త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raja Saab Song | రాజాసాబ్‌పై కాపీ ఆరోప‌ణ‌లు – చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన డీజే

స్వీడ‌న్‌కు చెందిన డీజే విడోజీన్ త‌మ‌న్‌కు వార్నింగ్ ఇచ్చాడు. తాను కంపోజ్ చేసిన అలేమాయో అనే పాట‌ను కాపీ కొట్టి త‌మ‌న్ రాజాసాబ్‌లోని నాచే నాచే సాంగ్‌ను కంపోజ్ చేశాడంటూ వీడోజీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టాడు. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Jan 10, 2026, 3.42 pm IST

Raja Saab Song | రాజాసాబ్‌పై కాపీ ఆరోప‌ణ‌లు – చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన డీజే
Advertisement

Raja Saab Song | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌పై కాపీ ఆరోప‌ణ‌లు కొత్త కాదు. గ‌తంలో ప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్‌ను కాపీ కొట్టి నెటిజ‌న్ల‌కు దొరికిపోయాడు. వీటిపై చాలా సార్లు వివ‌ర‌ణ ఇచ్చినా విమ‌ర్శ‌లు మాత్రం ఆగ‌లేదు. తాజాగా మ‌రోసారి త‌మ‌న్ కాపీ వివాదంలో చిక్కుకున్నాడు. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాజాసాబ్ మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలోనే నాచే నాచే సాంగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. హిందీ లిరిక్స్‌తో సాగిన ఈ సాంగ్‌లో ప్ర‌భాస్ చాలా స్టైలిష్‌గా క‌నిపించాడు. ముగ్గురు హీరోయిన్ల‌తో అత‌డి స్టెప్పులు ఆక‌ట్టుకుంటున్నాయి.
అయితే నాచే నాచే పాట కాపీ అంటూ నెటిజ‌న్లు చెబుతున్నారు. స్వీడ‌న్‌కు చెందిన డీజే విడోజీన్ కంపోజ్ చేసిన అల‌మేయో పాట‌ను ట్యూన్స్ ను కాపీ చేసి త‌మ‌న్ ఈ పాట‌ను కంపోజ్ చేశాడ‌ని అంటున్నారు.

చెప్పుతో వార్నింగ్‌...

డీజే విడోజీన్ కూడా కాపీ ఆరోప‌ణ‌ల‌పై రియాక్ట్ అయ్యారు. తాను కంపోజ్ చేసిన పాట‌ను, నాచే నాచే పాట‌ను ప్లే చేస్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో పెట్టారు. రెండు ట్యూన్స్ సేమ్ టూ సేమ్ ఉన్నాయి. కాపీ  చేయడం త‌ప్పు అంటూ చెప్పు తీసి చూపిస్తూ త‌మ‌న్‌కు విడోజీన్ వార్నింగ్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 2024లోనే తాను ఒరిజినల్ సాంగ్ ను కంపోజ్ చేశానని విడోజీన్ పేర్కొన్నాడు.  విడోజీన్ వార్నింగ్‌కు త‌మ‌న్ ఎలా రియాక్ట్ అవుతాడ‌న్న‌ది చూడాల్సిందేన‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

డిస్కో డ్యాన్స‌ర్ మూవీ...

త‌మ‌న్ మాత్రం రాజాసాబ్ ప్ర‌మోష‌న్స్‌లో డిస్కో డ్యాన్స‌ర్ మూవీలోని నాచే నాచే పాట నుంచి స్ఫూర్తి పొంది ఈ పాట‌ను కంపోజ్ చేసిన‌ట్లు చెప్పారు. లీగ‌ల్‌లా ప‌ర్మిష‌న్ తీసుకొనే ఈ పాట‌కు ట్యూన్స్ స‌మ‌కూర్చిన‌ట్లు చెప్పారు. ఈ వివాదం ఆస‌క్తిక‌రంగా మారింది.
రాజాసాబ్ మూవీకి త‌మ‌న్ అందించిన మ్యూజిక్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నాచే నాచేతో పాటు మిగిలిన పాట‌లేవి బాగాలేవ‌ని చెబుతున్నారు. బీజీఎమ్ కూడా లౌడ్‌గా ఉంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అఖండ 2 విష‌యంలో ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ వ‌చ్చాయి.

 

View this post on Instagram

 

A post shared by Vidojean (@vidojean)

Advertisement

తాజావార్తలు

Advertisement