త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Galaxy S25 | శాంసంగ్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. భారీ త‌గ్గిన ఎస్‌25 స్మార్ట్ ఫోన్ ధ‌ర‌..

Samsung Galaxy S25 | శాంసంగ్ సంస్థ ప్ర‌తి ఏడాది ఇదే స‌మ‌యంలో గెలాక్సీ ఎస్ సిరీస్‌తో నూత‌న ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ల‌ను రిలీజ్ చేస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రికొద్ది రోజుల్లో ఎస్‌26 ఫోన్ల‌ను ఆ సంస్థ లాంచ్ చేయ‌నుంది. అయితే ఎస్‌26 ఫోన్ల‌ను లాంచ్ చేయ‌బోతున్నందున ఎస్‌25 సిరీస్‌కు చెందిన ఫోన్ల ధ‌ర‌ల‌ను ఆ సంస్థ ప్ర‌స్తుతం త‌గ్గించింది.

S

Technology | Published On Jan 4, 2026, 7.19 am IST

Samsung Galaxy S25 | శాంసంగ్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. భారీ త‌గ్గిన ఎస్‌25 స్మార్ట్ ఫోన్ ధ‌ర‌..
Advertisement

Samsung Galaxy S25 | శాంసంగ్ సంస్థ ప్ర‌తి ఏడాది ఇదే స‌మ‌యంలో గెలాక్సీ ఎస్ సిరీస్‌తో నూత‌న ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ల‌ను రిలీజ్ చేస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రికొద్ది రోజుల్లో ఎస్‌26 ఫోన్ల‌ను ఆ సంస్థ లాంచ్ చేయ‌నుంది. అయితే ఎస్‌26 ఫోన్ల‌ను లాంచ్ చేయ‌బోతున్నందున ఎస్‌25 సిరీస్‌కు చెందిన ఫోన్ల ధ‌ర‌ల‌ను ఆ సంస్థ ప్ర‌స్తుతం త‌గ్గించింది. క‌నుక గెలాక్సీ ఎస్‌25 ఫోన్ల‌ను కొనాల‌ని చూస్తున్న వారికి ఇదే మంచి స‌మ‌యం అని చెప్ప‌వ‌చ్చు. ఎస్‌25 ఫోన్‌పై ఏకంగా రూ.15,500 మేర ధ‌ర‌ను తగ్గించారు. అలాగే ప‌లు బ్యాంకు ఆఫ‌ర్ల‌తోపాటు, ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. దీంతో ఫోన్ ధ‌ర మ‌రింత త‌గ్గింది. అయితే అమెజాన్‌లో ప్ర‌స్తుతం ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంది.

భారీగా డిస్కౌంట్‌..

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఫోన్ ధ‌ర రూ.14వేలు త‌గ్గి ప్ర‌స్తుతం అమెజాన్ లో రూ.66,999 ధ‌ర‌కు అందుబాటులో ఉంది. అయితే దీనిపై మరో రూ.1500 బ్యాంక్ డిస్కౌంట్ సైతం ల‌భిస్తుంది. దీంతో మొత్తం క‌లిపి ఫోన్ ధ‌ర రూ.15,500 వ‌ర‌కు త‌గ్గింది. అయితే దీనిపై ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌ను సైతం అందిస్తున్నారు. క‌నుక వినియోగ‌దారులు త‌మ పాత ఫోన్ ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఆ మేర ఇంకా డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. వినియోగ‌దారులు ఎక్స్ ఛేంజ్ చేసే ఫోన్‌ను బ‌ట్టి డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఇలా ఎస్ 25 ఫోన్‌పై మ‌రింత డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఎస్‌26 ఫోన్ రిలీజ్‌పై ఇంకా సందిగ్ధ‌త నెల‌కొన్న‌ప్ప‌టికీ అతి త్వ‌ర‌లోనే ఈ ఫోన్ల‌ను శాంసంగ్ రిలీజ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎస్‌25 ఫోన్‌ల ధ‌ర‌లు త‌గ్గ‌డం విశేషం. ఇక ఈ ఫోన్ కు గాను అత్యంత త‌క్కువ‌గా నెల‌కు రూ.2355 ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు. క‌నుక ఈ ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్న‌వారు ప్ర‌స్తుతం ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవచ్చు.

ఎస్‌25 ఫీచ‌ర్లు ఇవే..

ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్‌25 ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే ఇందులో 6.2 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. క‌నుక డిస్‌ప్లే అద్భుత‌మైన క్వాలిటీని క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగ‌న్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్ ల‌భిస్తుంది. 12జీబీ ర్యామ్ ను ఇచ్చారు. 512జీబీ స్టోరేజ్ ల‌భిస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఇందులో ఉంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు, 15 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్‌కు ఇందులో స‌పోర్ట్ ల‌భిస్తుంది. క‌నుక ఫోన్‌ను రెండు ర‌కాలుగా వేగంగానే చార్జింగ్ చేసుకోవ‌చ్చు. అలాగే ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. మ‌రో 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. మ‌రో 10 మెగాపిక్స‌ల్ టెలిఫొటో కెమెరాను ఇచ్చారు. దీంతో 3 ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ ల‌భిస్తుంది. అలాగే ముందు వైపు 12 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement