Smart Phone Prices | స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి.. ఫోన్ కొనాలనుకుంటే త్వర పడండి..
Smart Phone Prices | నిన్న మొన్నటి వరకు అనేక స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఇయర్ ఎండింగ్, న్యూ ఇయర్, క్రిస్మస్ సందర్భంగా తగ్గింపు ధరలకే ఫోన్లను అందించాయి. కానీ ప్రస్తుతం ఫోన్ల ధరలను మాత్రం పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ ఈ జాబితాలో మొదటగా పలు ఫోన్ల ధరలను పెంచింది.
Technology | Published On Jan 5, 2026, 11.32 am IST
Smart Phone Prices | నిన్న మొన్నటి వరకు అనేక స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఇయర్ ఎండింగ్, న్యూ ఇయర్, క్రిస్మస్ సందర్భంగా తగ్గింపు ధరలకే ఫోన్లను అందించాయి. కానీ ప్రస్తుతం ఫోన్ల ధరలను మాత్రం పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ ఈ జాబితాలో మొదటగా పలు ఫోన్ల ధరలను పెంచింది. శాంసంగ్‌కు చెందిన పలు సిరీస్ ఫోన్ల ధరలు ప్రస్తుతం పెరిగాయి. 2025 చివరి త్రైమాసికం వరకు కూడా ఫోన్ల ధరలు తక్కువగానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఫోన్ల ధరలను మాత్రం పెంచుతున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయని టెక్ నిపుణులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ప్రస్తుతం చిప్‌ల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఫోన్ల ధరలను పెంచక తప్పడం లేదని అంటున్నాయి.
ఏయే ఫోన్ల ధరలు పెరిగాయంటే..
శాంసంగ్ సంస్థ జనవరి 5, 2025 సోమవారం నుంచి పలు ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు తెలియజేసింది. గెలాక్సీ ఎ56, ఎ36, ఎఫ్17 ఫోన్ల ధరలను ఈ మేరకు ఆ సంస్థ పెంచింది. గెలాక్సీ ఎ56కు చెందిన అన్ని మోడల్స్ ధరలను రూ.2వేలు పెంచగా, ఎ36కు చెందిన అన్ని మోడల్స్ ధరలను రూ.1500 మేర పెంచారు. అలాగే ఎఫ్17 సిరీస్‌కు చెందిన ఫోన్ల ధరలను రూ.1000 మేర పెంచుతున్నట్లు తెలిపారు. పెరిగిన ధరలు సోమవారం నుంచే అమలవుతాయని అన్నారు. అయితే గెలాక్సీ ఎస్25 సిరీస్ ఫోన్లు, జడ్ ఫోల్డ్ 7, జడ్ ఫ్లిప్ 7 వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలను మాత్రం శాంసంగ్ పెంచడం లేదని తెలిపింది. అలాగే త్వరలో రిలీజ్ కానున్న గెలాక్సీ ఎస్26 ఫోన్ల ధరలపై కూడా ఈ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ క్రమయంలో కేవలం మిడ్ రేంజ్ ఫోన్ల ధరలను మాత్రమే శాంసంగ్ పెంచిందని అర్థమవుతోంది. అయితే ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తాయా, లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
పెంపు అనంతరం ధరలు ఇవే..
ఇక ఆయా ఫోన్ల ధరలు పెరగడంతో కొత్త ధరలను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శాంసంగ్ గెలాక్సీ ఎ56కు చెందిన 12జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.44,999 ఉండగా అది ఇప్పుడు రూ.46,999కు చేరుకుంది. ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ, 256జీబీ మోడల్ ధర పెరిగిన అనంతరం రూ.43,999గా ఉంది. 8జీబీ, 128జీబీ మోడల్ ధర కూడా పెరిగిన అనంతరం రూ.40,999కు లభిస్తోంది. ఇక గెలాక్సీ ఎ36కు చెందిన 12జీబీ, 256జీబీ మోడల్ ధర పెంపు అనంతరం రూ.38,499 గా ఉండగా, 8జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.35,499, 8జీబీ 128జీబీ మోడల్ ధర రూ.32,499గా ఉంది. అలాగే ఎఫ్17 5జి ఫోన్‌కు చెందిన 4జీబీ, 128జీబీ మోడల్ ధర పెంపు అనంతరం రూ.15,499 ఉండగా, 6జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.16,999, 8జీబీ, 128జీబీ మోడల్ ధర పెంపు అనంతరం రూ.18,499గా ఉంది.
అయితే శాంసంగ్ ఆయా ఫోన్ల ధరలను పెంచింది కనుక ఇతర కంపెనీలు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతాయని, కనుక త్వరలోనే అన్ని కంపెనీలకు చెందిన మిడ్ రేంజ్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కనుక ఫోన్‌ను కొనాలని అనుకుంటున్న వారు వెంటనే తీసుకోవాలని, ఇంకా ఆలస్యం చేస్తే ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్‌షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Instagram Instants | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్స్టంట్స్ ఫీచర్.. ఫోటోలు చూసిన వెంటనే మాయం..
మే 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



