త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Motorola | జేబులో ఉండ‌గానే పేలిన మోటోరోలా ఫోన్‌.. వీడియో వైరల్‌..

Motorola | స్మార్ట్ ఫోన్ పేలిన సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం త‌ర‌చూ వార్త‌ల్లో చ‌దువుతూనే ఉంటాం. అలాంటి వీడియోలు కూడా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుంటాయి. ఇప్ప‌టికే మ‌నం ప‌లు కంపెనీల‌కు చెందిన స్మార్ట్ ఫోన్లు ప‌లు కార‌ణాల వ‌ల్ల పేల‌డాన్ని గ‌మనించాం.

S

Viral news | Published On Dec 31, 2025, 11.32 am IST

Motorola | జేబులో ఉండ‌గానే పేలిన మోటోరోలా ఫోన్‌.. వీడియో వైరల్‌..
Advertisement

Motorola | స్మార్ట్ ఫోన్ పేలిన సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం త‌ర‌చూ వార్త‌ల్లో చ‌దువుతూనే ఉంటాం. అలాంటి వీడియోలు కూడా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుంటాయి. ఇప్ప‌టికే మ‌నం ప‌లు కంపెనీల‌కు చెందిన స్మార్ట్ ఫోన్లు ప‌లు కార‌ణాల వ‌ల్ల పేల‌డాన్ని గ‌మనించాం. కొన్ని సార్లు ఫోన్లు బ్యాట‌రీ హీట్‌కు గురి కావ‌డం వ‌ల్ల పేలితే మరికొన్ని సార్లు వినియోగ‌దారులు చేసే త‌ప్పుల కార‌ణంగా పేలుతుంటాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌ల్లో కొంద‌రు ప్రాణాల‌ను కూడా కోల్పోయారు. అయితే తాజాగా ఇలాంటిదే మ‌రో సంఘ‌ట‌న చోటు చేసుకుంది. కానీ ఈ ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం ఏమీ సంభ‌వించ‌లేదు. అలాగే గాయాలు కూడా అవ‌లేదు. ఓ స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుడికి ఈ సంఘ‌ట‌న ఎదురు కాగా త‌న‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని, కేవ‌లం ఫోన్ మాత్ర‌మే పేలింద‌ని తెలిపాడు. ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం వైరల్ అవుతోంది.

మోటోరోలా జి54 ఫోన్‌..?

డిసెంబ‌ర్ 30వ తేదీన ఇన్ స్టాగ్రామ్‌లో shubhxr_369 అనే యూజ‌ర్ నేమ్‌తో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ వ్య‌క్తి త‌న మోటోరోలా స్మార్ట్ ఫోన్ పేలింద‌నే విష‌యాన్ని చెప్పాడు. త‌న‌కు ఏమీ కాలేద‌ని వివ‌రించాడు. ఇక అదే వీడియోను ఎక్స్‌లో అభిషేక్ యాద‌వ్ అనే వ్య‌క్తి షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. అందులో ఆ ఫోన్ యూజ‌ర్ త‌న ఫోన్ పేలింద‌నే విష‌యాన్ని వివరిస్తుండ‌గా ప‌క్క‌న ఉన్న‌వారు ఆ వివ‌రాల‌ను అడుగుతున్న దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. అయితే ఆ వ్య‌క్తి పేరు, ఉంటున్న ప్రాంతం, వాడుతున్న మొబైల్ ఫోన్ మోడ‌ల్ వంటి వివ‌రాలు తెలియ‌లేదు. కానీ ఫోన్ ను చూస్తే అది మోటోరోలా కంపెనీకి చెందిన‌ది అని ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇక ఆ ఫోన్ మోటోరోలాకు చెందిన జి54 మోడ‌ల్ అయి ఉంటుంద‌ని భావిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shubh X R (@shubhxr_369)

స్పందించ‌ని కంపెనీ..

అయితే తాము త‌యారు చేసిన ఫోన్ పేల‌డంపై మోటోరోలా స్పందించ‌లేదు. కానీ ఆ ఫోన్‌ను పూర్తిగా ప‌రీక్షించాకే మోటోరోలా ఆ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తుంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఫోన్ అస‌లు ఎందుకు పేలింది..? అన్న కార‌ణాల‌ను అంచ‌నా వేసేందుకు ఫోన్ ను ముందుగా పూర్తిగా ప‌రిశీలించాలి. అది నిపుణులు లేదా ఫోన్ త‌యారీ కంపెనీ ద్వారానే వీలువుతుంది. క‌నుక మోటోరోలా ఈ విష‌యంపై స్పందిస్తుంద‌ని ఎదురు చూస్తున్నారు. అయితే వీడియోలో ఆ యూజ‌ర్ త‌న ఫోన్‌ను తాన వాడ‌లేద‌ని, క‌నీసం చార్జింగ్ కూడా పెట్ట‌లేద‌ని, జేబులో ఉండ‌గానే అక‌స్మాత్తుగా పొగ‌లు వ‌చ్చి పేలింద‌ని, వెంట‌నే ఫోన్‌ను బ‌య‌ట‌కు తీశాన‌ని అత‌ను చెప్పాడు. కాస్తలో ప్ర‌మాదం త‌ప్పింద‌ని అన్నాడు.

స్మార్ట్ ఫోన్లు వాస్త‌వానికి ప‌లు కార‌ణాల వ‌ల్ల పేలుతుంటాయి. బ్యాట‌రీని మ‌రీ అధిక స‌మ‌యం పాటు చార్జింగ్ చేసినా, చార్జింగ్‌లో ఉన్న‌ప్పుడు ఫోన్‌ను వాడినా, బ్రాండెడ్ చార్జ‌ర్లు లేదా కేబుల్స్‌ను వాడ‌క‌పోయినా, ఫోన్ హార్డ్ వేర్ లేదా సాఫ్ట్ వేర్‌లో స‌మ‌స్య‌లు ఉన్నా ఫోన్లు అప్పుడప్పుడు పేలుతాయి. కానీ తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న మ‌రోమారు ఫోన్ల సేఫ్టీపై సందేహాల‌ను లేవ‌నెత్తుతోంది. ఈ క్ర‌మంలోనే ఫోన్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement