త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone | భార‌త్‌లో అత్యధికంగా అమ్ముడ‌వుతున్న ఫోన్ ఇదే..!

iPhone | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ గ‌త సెప్టెంబ‌ర్ నెల‌లో ఐఫోన్ 17 సిరీస్‌లో ప‌లు నూత‌న ఐఫోన్ల‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఐఫోన్ 17, 17 ప్రొ, 17 ప్రొ మ్యాక్స్‌, ఐఫోన్ ఎయిర్ పేరిట ప‌లు ఐఫోన్ మోడ‌ల్స్‌ను లేటెస్ట్‌గా లాంచ్ చేశారు. అయితే ఈ ఫోన్లు రిలీజ్ అయిన‌ప్ప‌టికీ భార‌త్‌లో మాత్రం అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న ఫోన్‌గా ఐఫోన్ 16 రికార్డు సృష్టించింది.

S

Technology | Published On Dec 29, 2025, 2.23 pm IST

iPhone | భార‌త్‌లో అత్యధికంగా అమ్ముడ‌వుతున్న ఫోన్ ఇదే..!
Advertisement

iPhone | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ గ‌త సెప్టెంబ‌ర్ నెల‌లో ఐఫోన్ 17 సిరీస్‌లో ప‌లు నూత‌న ఐఫోన్ల‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఐఫోన్ 17, 17 ప్రొ, 17 ప్రొ మ్యాక్స్‌, ఐఫోన్ ఎయిర్ పేరిట ప‌లు ఐఫోన్ మోడ‌ల్స్‌ను లేటెస్ట్‌గా లాంచ్ చేశారు. అయితే ఈ ఫోన్లు రిలీజ్ అయిన‌ప్ప‌టికీ భార‌త్‌లో మాత్రం అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న ఫోన్‌గా ఐఫోన్ 16 రికార్డు సృష్టించింది. 2025లో మొద‌టి 11 నెల‌ల కాలానికి గాను అత్యధికంగా ఐఫోన్ 16 ఫోన్ల‌ను భార‌త్‌లోని వినియోగ‌దారులు కొనుగోలు చేశార‌ని కౌంట‌ర్ పాయింట్ రీసెర్చ్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఇదే కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను త‌ల‌ద‌న్నేలా ఐఫోన్ 16 అమ్మ‌కాలు రికార్డు స్థాయిలో పెరిగాయ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే అదే కాల వ్య‌వ‌ధిలో అత్య‌ధికంగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో ఐఫోన్ 15 సైతం టాప్ 5 లో నిల‌వ‌డం విశేషం. దీంతో ఐఫోన్ల ప‌ట్ల భార‌త్‌లో రోజు రోజుకీ మ‌రింత క్రేజ్ పెరుగుతుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అయితే ఐఫోన్ 16 అమ్మ‌కాలు భార‌త్‌లో గ‌ణ‌నీయంగా పెరిగేందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భార‌త్‌లో యాపిల్ సంస్థ ఐఫోన్ల ఉత్పత్తిని పెంచ‌డంతోపాటు మ‌రిన్ని ఎక్కువ మోడల్స్‌ను కూడా మ‌న ద‌గ్గ‌రే ఉత్ప‌త్తి చేస్తుందని, దీంతో ఆయా ఐఫోన్ల ధ‌ర‌లు చాలా వ‌రకు తగ్గాయ‌ని, ఈ క్ర‌మంలోనే ఆ ఫోన్ల‌ను వినియోగ‌దారులు భారీ ఎత్తున కొనుగోలు చేశార‌ని అన్నారు. అందుక‌నే సేల్స్ పెరిగిన‌ట్లు తెలిపారు. అలాగే యాపిల్ సంస్థ ఇటీవ‌లే బెంగ‌ళూరు, పూణె, నోయిడాల‌లో కొత్త‌గా సొంత రిటెయిల్ స్టోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీంతో దేశంలో ఉన్న యాపిల్ రిటెయిల్ స్టోర్స్ సంఖ్య 5కు చేర‌గా, ఐఫోన్ 15, 16 మోడ‌ల్స్‌పై అనేక ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నార‌ని కూడా తెలిపారు. నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్ బ్యాక్‌, డిస్కౌంట్ల‌ను అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. ఇవి కూడా ఆయా మోడ‌ల్స్ అమ్మ‌కాలు పెరిగేందుకు కార‌ణం అయ్యాయ‌ని అన్నారు.

కాగా ఈ ఏడాదిలో న‌వంబ‌ర్ నెల వ‌ర‌కు యాపిల్ సంస్థ విదేశాల‌కు భార‌త్ నుంచి ఎగుమ‌తి చేసిన ఐఫోన్ల విలువ 2 బిలియ‌న్ డాల‌ర్లు ఉండ‌గా, భార‌త్‌లో యాపిల్ ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 9 బిలియ‌న్ డాల‌ర్ల మేర అమ్మ‌కాల‌ను చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ఏడాదిలో ప్ర‌తి ఐదు మంది యూజ‌ర్లు వాడుతున్న ఐఫోన్‌లలో ఒక ఐఫోన్ భార‌త్‌లో ఉత్ప‌త్తి అయిన‌ది కావ‌డం విశేషం. దీని వ‌ల్ల యాపిల్ సంస్థ భార‌త్‌లో ఐఫోన్ల ఉత్ప‌త్తిని గ‌ణ‌నీయంగా పెంచింద‌ని, దీని కార‌ణంగానే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల‌కు భార‌త్ నుంచి పెద్ద ఎత్తున ఐఫోన్ల‌ను ఎగుమ‌తి చేస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ ఏడాదికి గాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఐఫోన్ల అమ్మ‌కాల్లో అమెరికా 43 శాతం వాటాను క‌లిగి ఉండ‌గా, అక్క‌డ అమ్ముడవుతున్న చాలా వ‌ర‌కు ఐఫోన్ల‌ను భార‌త్‌లోనే ఉత్ప‌త్తి చేయ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే ఐఫోన్ల ఉత్పత్తికి యాపిల్‌, అమెరికా భార‌త్ పై ఎక్కువ‌గా ఆధార ప‌డుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement