు చేస్తే రూ.4వేల డిస్కౌంట్ ల‌భిస్తుంది. అలాగే వినియోగ‌దారులు త‌మ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.44,450 వ‌ర‌కు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఇస్తారు. అయితే పాత ఫోన్‌కు ఎంత లేద‌న్నా రూ.20వేల వ‌ర‌కు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఇచ్చినా వ‌న్ ప్ల‌స్ 15 మోడ‌ల్ ధ‌ర రూ.50వేల‌కు కింద‌కు వ‌స్తుంది. దీంతో భారీ త‌గ్గింపు ధ‌ర‌కే ఫోన్‌ను పొందినట్లు అవుతుంది. క‌నుక వ‌న్ ప్ల‌స్ 15 ను కొనుగోలు చేయాల‌ని చూస్తున్న వారు ఈ అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను ఇప్పుడే సొంతం చేసుకోవ‌చ్చు. అయితే ఈ సేల్‌కు ముగింపు తేదీని ప్ర‌క‌టించ‌లేదు. క‌నుక వినియోగ‌దారులు స్టాక్ అయిపోయే లోపే ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అద్భుత‌మైన డిస్‌ప్లే..

ఇక వ‌న్‌ప్ల‌స్ 15 స్మార్ట్ ఫోన్‌ను ఆ సంస్థ ఇటీవ‌లే రిలీజ్ చేయ‌గా ఇప్పుడు ఈ ఫోన్ భారీ త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తుండ‌డం విశేషం. ఇందులో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్లు పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్‌లో 6.78 ఇంచుల ఎల్‌టీపీవో అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 1.5కె రిజ‌ల్యూష‌న్ ల‌భిస్తుంది. 1800 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తున్నారు. అలాగే డిస్‌ప్లే 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా క‌లిగి ఉంది. క‌నుక డిస్‌ప్లే అద్భుత‌మైన క్వాలిటీని ఇస్తుంది. నాణ్య‌మైన దృశ్యాల‌ను తెర‌పై వీక్షించ‌వ‌చ్చు. ఇక ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్‌కు చెందిన స్నాప్‌డ్రాగ‌న్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. ఫోన్‌లో 16జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. 512జీబీ వ‌ర‌కు స్టోరేజ్‌ను ఇచ్చారు. అలాగే మెరుగైన వైఫై కోసం ప్ర‌త్యేకంగా వైఫై చిప్‌ని కూడా ఇచ్చారు.

భారీ బ్యాట‌రీ..

వ‌న్‌ప్ల‌స్ 15 ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆధారిత ఆక్సిజ‌న్ ఓఎస్ 16ను ఇచ్చారు. ఈ ఫోన్‌లో గూగుల్‌కు చెందిన ప‌లు ఏఐ ఫీచ‌ర్ల‌ను సైతం ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే ఈ ఫోన్‌కు 6 ఏళ్ల వ‌ర‌కు ఓఎస్ అప్‌డేట్స్‌, సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ తెలిపింది. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న ట్రిపుల్ కెమెరాల‌ను ఇవ్వ‌గా, ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్ లో ఏకంగా 7300 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఫోన్ బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎక్కువ‌గా వ‌స్తుంది. అలాగే 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్‌ను ఇచ్చారు. క‌నుక ఫోన్‌ను వేగంగా చార్జింగ్ కూడా చేయ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement