త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fastag KYV | ఫాస్టాగ్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌.. ఇక‌పై KYV అవ‌స‌రం లేదు..

Fastag KYV | నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహ‌న‌దారుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై నూత‌నంగా వాహ‌నాల‌కు ఫాస్టాగ్ తీసుకుంటే నో యువ‌ర్ వెహికిల్ (KYV) ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, దీన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. అలాగే ఇప్ప‌టికే ఫాస్టాగ్‌ను వాడుతున్న‌వారికి కూడా రొటీన్ చెక‌ప్ లో భాగంగా KYV అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

S

Business | Published On Jan 2, 2026, 1.15 pm IST

Fastag KYV | ఫాస్టాగ్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌.. ఇక‌పై KYV అవ‌స‌రం లేదు..
Advertisement

Fastag KYV | నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహ‌న‌దారుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై నూత‌నంగా వాహ‌నాల‌కు ఫాస్టాగ్ తీసుకుంటే నో యువ‌ర్ వెహికిల్ (KYV) ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, దీన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. అలాగే ఇప్ప‌టికే ఫాస్టాగ్‌ను వాడుతున్న‌వారికి కూడా రొటీన్ చెక‌ప్ లో భాగంగా KYV అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ఈ నూత‌న నిబంధ‌న‌లు కార్లు, జీపులు, వ్యాన్ వంటి వాహ‌నాల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో ఈ కొత్త నిబంధ‌న‌ల‌ను ఫిబ్ర‌వ‌రి 1, 2026 నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. దీని కార‌ణంగా కొత్తగా ఫాస్టాగ్ తీసుకునే వారికి యాక్టివేష‌న్ భారం ఉండ‌ద‌ని, ఫాస్టాగ్‌ను మంజూరు చేసే బ్యాంకులే వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల్సి ఉంటుంద‌ని తెలిపింది.

ముందుగా వాహ‌నాల త‌నిఖీ..

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌ల కార‌ణంగా వాహ‌న‌దారులు ఫాస్టాగ్‌ను కొత్త‌గా తీసుకుంటే అది వెంట‌నే యాక్టివేట్ అవుతుంది. కానీ వారు త‌మ వాహ‌న వివ‌రాల‌ను వెరిఫై చేసుకునే వ‌ర‌కు ఫాస్టాగ్ ప‌నిచేయ‌దు. ఈ ప్ర‌క్రియ‌కు చాలా స‌మ‌యం ప‌డుతోంది. వెరిఫికేష‌న్ చాలా ఆల‌స్యంగా అవుతోంది. దీంతో ఫాస్టాగ్‌ను ముందే యాక్టివేట్ చేసి కూడా ఉప‌యోగం ఉండ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఈ స‌మ‌స్య‌ను తొల‌గించేందుకు NHAI నూత‌నంగా ఆయా నిబంధ‌న‌లను ప్ర‌వేశ‌పెట్టింది. ఇక నూత‌న నిబంధ‌న‌ల ప్ర‌కారం వాహ‌న‌దారులు ఫాస్టాగ్ తీసుకున్నాక యాక్టివేట్ అవ‌దు. ముందుగా వాహ‌న వివ‌రాల‌ను బ్యాంకులు త‌నిఖీ చేస్తాయి. అందుకు గాను వాహ‌న్ డేటాబేస్‌ను వారు ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వాహ‌న‌దారుడితో సంబంధం లేకుండా బ్యాంకులే నిర్వ‌హించాలి.

వాహ‌న్ డేటాబేస్‌తో..

ఈ క్ర‌మంలో వాహ‌న్ డేటాబేస్‌లో ఉన్న వివ‌రాల‌తో వాహ‌న‌దారుడి వాహ‌న వివ‌రాలు పోల్చుకుని త‌నిఖీ చేస్తే అప్పుడు ఫాస్టాగ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో ఫాస్టాగ్‌ను వాహ‌న‌దారులు వెంట‌నే ఉప‌యోగించుకోవ‌చ్చు. ఆ క్ర‌మంలో వాహ‌న‌దారులు మ‌ళ్లీ వేచి చూడాల్సిన పని ఉండ‌దు. అయితే బ్యాంకులకు వాహ‌న్ డేటాబేస్ ద్వారా వాహ‌న‌దారుడి వాహ‌న వివ‌రాలు ల‌భ్యం కాక‌పోతే వాహ‌నానికి సంబంధించిన ఆర్‌సీ వివ‌రాల‌తో ఫాస్టాగ్‌ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కూడా వాహ‌న‌దారుల వాహ‌న వివ‌రాలు వెరిఫై అవుతాయి. అయితే ఈ రెండు ప్ర‌క్రియ‌ల‌కు కూడా వాహ‌న‌దారుల‌కు సంబంధం ఉండ‌దు. బ్యాంకులే త‌నిఖీ చేప‌ట్టి ధ్రువీక‌రించాల్సి ఉంటుంది. దీంతో వాహ‌న‌దారుల‌కు చాలా వ‌ర‌కు భారం త‌ప్పనుంది. ఎంతో స‌మ‌యం ఆదా కానుంది. అలాగే ఫాస్టాగ్‌ను పొందిన వెంట‌నే ఉపయోగించుకోగ‌లుగుతారు.

ఇప్ప‌టికే ఫాస్టాగ్ ఉంటే..?

ఇక ఇప్ప‌టికే ఫాస్టాగ్ ఉన్న‌వారికి కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో మాత్ర‌మే మ‌ళ్లీ వెరిఫికేష‌న్ అవ‌స‌రం అవుతుంది. ఫిర్యాదులు ఏవైనా వ‌చ్చిన‌ప్పుడు, ఫాస్టాగ్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు ఉండ‌డం, ఫాస్టాగ్ పోవ‌డం, త‌ప్పుగా మంజూరు అవ‌డం, ఫాస్టాగ్‌ను దుర్వినియోగం చేయ‌డం వంటి సంద‌ర్భాల్లోనే వారు రీ వెరిఫికేష‌న్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారు క‌చ్చితంగా పాత నిబంధ‌న‌ల ప్ర‌కారం KYV చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా కొత్త నియ‌మాల‌ను ఫిబ్ర‌వ‌రి 1 నుంచి అమ‌లు చేయ‌నున్నారు. దీంతో ఎంతో మంది వాహ‌న‌దారుల‌కు ఫాస్టాగ్ తీసుకోవ‌డం సౌక‌ర్య‌వంతంగా మార‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement