Swiggy Orders | న్యూ ఇయర్ పార్టీ.. 2 లక్షల బిర్యానీలను ఆరగించారు..
Swiggy Orders | ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు 2025 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ 2026 నూతన సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, గడిచిన ఏడాది లాగా ఎలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకోకూడదని కాంక్షిస్తూ అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలారు.
Swiggy Orders | ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు 2025 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ 2026 నూతన సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, గడిచిన ఏడాది లాగా ఎలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకోకూడదని కాంక్షిస్తూ అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలారు. అయితే న్యూ ఇయర్ పార్టీ అంటే కచ్చితంగా మద్యం ఉంటుంది. ఇక బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీ అంటే చాలా మందికి అది ఫేవరెట్ ఫుడ్‌గా మారింది. బిర్యానీ లేకుండా అసలు పార్టీలే ఉండవు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈసారి డిసెంబర్ 31వ తేదీన న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా భారీ ఎత్తున బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలియజేసింది.
2 లక్షల బిర్యానీల ఆర్డర్లు..
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీన రాత్రి 7.30 గంటల వరకు 2,18,993 బిర్యానీలను ఆర్డర్ చేశారని ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. అయితే రాత్రి 7.30 గంటలు అంటే అర్థరాత్రి వరకు ఇంకా చాలా సమయం ఉంటుంది కనుక పూర్తి స్థాయి సంఖ్య తెలియలేదు. కానీ అప్పటి వరకే 2 లక్షల బిర్యానీలు అంటే మనవాళ్లు బిర్యానీలను ఎలా ఆరగించారో అర్థం చేసుకోవచ్చు. అర్థరాత్రి వరకు ఆ సంఖ్య ఇంకా పెరిగి 5 లక్షలకు చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పార్టీ చేసుకునే చాలా మంది రాత్రి 9 గంటల వరకు 90వేల మేర బర్గర్‌లను ఆర్డర్ చేశారని కూడా స్విగ్గీ తెలియజేసింది.
సలాడ్స్ ఆర్డర్లా..?
అయితే న్యూ ఇయర్ పార్టీల సందర్భంగా బెంగళూరులో ఉన్న వారు ఎక్కువగా సలాడ్స్‌ను ఆర్డర్ చేశారని స్విగ్గీ పేర్కొంది. ఆ నగరంలో మొత్తం 2వేల వరకు సలాడ్స్ ఆర్డర్లు వచ్చాయని తెలియజేసింది. అయితే న్యూ ఇయర్ పార్టీలో అసలు సలాడ్స్‌ను ఎలా తింటారు, ఆ ఆలోచన ఎలా వచ్చింది..? ఇలాంటి వారు కూడా ఉంటారా..? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా 9వేల వరకు కిచిడీ ఆర్డర్లు కూడా వచ్చాయని, 8వేల మేర క్యారెట్ హల్వా ఆర్డర్లను స్వీకరించామని స్విగ్గీ తెలిపింది. అంటే న్యూ ఇయర్ పార్టీలో భాగంగా చాలా మంది ఈ స్వీట్‌ను తినేందుకు ఇష్టపడ్డారని తెలుస్తోంది. అయితే కేవలం స్విగ్గీలోనే ఇలా ఉందంటే ఇతర ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఎలాంటి ఫుడ్స్‌ను ఏ సంఖ్యలో ఆర్డర్ చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే జొమాటో వంటి యాప్‌లు కూడా ఆయా వివరాలను వెల్లడిస్తాయని ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్






