5 Star Rating | 5 స్టార్ రేటింగ్ ఏసీ లేదా ఫ్రిజ్ వాడుతున్నారా..? ఇకపై రేటింగ్‌ను 4 స్టార్‌గానే భావించాలి.. ఎందుకంటే..?
5 Star Rating | దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితితోపాటు బంగారం, వెండి ధరలు పెరుగుతుండడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2025 నుంచి పలు శ్లాబుల్లో జీఎస్‌టీని భారీగా తగ్గించిన విషయం తెలిసిందే.
5 Star Rating | దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితితోపాటు బంగారం, వెండి ధరలు పెరుగుతుండడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2025 నుంచి పలు శ్లాబుల్లో జీఎస్‌టీని భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక వస్తువులపై జీఎస్‌టీ తగ్గింపు కారణంగా వాటి ధరలు కూడా భారీగానే తగ్గాయి. ఎలక్ట్రానిక్స్ పై కూడా ధరల తగ్గింపు ప్రభావం పడింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేశారు. అయితే నూతన సంవత్సరం ప్రారంభం నుంచి ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు పెరగనున్నాయి. దీంతో ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ఇకపై లభ్యం కాదు. అలాగే ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు, ఫ్రిజ్‌లు కూడా ఒక స్టార్ రేటింగ్ తగ్గనున్నాయి.
బీఈఈ నిబంధనలు..
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) సూచించిన ప్రకారం జనవరి 1, 2026 నుంచి ఏసీలు, ఫ్రిజ్‌లకు గాను నూతన స్టార్ రేటింగ్‌ను అమలు చేయనున్నారు. అంటే ఇకపై 5 స్టార్ రేటింగ్‌తో విడుదల కానున్న ఏసీలు, ఫ్రిజ్‌లు ఇప్పటికే ఆ రేటింగ్ తో ఉన్న వస్తువుల కన్నా 10 శాతం తక్కువగా విద్యుత్‌ను వాడుకుంటాయి. కనుక కొత్తగా లాంచ్ అయ్యే ఆయా వస్తువులకు సాంకేతికంగా రేటింగ్ 6 ఉంటుంది. కానీ వాటిని 5 స్టార్ రేటింగ్‌తోనే విడుదల చేస్తారు. రేటింగ్స్ విషయంలో 1 నుంచి 5 అంకెలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. కనుక 6 స్టార్ రేటింగ్ ఇవ్వడం కుదరదు. కాబట్టి కొత్త వస్తువులు కూడా 5 స్టార్ రేటింగ్‌తోనే లాంచ్ అవుతాయి. ఇక ఇప్పటికే ప్రజలు వాడుతున్న 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు, ఫ్రిజ్‌లు కొత్త వాటి కన్నా 10 శాతం అదనంగా విద్యుత్‌ను వాడుకుంటాయి కనుక సాంకేతికంగా వాటిని 4 స్టార్ వస్తువులుగా భావించాలి. ఇలా ఆయా వస్తువుల రేటింగ్ మారుతుంది. అయితే ప్రజలు వాడే వస్తువులపై 5 స్టార్ రేటింగ్ ఉన్నప్పటికీ సాంకేతికంగా మాత్రం అవి నూతన నిబంధనల ప్రకారం 4 స్టార్ రేటింగ్ కిందకే వస్తాయి. ఇలా ఏసీలు, ఫ్రిజ్‌ల స్టార్ రేటింగ్ మారనుంది.

జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనం నష్టం..
అయితే 5 స్టార్ రేటింగ్ ఉన్నవి 4 స్టార్‌గా మారుతాయి కనుక ఆ కింద ఉన్నవి కూడా సాంకేతికంగా తగ్గినట్లే భావించాలి. అంటే ఇప్పటికే ఉన్న 4 స్టార్ వస్తువులను ఇకపై 3 స్టార్‌గా, 3 స్టార్ వాటిని 2 స్టార్‌గా, 2 స్టార్ రేటింగ్ ఉన్న వస్తువులను 1 స్టార్ గా సాంకేతికంగా భావించాల్సి ఉంటుంది. బీఈఈ నూతన నిబంధనల ప్రకారమే ఆయా వస్తువులకు స్టార్ రేటింగ్స్ మారనున్నాయి. అయితే స్టార్ రేటింగ్స్ మారడమే కాకుండా ఏసీలు, ఫ్రిజ్‌లపై జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాన్ని ప్రజలు కోల్పోనున్నారు. ఎందుకంటే కొత్త వస్తువులను మరింత తక్కువ విద్యుత్ ను వాడుకునేలా బీఈఈ నిబంధనల ప్రకారం కంపెనీలు తయారు చేస్తున్నాయి కనుక ఆయా వస్తువుల తయారీకి అవసరం అయ్యే ముడి పదార్థాల ఖర్చు పెరుగుతుంది. కనుక కొత్త వస్తువుల ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి. అయితే ఆ మేర ఇప్పటికే జీఎస్‌టీ ప్రయోజనం ఉంది కనుక ఆ మొత్తాన్ని మినహాయించుకుంటే మళ్లీ ఆయా వస్తువులకు పాత ధరలే ఉంటాయి. సెప్టెంబర్‌లో జీఎస్టీని తగ్గించక ముందు ఉన్న ధరలే ఇప్పుడు కూడా ఉంటాయి. అయితే కథ ఇక్కడితో ముగియలేదు.
3 నుంచి 6 శాతం మేర పెరిగే చాన్స్..
జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనం ద్వారా పాత ధరలే ఉన్నా ఆయా వస్తువుల తయారీకి అవసరం అయ్యే కాపర్, ఇతర ముడి పదార్థాల ధరలు భారీగా పెరిగాయని, కనుక ఆ వస్తువుల ధరలను పెంచాల్సి ఉంటుందని ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు. అందువల్ల ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు సెప్టెంబర్ కన్నా ముందు ఉన్న ధరలతో పోలిస్తే 3 నుంచి 6 శాతం మేర పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా కాపర్ ధరలు పెరిగిపోవడం, బీఈఈ సూచించిన నూతన ప్రమాణాలు, స్టార్ రేటింగ్, డాలర్‌తో రూపాయి విలువ బలహీన పడుతుండడం వంటివన్నీ ముడిపదార్థాల ధరలను పెంచేలా చేస్తున్నాయని, కనుక ఏసీలు, ఫ్రిజల ధరలు పెరుగుతాయని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ambrane Reneo | టైప్-సి ఛార్జింగ్‌తో ఆంబ్రేన్ కొత్త బ్యాటరీలు.. ఒక్కటి 100 సాధారణ బ్యాటరీలకు సమానం!
మే 14, 2026

Toshiba Z670SP | తొలి మినీ ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసిన తోషిబా.. అదిరిపోయిన డిస్ప్లే, ఆడియో ఫీచర్లు..
ఏప్రిల్ 20, 2026

Samsung | చవక ధరలకే ఏఐ ఫీచర్లతో లాంచ్ అయిన శాంసంగ్ ఫ్రిజ్‌లు
ఏప్రిల్ 10, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



