MLA Kotha Prabhakar Reddy | దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
MLA Kotha Prabhakar Reddy | దుర్గం చెరువు వద్ద స్థలం ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. బీఎన్‌ఎస్ 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్ 3 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
MLA Kotha Prabhakar Reddy | త్రినేత్ర.న్యూస్ : దుర్గం చెరువు వద్ద స్థలం ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. బీఎన్‌ఎస్ 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్ 3 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గం చెరువు దగ్గర ఐదు ఎకరాలు కబ్జా చేసి ఆక్రమించిన స్థలాన్ని ప్రైవేటు ఆపరేటర్లకు అద్దెకు ఇచ్చినట్లు హైడ్రా అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం.. నాపై కక్షతో పెట్టిన కేసు అని ఆయన పేర్కొన్నారు.
హై కోర్టులో వేలం పెడితే రెండు ఎకరాలు కొన్నాం. అయితే తర్వాత చెల్లదని టీడీఆర్ ఇచ్చారు. తరువాత దుర్గం చెరువు నిర్మాణం జరిగింది. బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయి. ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు నాపై కేసు పెట్టారు. దుర్గం చెరువులో నాకు భూమి లేదు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
రోడ్డు మీద, చెట్ల కింద వెహికిల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారు. అక్కడ ప్రైవేట్ బస్సుల పార్కింగ్ చేస్తారు. అక్కడ ప్రభుత్వ భూమి గజం కూడా లేదు. ఎవ్వరూ పర్సనల్‌గా ఫిర్యాదు చేయలేదు... ఫిర్యాదులో హైడ్రా కనిపిస్తోంది. కేసు సమాచారం మా సిబ్బందికి పోలీసులు చెప్పారు. కేసుపై లీగల్ ఫైట్ చేస్తాం. పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను పోలీసులకు సహకరిస్తాను. బేషరుతుగా కేసు విత్ డ్రా చేయకపోతే... FTLలో ఇండ్లు కట్టారు.. ఆ ఇండ్ల ముందు ధర్నా చేస్తానని కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



