POCO M8 5G | తక్కువ ధరకే పోకో ఎం8 5జి స్మార్ట్ ఫోన్ విడుదల.. ఫీచర్లు అదిరిపోయాయ్..
POCO M8 5G | మొబైల్స్ తయారీదారు షియోమీకి చెందిన సబ్ బ్రాండ్ పోకో భారత మార్కెట్‌లో పోకో ఎం8 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండగా, ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్ లో 6.77 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు.
Technology | Published On Jan 9, 2026, 7.02 am IST
POCO M8 5G | మొబైల్స్ తయారీదారు షియోమీకి చెందిన సబ్ బ్రాండ్ పోకో భారత మార్కెట్‌లో పోకో ఎం8 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండగా, ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్ లో 6.77 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా ఇచ్చారు. అందువల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. అలాగే సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా 3200 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఆరుబయట కూడా ఈ ఫోన్‌ను చాలా స్పష్టంగా వీక్షించవచ్చు. ఇక ఈ ఫోన్‌ను అత్యంత పలుచగా, తక్కువ మందంతో స్లీక్ డిజైన్‌తో తయారు చేశారు. కేవలం 7.35 ఎంఎం మందాన్ని మాత్రమే ఈ ఫోన్ కలిగి ఉంటుంది. కనుక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ దీనికి ప్రీమియం లుక్ వచ్చింది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను ఇవ్వగా 8జీబీ ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. దీనికి గాను 4 ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్‌ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో ఐపీ66 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా ఇచ్చారు. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో దృఢంగా ఉండేవిధంగా ఈ ఫోన్‌ను తీర్చిదిద్దారు. ఇందులో 5520 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని సైతం ఇచ్చారు. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్‌ను ఇస్తున్నారు. కనుక ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఫోన్‌తోపాటు బాక్స్‌లో చార్జర్‌ను కూడా అందిస్తున్నారు.

డాల్బీ అట్మోస్ కూడా..
6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల సిమ్ స్లాట్ లభిస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తోపాటు ఇన్ ఫ్రారెడ్ సెన్సార్‌ను కూడా ఇచ్చారు. కనుక ఈ ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్‌గా కూడా వాడుకోవచ్చు. డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా లభిస్తుంది. కనుక ఫోన్ అద్భుతమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. 5జి సేవలను ఇందులో ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ధర వివరాలు..
పోకో ఎం8 జి ఫోన్‌ను కార్బన్ బ్లాక్, ఫ్రాస్ట్ సిల్వర్, గ్లేషియల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999గా ఉంది. ఈ ఫోన్‌పై లాంచింగ్ సందర్భంగా రూ.2వేల వరకు ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ.1వేయి వరకు అదనపు డిస్కౌంట్ మొత్తం కలిపి రూ.3వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. కనుక లాంచింగ్ సమయంలోనే భారీ డిస్కౌంట్ ధరలకు ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ను జనవరి 13వ తేదీ నుంచి విక్రయించనుండగా ఫ్లిప్ కార్ట్‌లో దీన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఫోన్‌పై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

moto g37 and g37 Power | భారత్‌లో లాంచ్ అయిన మోటో జి37 సిరీస్.. భారీ బ్యాటరీతో అదిరిపోయిన ఫీచర్లు..
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



