త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Beside Head | ఫోన్‌ను త‌ల ప‌క్క‌న పెట్టి నిద్రిస్తే క్యాన్స‌ర్ వ‌స్తుందా..?

Phone Beside Head | స్మార్ట్ ఫోన్లు అనేవి ప్ర‌స్తుతం మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం అయ్యాయి. నిత్యం ఉద‌యం నిద్ర లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు మనం ఫోన్ల‌ను ప్ర‌తి నిమిషానికి ఉప‌యోగిస్తూనే ఉంటున్నాం. ఫోన్ లేక‌పోతే అస‌లు నిమిషం కూడా ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

S

Lifestyle | Published On Dec 29, 2025, 3.35 pm IST

Phone Beside Head | ఫోన్‌ను త‌ల ప‌క్క‌న పెట్టి నిద్రిస్తే క్యాన్స‌ర్ వ‌స్తుందా..?
Advertisement

Phone Beside Head | స్మార్ట్ ఫోన్లు అనేవి ప్ర‌స్తుతం మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం అయ్యాయి. నిత్యం ఉద‌యం నిద్ర లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు మనం ఫోన్ల‌ను ప్ర‌తి నిమిషానికి ఉప‌యోగిస్తూనే ఉంటున్నాం. ఫోన్ లేక‌పోతే అస‌లు నిమిషం కూడా ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఆ మాటకొస్తే చిన్నారులు సైతం ఫోన్ ఇవ్వ‌క‌పోతే ఆహారం తిన‌డం లేదు. ఈ క్ర‌మంలోనే మ‌న రోజువారి జీవితాల‌ను ఫోన్ల‌ను బాగా ప్ర‌భావితం చేస్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక రాత్రి నిద్రించే ముందు, ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే ఫోన్ ప‌ట్టుకుని ఏమేం మెసేజ్‌లు, నోటిఫికేష‌న్లు వ‌చ్చాయో చెక్ చేస్తున్నారు. మెయిల్స్ చెక్ చేయ‌డంతోపాటు సోష‌ల్ మీడియాలో పోస్టుల‌ను కూడా చూస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. రాత్రి పూట నిద్రించేట‌ప్పుడు మాత్రం ఫోన్‌ను త‌ల ప‌క్క‌న పెట్టి నిద్రిస్తున్నారు. కానీ ఇలా చేయ‌డం ఆరోగ్యానికి హాని క‌లిగిస్తుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.

క్యాన్స‌ర్ వ‌స్తుందా..?

రాత్రి పూట నిద్రించేట‌ప్పుడు ఫోన్‌ను త‌ల ప‌క్క‌న పెట్టి నిద్రిస్తే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తారు. అలాగే ఫోన్‌ను అతిగా వాడినా, ఫోన్‌ను ఎక్కువ సేపు త‌ల ద‌గ్గ‌ర పెట్టుకుని అందులో మాట్లాడినా కూడా క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని చాలా మంది న‌మ్ముతుంటారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజంలేద‌ని కోల్‌క‌తా అపోలో క్యాన్స‌ర్ సెంట‌ర్‌కు చెందిన రేడియేష‌న్ ఆంకాల‌జీ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ అరుంధ‌తి డే తెలిపారు. ఫోన్ల‌ను వాడ‌డం వ‌ల్ల వాటి ద్వారా ప్ర‌సారం అయ్యే రేడియో త‌రంగాలు లేదా రేడియేష‌న్ కార‌ణంగా క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని అన‌డంలో నిజం లేద‌ని, సైంటిస్టులు ఈ విష‌యంపై ఇప్ప‌టికీ ఇంకా ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉన్నార‌ని, ఈ విష‌యం ఇంకా శాస్త్రీయంగా నిరూపణ కాలేద‌ని అన్నారు. అందువ‌ల్ల ఫోన్ల‌ను వాడినా, త‌ల ప‌క్క‌న పెట్టుకుని నిద్రించినా క్యాన్స‌ర్ రాద‌ని, ఈ విష‌యంలో అపోహ‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆమె అన్నారు.

ఫోన్‌ను త‌ల పక్క‌న పెట్ట‌వ‌చ్చా..?

అయితే క్యాన్స‌ర్ ముప్పు లేక‌పోతే మ‌రి ఫోన్ల‌ను త‌ల‌ప‌క్క‌న పెట్టి నిద్రించ‌వ‌చ్చా..? అంటే.. అలా మాత్రం చేయ‌కూడ‌ద‌ని డాక్ట‌ర్ అరుంధ‌తి హెచ్చ‌రించారు. ఎందుకంటే ఫోన్‌ను త‌ల‌ప‌క్క‌న పెట్టినా కూడా రాత్రి స‌మ‌యంలో ఏవైనా నోటిఫికేష‌న్లు లేదా మెసేజ్‌లు, మెయిల్స్ వ‌చ్చినా ఫోన్ నుంచి శ‌బ్దాలు వ‌స్తాయి. అలాగే ఆ స‌మయంలో ఫోన్ డిస్‌ప్లే కాసేపు ఆన్ అవుతుంది. అయితే అప్పుడు మ‌నం నిద్రిస్తూనే ఉంటాం క‌దా, ఆ శబ్దాలు మ‌న‌కు దాదాపుగా వినిపించ‌వు, అందువ‌ల్ల ఎలాంటి హాని క‌ల‌గ‌దు క‌దా.. అని కొంద‌రు అనుకుంటారు. కానీ మ‌నం నిద్రిస్తూనే ఉన్న‌ప్ప‌టికీ మ‌న మెద‌డు మాత్రం ప‌నిచేస్తూనే ఉంటుంది. ఈ క్ర‌మంలో మ‌నం నిద్ర‌లో ఉన్న‌ప్పుడు శ‌బ్దాలు మ‌న‌కు వినిపించ‌క‌పోయినా వాటి వ‌ల్ల మెద‌డుపై ప్ర‌భావం మాత్రం ప‌డుతుంది. దీంతో నిద్ర‌కు ఆటంకం క‌లుగుతుంది.

నిద్ర‌కు ఆటంకం..

రాత్రి పూట త‌ల ప‌క్క‌న ఫోన్‌ను పెడితే అందులో ఏవైనా నోటిఫికేష‌న్లు వ‌స్తే అప్పుడు వచ్చే శ‌బ్దాల‌కు మెద‌డు స్పందిస్తుంది. మెద‌డు ఆ శ‌బ్దానికి, ఫోన్ కాంతికి స్పందిస్తుంది. దీంతో కాసేపు నిద్ర‌కు ఆటంకం క‌లుగుతుంది. ఈ విష‌యం మ‌న‌కు తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ సైలెంట్‌గా ప్ర‌భావం మాత్రం చూపిస్తుంది. ఒక వేళ మ‌నం ఆ స‌మ‌యంలో గాఢ నిద్ర‌లోకి గ‌న‌క జారుకుంటుంటే ఆ ప్ర‌క్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది. దీని వ‌ల్ల మ‌న‌కు గాఢ నిద్ర ల‌భించ‌దు. ఈ క్ర‌మంలో మ‌నం పోయే నిద్ర‌కు నాణ్య‌త ఉండ‌దు. ఇలా ఫోన్ మ‌న‌పై రాత్రి పూట ప్ర‌భావం చూపిస్తుంది. క‌నుక ఫోన్‌ను రాత్రి పూట త‌ల ప‌క్క‌న పెట్ట‌కూడ‌ద‌ని ఆమె సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement