త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS MLAs | అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భ నుంచి వాకౌట్ చేశారు. మూసీ పున‌రుజ్జీవంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స‌భ‌లో సమయం ఇవ్వకపోవడంతో నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

S

Telangana | Published On Jan 2, 2026, 12.42 pm IST

BRS MLAs | అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
Advertisement

BRS MLAs | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భ నుంచి వాకౌట్ చేశారు. మూసీ పున‌రుజ్జీవంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స‌భ‌లో సమయం ఇవ్వకపోవడంతో నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

ఇక సీఎం మూసీపై మాట్లాడారు ఒకే. ఆ త‌ర్వాత‌ విప‌క్ష స‌భ్యుల్లో కొంద‌రికి మైక్ ఇచ్చి మాకు ఇవ్వ‌క‌పోవ‌డం స‌రికాదు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి అవ‌కాశం ఇవ్వ‌కుండా.. క్లారిఫికేష‌న్ ఇవ్వ‌కుండా గొంతు నొక్క‌డం స‌రైంది కాదు. ప్ర‌శ్నోత్త‌రాల్లో ప్రొటెస్ట్ అనేది ఆ పార్టీ హ‌క్కు. రూల్ బుక్‌లో స్ప‌ష్టంగా ఉంది. మైక్ ఇవ్వ‌క‌పోవ‌డం స‌రికాదు అని హ‌రీశ్‌రావు అన్నారు.

యూరియా కొర‌త‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళ‌న‌

శాస‌న‌స‌భ స‌మావేశాలు రెండో రోజు ప్రారంభ‌మైన వెంట‌నే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళ‌న‌కు దిగారు. యూరియా కొర‌త‌, రైతుల ఇక్క‌ట్ల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అన్ని అంశాల‌పై చ‌ర్చించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబు ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌కు చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement