త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

realme Narzo 90x | భారీ బ్యాట‌రీ, అద్భుత‌మైన ఏఐ ఫీచ‌ర్ల‌తో లాంచ్ అయిన రియ‌ల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్లు..

S

Technology | Published On Dec 16, 2025, 3.41 pm IST

realme Narzo 90x | భారీ బ్యాట‌రీ, అద్భుత‌మైన ఏఐ ఫీచ‌ర్ల‌తో లాంచ్ అయిన రియ‌ల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్లు..
Advertisement

realme Narzo 90x | మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి మిడ్ రేంజ్, బ‌డ్జెట్ సెజిమెంట్‌ల‌లో నార్జో సిరీస్‌లో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. నార్జో 90, నార్జో 90ఎక్స్ పేరిట ఈ ఫోన్ల‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టారు. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. నార్జో 90ఎక్స్ స్మార్ట్ ఫోన్‌లో 6.8 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. క‌నుక డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. సూర్య‌కాంతిలోనూ డిస్‌ప్లే స్ప‌ష్టంగా క‌నిపించేలా దీనికి 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. ర్యామ్‌ను అద‌నంగా మ‌రో 10జీబీ వ‌ర‌క వ‌ర్చువ‌ల్‌గా పెంచుకునే వీలు క‌ల్పించారు. ఇక ఇందులో ఫోన్ హీట్ అవ‌కుండా ఉండేందుకు గాను ప్ర‌త్యేకంగా వీసీ కూలింగ్ సిస్ట‌మ్‌ను అమ‌ర్చారు.

నార్జో 90 ఎక్స్‌లో..

నార్జో 90ఎక్స్ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా, దీనికి ఎఐ ఎడిట్ జీనీ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఏఐ ఫీచ‌ర్ల‌తోపాటు ఈ కెమెరాను ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే ఈ ఫోన్‌కు ఐపీ69 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్‌ను కూడా ఇచ్చారు. ఈ ఫోన్‌లో ఏకంగా 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని అమ‌ర్చారు. ఈ ఫోన్‌కు ఇదే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఫోన్ ఏకంగా 2 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తుంద‌ని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌కు 60 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. అలాగే 6.5 వాట్ల రివ‌ర్స్ వైర్డ్ చార్జింగ్‌కు సైతం ఇందులో సపోర్ట్ ల‌భిస్తుంది. దీని కార‌ణంగా ఈ ఫోన్ స‌హాయంతో ఇత‌ర ఫోన్ల‌ను సైతం చార్జింగ్ చేయ‌వ‌చ్చు.

నార్జో 90 ఫోన్‌లో..

ఇక నార్జో 90 స్మార్ట్ ఫోన్‌లో 6.57 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా దీనికి ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుత‌మైన దృశ్యాల‌ను తెర‌పై వీక్షించ‌వ‌చ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. అలాగే హీట్‌కు గురికాకుండా ఉండేందుకు గాను ప్ర‌త్యేకంగా వీసీ కూలింగ్ సిస్ట‌మ్‌ను ఇందులో కూడా ఇచ్చారు. ఈ ఫోన్‌కు ఐపీ 65 డ‌స్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. ఇందులో వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ సెకండ‌రీ కెమెరా ఉన్నాయి. ముందు వైపు 50 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ లోనూ ఏఐ ఎడిట్ జీనీ పేరిట ఏఐ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

నార్జో 90 స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 15 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. దీనికి గాను 3 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌ను, 4 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తున్న‌ట్లు కంపెనీ తెలియ‌జేసింది. ఈ ఫోన్‌లోనూ 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇవ్వ‌గా దీనికి కూడా ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది. ఇక ఈ రెండు ఫోన్ల‌లోనూ 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ధ‌ర వివ‌రాలు..

రియ‌ల్‌మి నార్జో 90ఎక్స్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.13,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.15,499గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్ల‌పై ప‌రిమిత కాల డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్‌ను కొన్న‌వారికి రూ.2వేల బ్యాంకు డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీన్ని డిసెంబ‌ర్ 23 నుంచి అమెజాన్‌తోపాటు రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లో విక్ర‌యించ‌నున్నారు. ఇక రియ‌ల్‌మి నార్జో 90 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.16,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌రను రూ.18,499గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్ల‌పై రూ.1000 బ్యాంకు డిస్కౌంట్ ల‌భిస్తుంది. వీటిని డిసెంబ‌ర్ 24 నుంచి 26 తేదీల మ‌ధ్య ప్ర‌త్యేక సేల్‌లో విక్ర‌యించ‌నున్నారు. అమెజాన్‌, రియ‌ల్‌మి ఆన్ లైన్ స్టోర్‌ల‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement