BSNL VoWiFi | బీఎస్ఎన్ఎల్ లో కొత్త సదుపాయం.. సిగ్నల్ లేదనే బెంగ ఇక అక్కర్లేదు..
BSNL VoWiFi | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు శ్రమిస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా కస్టమర్లకు మరో నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఫోన్‌లో సిగ్నల్ తక్కువగా ఉన్నా మెరుగైన కాల్ కనెక్టివిటీని పొందవచ్చు.
Technology | Published On Jan 2, 2026, 7.27 am IST
BSNL VoWiFi | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు శ్రమిస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా కస్టమర్లకు మరో నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఫోన్‌లో సిగ్నల్ తక్కువగా ఉన్నా మెరుగైన కాల్ కనెక్టివిటీని పొందవచ్చు. అంటే సిగ్నల్ తక్కువగా ఉన్న సమయంలో కాల్ చేసినా కూడా కాల్స్ డ్రాప్ అవవు. పైగా క్వాలిటీగా కూడా ఉంటాయి. అవతలి వ్యక్తుల మాటలు స్పష్టంగా వినిపిస్తాయి. ఇక ఇందుకు గాను బీఎస్ఎన్ఎల్ కొత్తగా వీవోవైఫై (వాయిస్ ఓవర్ వైఫై) సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. దీన్నే వైఫై కాలింగ్ అని కూడా పిలుస్తారు. జియో, ఎయిర్ టెల్ వంటి టెలికాం సంస్థలు ఇప్పటికే వైఫై కాలింగ్ సేవలను అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ లో తాజాగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
వీవో వైఫై అంటే..
వీవోవైఫై అంటే.. వినియోగదారులు వైఫై కి కనెక్ట్ అయి ఉంటే ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేని సమయంలోనూ కాల్స్ చేసుకోవచ్చు. సాధారణంగా అలాంటి సందర్భాల్లో కాల్స్ చేస్తే సరిగ్గా కనెక్ట్ అవవు. లేదా కాల్ కనెక్ట్ అయినా కూడా వెంటనే డ్రాప్ అవుతుంది. దీంతో ఫోన్ కాల్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. వినియోగదారులు అండర్ గ్రౌండ్ లేదా బేస్‌మెంట్‌లలో, ఆఫీసుల్లో లేదా ఇతర కార్యాలయాల్లో కింది ఫ్లోర్లలో ఉన్నప్పుడు, సిగ్నల్ సరిగ్గా లేని ప్రాంతంలో ఉన్నా, లిఫ్ట్‌లలో ఉన్నా కూడా ఫోన్‌కు సిగ్నల్ సరిగ్గా లభించదు. దీంతో కాల్స్ చేయలేకపోతారు. అలాంటి సందర్భాల్లో వారు వైఫైకి కనెక్ట్ అయి ఉంటే ఫోన్ ద్వారా వీవోవైఫై లేదా వైఫై కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఇందుకు ప్రత్యేకంగా ఎలాంటి చార్జిలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ సేవ టెలికాం సంస్థల ద్వారా ఉచితంగానే లభిస్తుంది. అయితే ఫోన్‌లో మాత్రం వీవోవైఫై సదుపాయాన్ని ఆన్ చేసి ఉంచాలి. దీంతో వైఫైకి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేకపోతే ఈ సదుపాయం సహాయంతో కాల్స్ చేసుకుని మాట్లాడవచ్చు. దీంతో కాల్స్ డ్రాప్ అవకుండా ఉంటాయి. క్వాలిటీగా కూడా ఉంటాయి.
చార్జిలు చెల్లించనవసరం లేదు..
అయితే వైఫై కాలింగ్ సదుపాయాన్ని జియో, ఎయిర్‌టెల్ లో చాలా ఏళ్ల కిందటే ప్రారంభించారు. కానీ బీఎస్ఎన్ఎల్ లో మాత్రం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. అయితే ఎట్టకేలకు ఈ సదుపాయాన్ని అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. దీని వల్ల ఎంతో మంది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ సేవను పొందేందుకు ఎలాంటి చార్జిలను చెల్లించాల్సిన అవసరం లేదని, ఎలాంటి యాప్‌లు కూడా ఇన్ స్టాల్ చేయాల్సిన పనిలేదని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. తమ కస్టమర్లకు మెరుగైన కనెక్టివిటీని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ సేవలను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇక వీవోవైఫై సదుపాయాన్ని ఎస్ఎంఎస్‌లకు కూడా వాడుకోవచ్చు. సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు వైఫై కి కనెక్ట్ అయి ఉంటే కనెక్టివిటీ సమస్య లేకుండానే సులభంగా ఎస్ఎంఎస్‌లను పంపించుకోవచ్చు. దీంతో ఎస్ఎంఎస్‌లు ఫెయిల్ అవకుండా అవతలి వారికి చేరుతాయి. ఇలా బీఎస్ఎన్ఎల్ తన వీవోవైఫై సేవలను అందించడం ప్రారంభించింది.
సంబంధిత వార్తలు

Postpaid Family Plans | ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
మే 16, 2026

TRAI | దేశవ్యాప్తంగా రానున్న పబ్లిక్ వైఫై.. అభిప్రాయాలను స్వీకరిస్తున్న ట్రాయ్..
ఏప్రిల్ 28, 2026

Jio | యూత్ కోసం జియో ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్.. ఎన్నో బండిల్డ్ బెనిఫిట్స్..
ఏప్రిల్ 25, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



