130 Inch Micro RGB TV | శాంసంగ్ నుంచి.. ప్రపంచంలోనే తొలి 130 ఇంచుల మైక్రో ఆర్‌జీబీ టీవీ..
130 Inch Micro RGB TV | అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2026 ను నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే అనేక కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను ఇందులో ప్రదర్శిస్తున్నాయి. ఇక సెస్ 2026 షోలో భాగంగా ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఓ వినూత్నమైన ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది.
Technology | Published On Jan 6, 2026, 10.42 am IST
130 Inch Micro RGB TV | అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2026 ను నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే అనేక కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను ఇందులో ప్రదర్శిస్తున్నాయి. ఇక సెస్ 2026 షోలో భాగంగా ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఓ వినూత్నమైన ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. ప్రపంచంలోనే తొలి 130 ఇంచుల మైక్రో ఆర్‌జీబీ టీవీని ఈ షోలో ఆవిష్కరించింది. ఆర్95హెచ్ పేరిట ఈ టీవీకి చెందిన మోడల్‌ను లాంచ్ చేశారు. మైక్రో ఆర్‌జీబీ టెక్నాలజీ ఆధారంగా ఈ టీవీ పనిచేస్తుంది. ప్రీమియం టీవీ రంగంలో భాగంగా ఈ టీవీని లాంచ్ చేసినట్లు శాంసంగ్ తెలియజేసింది.
భారీ కిటికీ లాంటి డిజైన్..
ఆర్95హెచ్ మోడల్ టీవీ టైమ్‌లెస్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఇది సంస్థకు చెందిన విప్లవాత్మకమైన ఆవిష్కరణ అని శాంసంగ్‌కు చెందిన ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా తెలిపారు. 2013లో తమ కంపెనీ ప్రవేశపెట్టిన టైమ్‌లెస్ గ్యాలరీ అనే డిజైన్‌ను ఆధారంగా చేసుకుని ఆర్95హెచ్ మోడల్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ డిజైన్ వల్ల ఈ టీవీ పూర్తిగా ఒక భారీ కిటికీని పోలి ఉంటుంది. అందువల్ల దీన్ని చూస్తే సాధారణ టీవీని వీక్షిస్తున్నట్లు అనిపించదు. ఒక భారీ కిటికీని చూసినట్లు ఉంటుంది. దీన్ని ఫ్లోటింగ్ స్క్రీన్ ఎఫెక్ట్ వచ్చేలా ఆకర్షణీయమైన బోర్డర్లతో తీర్చిదిద్దారు.
అనేక ఏఐ ఫీచర్లు..
ఈ టీవీలోనే అంతర్గత ఆడియో సిస్టమ్‌ను కూడా పొందు పరిచారు. కనుక ప్రత్యేకంగా సౌండ్ సిస్టమ్‌ను కనెక్ట్ చేయాల్సిన పని ఉండదు. కానీ హోమ్ థియేటర్ లాంటి ఎక్స్‌పీరియెన్స్ కావాలనుకుంటే మాత్రం సౌండ్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల థియేటర్ లాంటి అనుభవం లభిస్తుంది. ఇక ఈ టీవీలో ప్రత్యేకంగా మైక్రో ఆర్‌జీబీ ఏఐ ఇంజిన్ ప్రొ, కలర్ బూస్టర్ ప్రొను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఏఐ సహాయంతో టీవీ తెరపై అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తుంది. నాణ్యతలో ఎక్కడా లోపం కనిపించదు. అలాగే కళ్లకు హాని కలిగించని విధంగా టీవీ తెరకు గ్లేర్ ఫ్రీ టెక్నాలజీ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. ఇక ఈ టీవీలో హెచ్‌డీఆర్ 10 ప్లస్ సదుపాయం ఉంది. కనుక తెరపై అద్భుతమైన క్వాలిటీతో దృశ్యాలను వీక్షించవచ్చు. అలాగే పలు ఏఐ టూల్స్‌ను కూడా అందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన కో పైలట్‌తోపాటు పర్‌ప్లెక్సిటీ, ఏఐ ఫుట్ బాల్ మోడ్ ప్రొ, ఏఐ సౌండ్ కంట్రోలర్ ప్రొ, లైవ్ ట్రాన్స్‌లేట్, జనరేటివ్ వాల్ పేపర్ వంటి ఏఐ సదుపాయాలను ఈ టీవీలో పొందవచ్చు. అయితే ఆర్95హెచ్ టీవీకి ప్రస్తుతం ఎలాంటి పేరు పెట్టలేదు. అలాగే దీని ధర వివరాలను కూడా వెల్లడించలేదు. కేవలం సెస్ 2026లో ప్రదర్శించారు. కనుక ఈ టీవీ లాంచింగ్ ఎప్పుడు, దీని ధర ఎంత ఉండొచ్చు.. అనే వివరాలు మాత్రం తెలియవు.
సంబంధిత వార్తలు

Samsung | రీఫర్బిష్డ్ ఫోన్లను స్వయంగా విక్రయిస్తున్న శాంసంగ్.. వినూత్న ప్రోగ్రామ్ ప్రారంభం..
మే 11, 2026

Samsung | గెలాక్సీ ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు.. ప్రకటించిన శాంసంగ్..
మే 11, 2026

Samsung Solve for Tomorrow | శాంసంగ్ సాల్వ్ ఫర్ టుమారో 5వ ఎడిషన్.. విద్యార్థులు రూ.2 కోట్ల వరకు గ్రాంట్లు పొందే చాన్స్..
మే 9, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



