Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర : తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | 220 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Talasani Srinivas Yadav | 220 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. 11న తేదీన లీ ప్యాలెస్‌లో అన్ని వర్గాలతో సమావేశ నిర్వహించనున్నట్లు తెలిపారు. 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీరోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీయనున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే జంట నగరాలుగా ప్రసిద్ధి అని, ఇది ప్రజా స్వామ్య ప్రభుత్వం అనే విషయాన్ని మరిచి రాచరిక పాలన సాగిస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గ్రామం నుంచి క్రమక్రమంగా విస్తరించిన ప్రాంతం మల్కాజిగిరి.. సికింద్రాబాద్‌కు ఎంతో గణ చరిత్ర ఉందన్నారు. డివిజన్‌ల విభజన కూడా అంతా గందరగోళం నిర్వహించారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా కార్యాలయాల్లో కూర్చొని మ్యాప్‌ల ఆధారంగా డివిజన్‌లను ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాదని, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిందని తలసాని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






