Eko Movie Review | ఎకో రివ్యూ – నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
మలయాళంలో కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఎకో మూవీ యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఎకో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Entertainment | Published On Jan 1, 2026, 9.21 am IST
Eko Movie Review | ఈ ఏడాది మలయాళంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది ఎకో. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్‌దేవ్, వినీత్ కీలక పాత్రలు పోషించారు. దింజిత్ అయ్యథాన్ దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
కురియచన్ కోసం అన్వేషణ...
కేరళ - కర్ణాటక సరిహద్దుల్లోని కాట్టుకున్ను అటవీ ప్రాంతలోని కొండపై ఉన్న ఇంట్లో మ్లాతి చేచీ అలియాస్ సోయి (బియానా మోమిన్) ఒంటరిగా జీవిస్తుంటుంది. భర్త కురియచన్ (సౌరభ్ సచ్‌దేవ్) ఓ క్రిమినల్. అతడి కోసం పోలీసులు చాలా ఏళ్లుగా వెతుకుంటారు. కానీ కురియచన్ పట్టుకోలేకపోతారు. ఆ కొండ ప్రాంతంలోనే రహస్యంగా కురియచన్ తల దాచుకుంటున్నట్లుగా పోలీసులు అనుమానిస్తారు. తండ్రి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా మ్లాతి చేచీ పిల్లలు ఆమెకు దూరంగా ఉంటుంటారు. తల్లి బాగోగులను చూసుకునేందుకు పీయూస్‌ను (సందీప్ ప్రదీప్) నియమిస్తారు. ఆ కొండ ప్రాంతానికి, మ్లాథి చేచీకి రక్షణంగా మలేషియాకు చెందిన అరుదైన జాతికుక్కలు ఉంటాయి. కురిచయన్‌ను వెతుక్కుంటూ వచ్చిన వారిపై అవి ఎటాక్ చేస్తుంటాయి. కుక్కల దాడిలోనే కురియచన్ స్నేహితుడు మోహన్ పోతన్ కూడా మరణిస్తాడు. వాటికి కురియచన్ సీక్రెట్‌గా ట్రైనింగ్ ఇస్తున్నాడని అందరూ అనుకుంటుంటారు. కురిచయన్ గురించి నేవీ ఆఫీసర్ (నరేన్) ఇన్వేస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. అతడి ఇన్వేస్టిగేషన్‌లో కురిచయన్, సోయి పెళ్లి తో పాటు పీయూస్ గురించి ఆసక్తికర నిజాలు బయటపడతాడు. అవేమిటి? కురియచన్ కోసం వచ్చిన పోలీసులను పీయూస్ ఎందుకు చంపాడు? సోయి మొదటి భర్త ఏమయ్యాడు? కాట్టుకున్నులోని కుక్కలు...మ్లాథి, కురియచన్‌లలో ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అన్నదే ఈ మూవీ కథ.
హీరోలు...విలన్లు ఉండరు...
డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయడంలో మలయాళ మేకర్స్ ముందుంటారనే అభిప్రాయం సినీ లవర్స్‌లో ఉంది. గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు ఆ మాటలను నిజం చేశాయి. ఎకో కూడా ఆ కోవకు చెందిన సినిమానే. సాధారణంగా ఓ సినిమాలో హీరో, విలన్ పాత్రల్లో ఎవరూ నటించారన్నది ఆడియెన్స్‌కు ముందేగానే అవగాహన ఉంటుంది. ఆ క్యారెక్టరపై ఉన్న అంచనాలకు తగ్గట్లే థియేటర్లలోకి అడుగుపెడతారు. కానీ ఎకో అలాంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇందులో హీరో అనుకున్న పాత్ర సడెన్‌గా చివరలో విలన్‌గా మారిపోతుంది. ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ హీరోగా టర్న్ అవుతుంది. చివరి వరకు ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగుతుంది సినిమా.
రివేంజ్ థ్రిల్లర్ మూవీ...
కథగా చెప్పుకుంటే రెగ్యులర్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ ఇది. కానీ ఈ కథను చాలా థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై ఆవిష్కరించారు డైరెక్టర్ ధింజిత్ అయ్యథాన్. కురియచన్ ఎవరు? అతడికి ఏమైందనే ఉత్కంఠను చివరి వరకు రివీల్ కాకుండా సస్సెన్స్‌ను మెయింటేన్ చేశారు. కురిచయన్ పాత్ర సినిమాలో ఇరవై నిమిషాల లోపే కనిపిస్తుంది. కానీ ఆ పాత్ర చివరి వరకు ఉంటుందనే ఫీల్‌ను ఆడియెన్స్‌లో కలిగించాడు. ఈ మిస్టరీ థ్రిల్లర్ కథలో మనుషులు, జంతువులకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆలోచనాత్మకంగా చూపించారు. మనుషులు స్వార్థంతో మోసాలకు పాల్పడుతుంటారు...కానీ జంతువులు మాత్రం నిస్వార్థంగా, తమ యజమానుల కోసం పాటుపడతాయనే సందేశాన్ని ఇచ్చారు. పీయూస్, మ్లాతి చేచీ పాత్రలకు సంబంధించి చివరలో వచ్చే ట్విస్ట్‌లు సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. ఈ ట్విస్ట్‌లను డైరెక్ట్‌గా కాకుండా నరేన్ ఇన్వేస్టిగేషన్‌లో బయటపెట్టినట్లుగా చూపించడం ఆకట్టుకుంటుంది.
ఒకే కొండ ప్రాంతంలో...
ఎకో కథ, విజువల్స్, బీజీఎమ్, యాక్టింగ్ అన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. సినిమా మొత్తాన్ని ఒకే కొండ ప్రాంతంలో షూట్ చేశారు. ఆ లోకేషన్ బాగుంది. ఎకో కాన్సెప్ట్ బాగున్నా కొన్ని చోట్ల ఆర్ట్ మూవీ ఫీల్‌ను కలిగిస్తుంది.
థ్రిల్లర్ లవర్స్ కోసం...
పీయూస్‌గా సందీప్ ప్రదీప్ నటన బాగుంది. అమాయకుడిగా కనిపిస్తూనే విలనిజాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంది. కురియచన్ పాత్రలో సౌరభ్ సచ్‌దేవ్ కనిపించేది తక్కువే తన స్క్రీన్ ప్రజెన్స్ మెప్పిస్తుంది. మ్లాథి చేచీ పాత్రకు మలేషియన్ నటి బైనా మోమిన్ న్యాయం చేసింది. ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో చివరి వరకు ఆమె పాత్ర సాగుతుంది. ప్రేమదేశం ఫేమ్ వినీత్ తో పాటు మిగిలిన వారి నటన ఓకే అనిపిస్తుంది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునే వారిని ఎకో మెప్పిస్తుంది. సినిమాను కంప్లీట్ చేయడానికి కాస్త ఓపిక కావాల్సిందే. నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.
సంబంధిత వార్తలు

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026

Sathi Leelavathi Review | సతీ లీలావతి రివ్యూ – మెగా కోడలి రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
మే 8, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



