త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OPPO Reno15 | ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఏకంగా 3 ఫోన్ల‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు అద్భుతం..

OPPO Reno15 | మొబైల్స్ త‌యారీదారు ఒప్పో నూత‌నంగా ఫ్లాగ్ షిప్ రేంజ్‌లో మూడు స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఒప్పో రెనో 15, 15 ప్రొ, 15 ప్రొ మినీ పేరిట ఈ ఫోన్ల‌ను ఒప్పో ప్ర‌వేశ‌పెట్టింది. ఒప్పో రెనో 15 స్మార్ట్ ఫోన్‌లో 6.59 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

S

Technology | Published On Jan 10, 2026, 6.45 am IST

OPPO Reno15 | ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఏకంగా 3 ఫోన్ల‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు అద్భుతం..
Advertisement

OPPO Reno15 | మొబైల్స్ త‌యారీదారు ఒప్పో నూత‌నంగా ఫ్లాగ్ షిప్ రేంజ్‌లో మూడు స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఒప్పో రెనో 15, 15 ప్రొ, 15 ప్రొ మినీ పేరిట ఈ ఫోన్ల‌ను ఒప్పో ప్ర‌వేశ‌పెట్టింది. ఒప్పో రెనో 15 స్మార్ట్ ఫోన్‌లో 6.59 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.  ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగ‌న్ 7 జెన్ 4 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 8జీబీ, 12జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. 256జీబీ, 512 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ఉంది. వెనుక వైపు 50, 8, 50 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు వైపు 50 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ69 వాట‌ర్, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 5జి, వైఫై 6, యూఎస్‌బీ టైప్ సి, 6500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఒప్పో రెనో 15 ప్రొ స్మార్ట్ ఫోన్‌లో..

ఇక ఒప్పో రెనో 15 ప్రొ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచుల డిస్‌ప్లేను ఇవ్వ‌గా, మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెస‌ర్ ఉంది. 12జీబీ ర్యామ్‌, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్లు ల‌భిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌ను ఇచ్చారు. వెనుక వైపు 200, 50, 50 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు వైపు 50 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్ ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఐపీ69 డస్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. 5జి, యూఎస్‌బీ టైప్ సి, వైఫై 6, 6500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి సదుపాయాలు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఒప్పో రెనో15 ప్రొ మినీ స్మార్ట్ ఫోన్‌లో..

కాగా ఒప్పో రెనో15 ప్రొ మినీ స్మార్ట్ ఫోన్‌లో 6.32 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెస‌ర్ ఉండా, 12జీబీ ర్యామ్‌, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ల‌భిస్తుంది. వెనుక వైపు 200, 50, 50 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు వైపు 50 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ల‌భిస్తుంది. ఐపీ69 డస్ట్, వాట‌ర్ రెసిస్టెన్స్‌ను ఇచ్చారు. 5జి, వైఫై 6, యూఎస్‌బీ టైప్ సి, 6200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి స‌దుపాయాల‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

ధ‌ర ఎంతంటే..?

ఒప్పో రెనో 15 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.45,999 ఉండగా, 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.48,999గా నిర్ణ‌యించారు. 12జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధ‌ర రూ.53,999గా ఉంది. అలాగే ఒప్పో రెనో 15ప్రొ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.67,999 ఉండ‌గా, 12జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.72,999గా ఉంది. ఇక ఒప్పో రెనో 15 ప్రొ మినీ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.59,999 ఉండ‌గా, 12జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధ‌ర‌ను రూ.64,999గా నిర్ణ‌యించారు. ఇక ఈ ఫోన్లు అన్నీ జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో ఆన్ లైన్ స్టోర్‌, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్ల‌ను విక్ర‌యించ‌నున్నారు. వీటిపై ప‌లు బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్‌ను కూడా పొంద‌వ‌చ్చు. జీరో డౌన్ పేమెంట్ ఆప్ష‌న్‌ను కూడా అందిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement