త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asus Days Sale 2025 | అమెజాన్‌లో అసుస్ ప్ర‌త్యేక సేల్‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ల్యాప్ టాప్‌లు..

Asus Days Sale 2025 | ప్ర‌ముఖ కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ అసుస్ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అమెజాన్‌లో ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. అసుస్ డేస్ సేల్ పేరిట ఈ సేల్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా అసుస్‌కు చెందిన ప‌లు ఉత్ప‌త్తుల‌పై భారీ డిస్కౌంట్ల‌తోపాటు ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను సైతం అందిస్తున్నారు.

S

Technology | Published On Dec 26, 2025, 1.31 pm IST

Asus Days Sale 2025 | అమెజాన్‌లో అసుస్ ప్ర‌త్యేక సేల్‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ల్యాప్ టాప్‌లు..
Advertisement

Asus Days Sale 2025 | ప్ర‌ముఖ కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ అసుస్ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అమెజాన్‌లో ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. అసుస్ డేస్ సేల్ పేరిట ఈ సేల్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా అసుస్‌కు చెందిన ప‌లు ఉత్ప‌త్తుల‌పై భారీ డిస్కౌంట్ల‌తోపాటు ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను సైతం అందిస్తున్నారు. ఈ సేల్‌లో అసుస్‌కు చెందిన ల్యాప్ టాప్‌లు, డెస్క్ టాప్‌లు, యాక్స‌స‌రీలు, ఇత‌ర ఉత్ప‌త్తుల‌ను వినియోగ‌దారులు త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్న ఈ సేల్‌లో నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని సైతం అందిస్తున్నారు. అలాగే పాత ఉత్పత్తుల‌ను సుల‌భంగా ఎక్స్‌ఛేంజ్ కూడా చేయ‌వ‌చ్చు. దీంతోపాటు ఇప్ప‌టికే అసుస్ ఉత్పత్తుల‌ను వినియోగిస్తున్న‌వారు రూ.99 చెల్లించి అద‌న‌పు వారంటీని పొంద‌వ‌చ్చు. ఇలాగే ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా ఈ సేల్‌లో అందిస్తున్నారు.

ల్యాప్ టాప్‌ల‌పై..

అసుస్ నిర్వ‌హిస్తున్న ఈ సేల్‌లో ఆ కంపెనీకి చెందిన 14 ఇంచుల క్రోమ్‌బుక్‌ను రూ.26,990 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందులో 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ వంటి స‌దుపాయాలు ల‌భిస్తున్నాయి. అలాగే అసుస్ వివోబుక్ గో 14 ల్యాప్ టాప్ ధ‌ర ఈ సేల్‌లో రూ.30,990గా ఉంది. అసుస్ వివోబుక్ గో 14 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్‌ను రూ.31,990కి కొనుగోలు చేయ‌వ‌చ్చు. అసుస్ వివోబుక్ 15ను ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెస‌ర్‌తో రూ.34,990కి కొన‌వ‌చ్చు. ఈ మోడ‌ల్‌లోనే 12జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.36,990 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

డెస్క్‌టాప్‌ల‌ను కూడా..

ఈ సేల్‌లో అసుస్ వివోబుక్ 16 ల్యాప్ టాప్‌ను రూ.58,990 ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. అలాగే అసుస్ టీయూఎఫ్ గేమింగ్ ల్యాప్ టాప్ (రూ.64,990), అసుస్ వివోబుక్ 15 ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెస‌ర్ ల్యాప్ టాప్ (రూ.66,990), అసుస్ వివోబుక్ 16ఎక్స్ (రూ.68,990), అసుస్ టీయూఎఫ్ గేమింగ్ విత్ ఎఫ్‌16 (రూ.69,990), అసుస్ వివోబుక్ ఎస్‌14 (రూ.72,990), అసుస్ వివోబుక్ ఎస్‌16 ఏఐ ల్యాప్ టాప్ (రూ.78,990), అసుస్ టీయూఎఫ్ ఎఫ్‌16 గేమింగ్ ల్యాప్ టాప్ (రూ.1,39,990) ల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ సేల్‌లో అసుస్‌కు చెందిన ప‌లు డెస్క్‌టాప్‌ల‌ను సైతం త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. రూ.33,990కే అసుస్ ఆలివ‌న్ వ‌న్ ఎ3202 పీసీని కొన‌వ‌చ్చు. అలాగే రూ.41,990కి అసుస్ ఆలిన్ వ‌న్ ఎ3202 డెస్క్‌టాప్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెస‌ర్‌తో ల‌భిస్తుంది. అసుస్ ఆలిన్ వ‌న్ వి470 డెస్క్‌టాప్‌ను రూ.70,990కి అందిస్తున్నారు.

బ్యాంకు ఆఫ‌ర్లు సైతం..

అసుస్‌కు చెందిన ఆర్‌వోజీ బీపీ4701 గేమింగ్ ల్యాప్ టాప్ బ్యాక్ ప్యాక్‌, అసుస్ ఓఎస్‌200 యూఎస్‌బీ టైప్ సి డాంగిల్‌, అసుస్ వైర్ లెస్ కీబోర్డు, మార్ష్ మాలో ఎండీ100 యూఎస్‌బీ మౌస్‌, ఆర్‌వోజీ బీపీ1501 ల్యాప్ టాప్ బ్యాక్ ప్యాక్‌, మార్ష్‌మాలో కేడబ్ల్యూ100 కీబోర్డు వంటి యాక్స‌స‌రీల‌ను కూడా ఈ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌ల‌కు పొంద‌వ‌చ్చు. ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల‌తో రూ.4500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బ‌రోడా కార్డుల‌తో రూ.3250, హెచ్ఎస్‌బీసీ కార్డుల‌తో రూ.3750, వ‌న్ కార్డ్ క్రెడిట్ కార్డుల‌తో రూ.3500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. మ‌రిన్ని వివరాల‌కు అమెజాన్‌లోని అసుస్ స్టోర్ పేజ్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement