త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | నైట్ ఎకానమీగా మూసీ నది.. హోటల్స్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయిస్తాం

మూసీకి ఉత్తనీళ్లే తీసుకొస్తరా? లేక వ్యాపార కేంద్రంగా చేస్తరా అని అడిగారు. దానికి సమాధానం చెబుతున్నా. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిండు అంటున్నారు. రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ. దాన్ని ప్రమోట్ చేసి అవసరమైన వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత

J

Flash news | Published On Jan 2, 2026, 1.04 pm IST

Revanth Reddy | నైట్ ఎకానమీగా మూసీ నది.. హోటల్స్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయిస్తాం
Advertisement

  • నేదురుమల్లి హైటెక్ సిటీని కట్టలేదు
  • చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మాణం చేశారు
  • ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందా?
  • టోక్యో సిటీలో తెలంగాణ జనాభా కంటే ఎక్కువ మంది
  • కడుపునిండా మీకు విషం ఎందుకు?
  • ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ
  • మూసీ నది చుట్టూ నాలుగు మతాల సమ్మేళనం
  • బాపు ఘాటు దగ్గర గాంధీ సరోవర్
  • వికారాబాద్ కా హవా.. లాకోంకా దవా

Revanth Reddy | మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగరమంతా రాత్రి 9 గంటలకు నిద్ర పోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి హోటల్స్, ఆఫీసులు, ఫుడ్ కోర్టులు, కల్చరల్ ఆఫీసులు అన్నింటిని కూడా ప్రపంచస్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని రేవంత్ తెలిపారు. మూసీ నది పునరుద్ధరణపై శాసనసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళన గురించి వివరాలు సభ ముందుంచారు.

మూసీకి ఉత్తనీళ్లే తీసుకొస్తరా? లేక వ్యాపార కేంద్రంగా చేస్తరా అని అడిగారు. దానికి సమాధానం చెబుతున్నా. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిండు అంటున్నారు. రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ. దాన్ని ప్రమోట్ చేసి అవసరమైన వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత. ఈ నగరంలో రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈరోజు ఎకానమీని పెంచుకోవాలంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నారు.

ఆరోజు వైఎస్ఆర్, అంతకంటే ముందు నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. పీ జనార్ధన్ రెడ్డి పట్టుబట్టి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీవీనర్సింహారావు వచ్చి హైటెక్ సిటీకి శిలాఫలకం వేశారు. తర్వాత ఆగిపోయింది. చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్లీ చంద్రబాబు.. అటల్ బిహారీ వాజ్‌పేయి వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా? ప్రభుత్వానికి ఏం పని ఉంది. ఈరోజు విస్తరించిన నగరం ఎలా వచ్చింది. సైబరాబాద్ ఎలా వచ్చింది. ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ ఎలా వచ్చాయి. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ టు నాలెడ్జ్ పార్క్‌లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. పట్టణ ప్రాంతాలు పెరుగుతున్నాయి. పట్టణీకరణ జరుగుతోంది. 55 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు. రాబోయే 25 ఏళ్లలో 75 శాతానికి పట్టణ జనాభా పెరుగుతుంది. ఔటర్ రింగ్ ఇన్ సైడ్ ఒక కోటి 34 లక్షల మంది నివసిస్తున్నారు.

టోక్యో సిటీలో 4 కోట్ల మంది నివాసం

టోక్యో సిటీలో తెలంగాణ జనాభా కంటే ఎక్కువ మంది ఉన్నారు. 4 కోట్ల మంది ఒక్క పట్టణంలో నివసిస్తున్నారు. ఈరోజు ప్రపంచమంతా పట్టణాల వైపు విస్తరిస్తోంది. దానికి తగ్గట్టుగా నగరాలను విస్తరించాలి. ఈరోజు వికసిత్ భారత్ ప్రణాళిక ఏంటి.. అని సీఎం చెబుతుండగా బీఆర్ఎస్ సభ్యులు సీఎం ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మూసీ కాలుష్యం కంటే వీళ్ల కడుపులో ఎక్కువ విషం

వాళ్ల బాధ చూడండి.. కడుపునిండా విషం. మూసీ కాలువల్లో ఉన్న కాలుష్యం కంటే వీళ్ల కడుపులోనే ఎక్కువ విషం ఉంది. మూషీ కాలుష్యం కంటే ప్రమాదకరంగా తయారైంది. వీళ్లను విమర్శించానా? ప్రభుత్వం కార్యక్రమాలు ఏం చేపట్టబోతోందో.. సభలో సభ్యులు అడిగారు. పాయల్ శంకర్ అడిగారు.. మేము సభ్యులము ప్రభుత్వం ఏం చేస్తున్నదో వివరించండి అని అడిగారు. నేను వివరాలు చెబుతుంటే విషం ఎందుకు కక్కుతున్నారు. క్వశ్చన్ అవర్ లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ రెండే ఉంటాయి. స్వీకర్ అనుమతించారు వివరించమని. ఈ చర్చ జరగొద్దు. నిజాం ప్రజలకు తెలవొద్దు.. ఈ నిజాలు ప్రజలకు తెలవొద్దు. కడుపు నిండా విషం. వాళ్ల కళ్లు చూడండి. వాళ్ల కళ్లకు శక్తి ఉంటే ఆ విషపు కళ్లతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్లు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు. అయినా మీ విషపు చూపులు ప్రజలకు అర్థం అవుతాయి.. అంటూ హరీశ్ రావును ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు.

ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ.

ఓల్డ్ సిటీ గురించి మాట్లాడుతూ.. అది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అన్నారు. దాన్ని రివైవ్ చేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ నగరంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తాం అని చెప్పి గౌలిగూడ వద్ద వదిలేసిన మెట్రోను చాంద్రాయణగుట్ట వరకు పొడిగిస్తున్నాం. లాండ్ అక్విజిషన్ జరుగుతోంది. మిరాలం ట్యాంక్ ను ప్రారంభించాం. మరో అతి పెద్ద ఫ్లైఓవర్ ను మన్మోహన్ సింగ్ పేరు మీద ప్రారంభించాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని చంద్రాయణగుట్టకు నిధులు ఇచ్చాం. ఇవన్నీ కూడా పాత నగరాన్ని ఇది మన తలమానికం, గొప్ప గౌరవం హైదరాబాద్ నగరం అని చెప్పి ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు.

ఈరోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత. ఆ నాడు కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేను తీసుకొని మూసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ ను చేసింది ఎవరు? ఈరోజు వివరాలు చెబుతుంటే ఆ నొప్పి ఎందుకు? ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ, పాయల్ శంకర్, కాలేరు వెంకటేశ్ అడుతున్నారు. వాళ్లను చూసి అయినా నేర్చుకోండి. నూటికి నూరు శాతం అంబర్ పేట శాసనసభ నియోజకవర్గంలో మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తాం అని ఆయన చెప్పారు. ఆయన బహిరంగంగానే చెప్పారు. పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కలిసి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. మీరు మంచి పని చేస్తున్నారు. మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా అందిస్తామని చెప్పారు.

ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే మీరు చేయాలంటున్నారా? వద్దంటున్నారా? ఒక్క మాటలో చెప్పండి. మీరు చేయాలని అనుకుంటే ఏం చేయాలో సూచన చెప్పండి. వద్దనుకుంటే మీ కడుపు మంట ఏంటో చెప్పండి. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెబుతన్నా. పట్టణమంతా రాత్రి 9 గంటలకు నిద్ర పోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి హోటల్స్, ఆఫీసులు, ఫుడ్ కోర్టులు, కల్చరల్ ఆఫీసులు అన్నింటిని కూడా ప్రపంచస్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పాను.

ఆ ప్రాంతంలో ఉన్న నష్టపోయే వాళ్లకు అత్యధిక నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టి ఇస్తాం. ఏదిక్కు లేని వాళ్లు, సర్వం కష్టాల్లో ఉండేవాడే మూసీ పక్కన ఇల్లు కట్టుకుంటాడు. మూసీ పక్కన శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలని అనుకుంటారా? ఒకప్పుడు నందనవనం కట్టారు కదా. ఈ ప్రాంతంలో నందనవనం పోయినప్పుడు ఎట్లా ఉంటుంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి వాళ్ల పిల్లలు చదువుకోవడానికి మంచి చదువు చెప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అంటే అది అట్లనే ఉండాలి అంటున్నారు. మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఏం చేశారు.. ఇప్పుడు వెళ్లి అక్కడ ఉండండి. వద్దు అనే వాళ్లు నెల రోజులు మూసీ నది పక్కన ఉండండి. అంబర్ పేట శ్మశాన వాటిక పక్కన పోయి వీళ్లను ఉండమని చెప్పండి. ఏ దుర్భరమైన పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఉన్నారో వాళ్లకు అర్థం అవుతుంది. ప్రపంచస్థాయి పరిశ్రమలను కన్సల్టెంట్లు గా పెట్టుకున్నాం. ఫస్ట్ ఫేజ్ కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ నగరంలో 5 ఏళ్లలో లక్షా యాబై వేల కోట్లు ఖర్చు పెట్టి మూసీ నది ప్రక్షాళన చేస్తాం అని చెబితే.. లక్షా యాబై వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేశారు.. రేవంత్ రెడ్డి 25 వేల కోట్లు తినేసిండు అని మాట్లాడుతున్నార

మూసీ పరివాహక ప్రాంతాల్లో మత సమ్మేళనం

మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది. 850 సంవత్సరాల పురాతన శివాలయం. ఈరోజు అక్కడ శివాలయం కడుతున్నాం. మన సంస్కృతిని కూడా పునరుద్దరిస్తున్నాం. ముందుకొచ్చిన తర్వాత మక్కా మసీదు ఉన్నది. అంతర్జాతీయ స్థాయి మసీదును కడుతాం. గౌలీగూడ దగ్గర సిక్కు మందిరం కడుతున్నాం. ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చి లాంటి పెద్ద చర్చిని కట్టబోతున్నాం. ఒక పక్కన దేవుడు, ఇంకోపక్కన అల్లా ఉంటాడు. మరో పక్కన సిక్కు దేవుడు, ఇంకోపక్కన ఏసు ప్రభువు ఉంటాడు. ఈ నాలుగు మతాలకు సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనం చేసి మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి కార్యక్రమాన్ని చేస్తున్నాం.

గోదావరి, కృష్ణా, మూసా, ఈసా నదుల అనుసంధానం ఇది

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం అక్కడ ఉండే వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు నీళ్లు శాశ్వతంగా అందులో ప్రవహించే విధంగా నగరాల నుంచి వచ్చే మొత్తం కాలుష్యాన్ని నియంత్రించి, సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ పెట్టి ట్రీట్ చేసి ఆ వాటర్ ని కూడా వినియోగించుకోవడానికి ప్రణాళకలు చేస్తున్నాం. సంవత్సరంనర నుంచి నిరంతరం పని చేస్తే ఇఫ్పుడే ఒక కొలిక్కి వచ్చాయి. ఇంకా డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రావడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు, అంచనాలు ఇవ్వడమే కాదు.. నిర్మాణంలో కూడా వాళ్ల సహకారం ఉండాలని అంతర్జాతీయ స్థాయి కంపెనీలను పెట్టుకున్నాం. డీపీఆర్ వచ్చిన తర్వాత బడ్జెట్ సెషన్ లో మీ అందరికీ డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు హౌస్ లో ప్రజెంట్ చేస్తా. మీ అందరి సూచనలు, సలహాలు తీసుకుంటా. మంచి ఉద్దేశంతో మూసీ నది ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నాం. నాలుగు నదుల అనుసంధానం ఇది. గోదావరి, కృష్ణా, మూసా, ఈసా నది. నాలుగు నదుల అనుసంధానం చేయగల ఏకైక అవకాశం తెలంగాణలో ఉంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు.

గాంధీ సరోవర్‌కి కేంద్రం సాయం

ఈ రోజు బాపు ఘాటు దగ్గర గాంధీ సరోవర్ నిర్మిస్తాం. దాని కోసం ప్రభుత్వం దగ్గర భూమి తక్కువ ఉంది. డిఫెన్స్ లాండ్ ఉంది. 200 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని అడిగాం. వెంటనే 60 ఎకరాలు ఇస్తాం. ఇంకో 50 ఎకరాలు ఇస్తా. గాంధీ సరోవర్ దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని కట్టాలి. అక్కడ గాంధీ ఫిలాసఫీని చెప్పాలి అన్నారు. కేంద్రం కూడా సాయం చేస్తోంది. ఆయన ముందుకు వచ్చి గాంధీ సరోవర్ కడుతున్నాం అంటే మెచ్చుకున్నారు. మేము 200 అడిగితే వంద వరకు ఇస్తా అన్నారు. ప్రాథమికంగా మంచి ప్రాజెక్టు. ఆ భూమి కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేంద్రంతో సయోధ్య పెట్టుకునేది మీలా కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తుంటే ఏదో ఒకటి మాట్లాడుతున్నారు.

సౌత్ కొరియాకు వెళ్లాలని చెప్పా

సభ్యులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా.. నాకేం అభ్యంతరం లేదు. నేను గతంలో ఇది నిర్మాణం చేయాలని అనుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ సౌత్ కొరియాకు వెళ్లమని చెప్పాను. కొందరు శాసనసభ్యులు వస్తా అన్నారు తర్వాత కొందరు రాలేదు. ఔటర్ రింగ్ రోడ్ ఇన్ సైడ్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు మా సూచన. మీరు వెళ్లండి. అక్కడ చూడండి. మీరందరూ విదేశీ పర్యటనకు వెళ్లండి. ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది. పర్యటన చేయండి. ప్రపంచస్థాయి మూసీ రివర్ డెవలప్ మెంట్ ఫ్రంట్ ను మనం అభివృద్ధి చేసుకుందాం. ప్రపంచంతో పోటీ పడుదాం. పేదలకు ఇబ్బంది కలిగితే వాళ్లకు ఏం న్యాయం చేయాలో చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు. మీ ఆస్తి, నా ఆస్తి అమ్మడం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుండే వాళ్లకు మంచి ఇండ్లు కట్టిద్దాం. స్కూళ్లు, హాస్పిటళ్లు కట్టిద్దాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఆ ప్రాంతం నుంచి తరలిపోవడానికి ఇబ్బంది ఉంటే అక్కడే భూమి చూసి అక్కడే ఇండ్లు కట్టి ఇద్దాం. మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. డీపీఆర్ రెడీ అయ్యాక సీఎం కార్యాలయంలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడదాం. మీరు చూసి సూచనలు ఇవ్వండి. గాంధీ సరోవర్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని పెట్టుకొ

వికారాబాద్ కా హవా.. లాకోంకా దవా.. మరిజ్ లోగోంకా దవా

నా సూచన ఒక్కటే ఈ కడుపులో విషాన్ని కొద్దిగా తగ్గించుకోండి. ఒకవేళ మందు లేకపోతే వికారాబాద్ కా హవా.. లాకోంకా దవా.. మరిజ్ లోగోంకా దవా. వాళ్లను తీసుకెళ్లి అక్కడే ఓ పది రోజులు ఉంచితేనే వాళ్ల కడుపులోని విషం తగ్గుతుంది అధ్యక్ష.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement
Advertisement