త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BSNL | బీఎస్ఎన్ఎల్‌ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లోనే 5జి సేవ‌లు..

BSNL | కేంద్ర ప్ర‌భుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. త్వ‌ర‌లోనే 5జి సేవ‌ల‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌సార శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న బీఎస్ఎన్ఎల్ భ‌విష్య‌త్తుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

S

Technology | Published On Dec 30, 2025, 8.27 pm IST

BSNL | బీఎస్ఎన్ఎల్‌ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లోనే 5జి సేవ‌లు..
Advertisement

BSNL | కేంద్ర ప్ర‌భుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. త్వ‌ర‌లోనే 5జి సేవ‌ల‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌సార శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న బీఎస్ఎన్ఎల్ భ‌విష్య‌త్తుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీఎస్ఎన్ఎల్ ప్ర‌స్తుతం అనేక 4జి సెల్ ట‌వ‌ర్ల‌ను నిర్మిస్తుంద‌ని, ఆ ప్ర‌క్రియ దాదాపుగా పూర్తి కావ‌చ్చింద‌ని తెలిపారు. 4జి సెల్ ట‌వ‌ర్ల నిర్మాణం పూర్త‌యిన వెంట‌నే వాటిని 5జి ట‌వ‌ర్లుగా అప్ గ్రేడ్ చేస్తామ‌ని, ఇది చాలా వేగంగా జ‌రుగుతుంద‌ని, క‌నుక బీఎస్ఎన్ఎల్ లో 5జి సేవ‌లు త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు.

బీఎస్ఎన్ఎల్ లో ప్ర‌స్తుతం మ‌రో 23వేల సెల్ ట‌వ‌ర్ల నిర్మాణం చేప‌డుతున్న‌ట్లు మంత్రి వివ‌రించారు. ఈ ట‌వ‌ర్ల నిర్మాణం పూర్త‌యితే మొత్తం అన్ని ట‌వ‌ర్ల‌ను 5జి కి అప్‌గ్రేడ్ చేస్తామ‌ని అన్నారు. అలాగే నూత‌నంగా 5జి ట‌వ‌ర్ల‌ను కూడా నేరుగా నిర్మిస్తామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌కు సెల్ ట‌వ‌ర్ల నిర్మాణం, అప్‌గ్రేడ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన‌ట్లు వివ‌రించారు. కాగా బీఎస్ఎన్ఎల్ లో ప్ర‌స్తుతం సాంకేతిక ప‌రంగా ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని, అన్నింటినీ ప‌రిష్క‌రించామ‌ని, క‌నుక వినియోగ‌దారుల‌కు స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌డం చాలా వ‌ర‌కు త‌గ్గింద‌ని అన్నారు.

2023లో దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో మొత్తం 1 ల‌క్ష వ‌ర‌కు 4జి సెల్ ట‌వ‌ర్ల‌ను ఏర్పాటు చేసేందుకు గాను టాటా కన్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌కు బీఎస్ఎన్ఎల్ అప్ప‌ట్లో ప‌ర్చేజ్ ఆర్డ‌ర్ (పీవో)ను మంజూరు చేసింది. ఇక బీఎస్ఎన్ఎల్ కు 4జి, 5జి స్పెక్ట్ర‌మ్ కేటాయింపుల‌కు గాను కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రూ.89,047 కోట్ల‌ను మంజూరు చేసింది. అలాగే ఈ ఏడాది మేలోనూ టాటా గ్రూప్‌కు చెందిన తేజాస్ నెట్ వ‌ర్క్స్ అనే సంస్థ‌కు మ‌రో 18,685 చోట్ల సెల్ ట‌వ‌ర్ల‌ను ఏర్పాటు చేసేందుకు గాను ముంద‌స్తు ప‌ర్చేజ్ ఆర్డ‌ర్ (ఏపీవో)ను కూడా బీఎస్ఎన్ఎల్ అంద‌జేసింది. అయితే బీఎస్ఎన్ఎల్ లో వీలైనంత త్వ‌ర‌గా సెల్ ట‌వ‌ర్ల‌ను ఏర్పాటు చేసి 5జి నెట్‌వ‌ర్క్‌కు అప్ గ్రేడ్ చేస్తామ‌ని, బీఎస్ఎన్ఎల్ ను ర‌క్షించేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని కూడా మంత్రి పెమ్మ‌సాని వివ‌రించారు. ఇక బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారులు కూడా త్వ‌ర‌లోనే ఎంచ‌క్కా 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement