Gig Workers | గిగ్ వర్కర్ల మెరుపు సమ్మె…
Gig Workers | తమ సమస్యల పరిష్కారానికి గిగ్ వర్కర్లు (Gig Workers) వారం రోజుల జాతీయ సమ్మె (Strike)కు దిగడంతో వారం పాటు వారి సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), జెప్టో (Zepto), బ్లింకిట్ (Blinkit), అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి ఫుడ్ డెలివరీ, ఇతర ఇ-కామర్స్ సైట్ల డెలివరీ సేవలకు అంతరాయం కలుగనుంది.
ఏడు రోజులు నిలిచిపోనున్న సేవలు
ఇబ్బందులు ఎదుర్కోనున్న వినియోగదారులు
Gig Workers | తమ సమస్యల పరిష్కారానికి గిగ్ వర్కర్లు (Gig Workers) వారం రోజుల జాతీయ సమ్మె (Strike)కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏడు రోజుల పాటు వారి సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), జెప్టో (Zepto), బ్లింకిట్ (Blinkit), అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి ఫుడ్ డెలివరీ, ఇతర ఇ-కామర్స్ సైట్ల డెలివరీ పార్ట్‌నర్స్ ఈ సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో ఆయా సైట్ల సేవలు దాదాపుగా నిలిచిపోనున్నాయి, క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో వారి సేవలు వినియోగించుకుందామనుకున్న వినియోగదారులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
సమస్యల పరిష్కారానికి సమ్మెకు పిలుపునిచ్చిన సంఘాలు
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, కర్ణాటక యాప్ బేస్‌డ్ వర్కర్స్ యూనియన్ తదితర సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆయా కంపెనీలలో కార్మికులకు పని పరిస్థితులు, సామాజిక భద్రతా పరిస్థితులు రానురాను దిగజారుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. పైగా పది నిమిషాల డెలవరీతో గిగ్ వర్కర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే దానిని ఉపసంహించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పనిఒత్తిడి నుంచి రక్షించాలని డిమాండ్
కంపెనీలు గిగ్ వర్కర్లకు న్యాయమైన వేతనాలు అందజేయడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా వారికి కనీస భద్రత, గౌరవం, సామాజిక భద్రత కల్పించడం లేదని విమర్శిస్తున్నాయి. ఎక్కువ పనిగంటలు, హైరిస్క్ డెలవరీలు, ముఖ్యంగా ఎక్కువ డిమాండ్ ఉన్న సమయాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటున్నాయని వాపోతున్నాయి. పారదర్శకమైన ఆర్డర్‌కు చెల్లింపు, మెరుగైన ప్రోత్సాహక నిర్మాణాలు, తప్పనిసరి విశ్రాంతి విరామాలు, సహేతుకమైన పని గంటలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దానితో పాటు డెలివరీ ఐడీలను ఎలాంటి సరైన కారణాలు లేకుండా ఏకపక్షంగా బ్లాక్ చేయడం, అక్రమంగా విధించిన జరిమానాలను నిలిపివేయాలని కోరుతున్నారు. తమ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, కంపెనీలను నియంత్రించడంతో పాటు గిగ్ కార్మికులకు ప్రత్యేక కార్మిక చట్టాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Fire TV Stick HD | అమెజాన్ కొత్త ఫైర్ టీవీ స్టిక్ హెచ్డీ విడుదల.. అద్భుతమైన ఫీచర్లతో అప్ గ్రేడ్..
మే 19, 2026

moto g37 and g37 Power | భారత్‌లో లాంచ్ అయిన మోటో జి37 సిరీస్.. భారీ బ్యాటరీతో అదిరిపోయిన ఫీచర్లు..
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



