Ganja | కిరాయి ఇంట్లో గంజాయి మొక్క.. సిద్దిపేటలో బెంగాల్ వ్యక్తి అరెస్ట్
సంక్షిప్త సారాంశం
Ganja | గంజాయి (Ganja) కొందరికి వ్యసనంగా మారింది. ప్రభుత్వం, పోలీసులు ప్రచారం చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. క్షణికానందం కోసం డ్రగ్స్‌ను (Drugs) తమ జీవితంలో భాగంగా చేసుకుని కునారిల్లిపోతున్నారు. మత్తుకు బానిసలుగా మారిన పలువురు ఎంతకైనా తెగిస్తున్నారు. ఓ వ్యక్తి తాను కిరాయికి ఉంటున్న ఇంట్లో (Rented House) ఏకంగా గంజాయి సాగు ప్రారంభించాడు.
Ganja | గంజాయి (Ganja) కొందరికి వ్యసనంగా మారింది. ప్రభుత్వం, పోలీసులు ప్రచారం చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. క్షణికానందం కోసం డ్రగ్స్‌ను (Drugs) తమ జీవితంలో భాగంగా చేసుకుని కునారిల్లిపోతున్నారు. మత్తుకు బానిసలుగా మారిన పలువురు ఎంతకైనా తెగిస్తున్నారు. ఓ వ్యక్తి తాను కిరాయికి ఉంటున్న ఇంట్లో (Rented House) ఏకంగా గంజాయి సాగు ప్రారంభించాడు. ఆ నోటా, ఈ నోటో అది కాస్తా పోలీసుల చెవిలో పడటంతో కటకటాల పాలయ్యాడు.
పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఎస్‌కే. రాకిబుల్ (35) అనే వ్యక్తి సిద్దిపేట (Siddipet) జిల్లా లకుడారంలో సీహెచ్ మంగవ్వ ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లో ఓ వ్యక్తి నుంచి గంజాయి విత్తనాలు తెచ్చి ఇంటి వెనక నాటాడు. ప్రస్తుతం సింగాటం గ్రామంలో పనిచేస్తుండటంతో.. రెండు రోజులకు ఒకసారి లకుడారం వచ్చి గంజాయి మొక్కకు నీళ్లు పోస్తూ వాటిని పెద్ద చేశాడు. ఆ ఆకులను తెంపి ఎండబెట్టిన తర్వాత సిగరెట్‌లో పెట్టుకుని పీల్చుతున్నాడు.
అయితే అంతా సజావుగా సాగుతుందనుకున్న క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. స్థానికుల సమాచారంతో అతని ఇంటిపై దాడిచేసి 140 గ్రాముల గంజాయి, మొక్కను స్వాధీనం చేసుకున్నారు. లకుడారం బస్టాండు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని కుకునూరుపల్లి పీఎస్‌కు తరలించారు. కాగా, కిరాయి తీసుకున్న ఇంట్లో ఎంచక్కా గంజాయి మొక్కను పెంచుతూ, మత్తులో తూలుతున్న నిందితుడిని చూసి గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






