Oppo Reno 15C | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఒప్పో నూతన స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయి..?
Oppo Reno 15C | మొబైల్స్ తయారీదారు ఒప్పో భారత మార్కెట్‌లో నూతనంగా రెనో 15 సిరీస్‌లో మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. రెనో 15, రెనో 15 ప్రొ, రెనో 15 ప్రొ మినీ పేరిట ఈ ఫోన్లను ప్రవేశపెట్టారు. అయితే రెనో 15 సిరీస్‌లోనే తాజాగా మరో ఫోన్‌ను కూడా ఒప్పో విడుదల చేసింది.
Technology | Published On Jan 10, 2026, 12.59 pm IST
Oppo Reno 15C | మొబైల్స్ తయారీదారు ఒప్పో భారత మార్కెట్‌లో నూతనంగా రెనో 15 సిరీస్‌లో మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. రెనో 15, రెనో 15 ప్రొ, రెనో 15 ప్రొ మినీ పేరిట ఈ ఫోన్లను ప్రవేశపెట్టారు. అయితే రెనో 15 సిరీస్‌లోనే తాజాగా మరో ఫోన్‌ను కూడా ఒప్పో విడుదల చేసింది. ఒప్పో రెనో 15సి పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేయగా, ఇందులోనూ పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.57 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా దీనికి ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 12జీబీ ర్యామ్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తున్నారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను కూడా ఇచ్చారు. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ భారీ కెసాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. ఈ ఫోన్‌కు ఇదే ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. అలాగే ఈ ఫోన్‌కు 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. కనుక ఈ ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 5జి సదుపాయం కూడా ఉంది. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి సదుపాయాలను సైతం అందిస్తున్నారు.
ధర ఎంతంటే..?
ఒప్పో రెనో 15సి స్మార్ట్ ఫోన్‌ను ఆఫ్టర్ గ్లో పింక్, ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.34,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.37,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లలో, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విక్రయించనున్నారు. కాగా అంతకు ముందు రిలీజ్ చేసిన ఒప్పో రెనో 15, రెనో 15 ప్రొ, రెనో 15 ప్రొ మినీ ఫోన్ల కన్నా ఈ ఫోన్ ధర సగానికి సగం తక్కువగా ఉండడం విశేషం. ఆయా ప్రొ సిరీస్ ఫోన్లు రూ.45,999 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. టాప్ ఎండ్ మోడల్ ధర రూ.72,999గా ఉంది. అయితే ప్రొ సిరీస్‌తో పోలిస్తే తాజాగా విడుదల చేసిన రెనో 15సి ఫోన్ ఫీచర్ల విషయంలోనూ ఆకట్టుకుంటుండడం విశేషం.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Fire TV Stick HD | అమెజాన్ కొత్త ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ విడుదల.. అద్భుతమైన ఫీచర్లతో అప్ గ్రేడ్..
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



