IITH | ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్.. రూ.2.50 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం..
IITH | క్యాంపస్ ఇంటర్వ్యూ ఉద్యోగాల్లో హైదరాబాద్‌లోని ఐఐటీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇక్కడ చదివిన విద్యార్థులకు అత్యధిక స్థాయిలో వేతనంతో క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు లభిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే తాజాగా ఓ విద్యార్థికి ఏకంగా రూ.2.50 కోట్ల ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది.
IITH | క్యాంపస్ ఇంటర్వ్యూ ఉద్యోగాల్లో హైదరాబాద్‌లోని ఐఐటీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇక్కడ చదివిన విద్యార్థులకు అత్యధిక స్థాయిలో వేతనంతో క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు లభిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే తాజాగా ఓ విద్యార్థికి ఏకంగా రూ.2.50 కోట్ల ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఎడ్‌వార్డ్ నాథన్ వర్గీస్ ఐఐటీ హైదరాబాద్‌లో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ విద్యను పూర్తి చేసుకోనుండగా అతనికి నెదర్లాండ్స్‌కు చెందిన ఓ గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ భారీ ప్యాకేజీని ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్న వర్గీస్ అందులో 6 వారాల పాటు ఓ ప్రాజెక్టులో పనిచేశాడు. ఐఐటీ హైదరాబాద్ నుంచి ఆ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ఇద్దరు విద్యార్థుల్లో వర్గీస్ ఒకరు కాగా ప్రాజెక్టు పూర్తయిన అనంతరం అతన్ని ఉద్యోగంలోకి తీసుకునేందుకు కంపెనీ మొగ్గు చూపింది. దీంతో అతనికి భారీ ప్యాకేజీని ఇస్తున్నట్లు తెలిపారు.
రికార్డు సృష్టించిన ఐఐటీహెచ్..
కాగా 21 ఏళ్ల వర్గీస్ హైదరాబాద్‌లో పుట్టి పెరగగా, ప్రాథమిక విద్యాభ్యాసాన్ని నగరంలోనే పూర్తి చేశాడు. ఆ తరువాత 7 నుంచి 12వ తరగతి వరకు బెంగళూరులో చదివాడు. ఈ క్రమంలోనే ఐఐటీ హైదరాబాద్‌లో ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఫైనల్ ఇయర్ విద్యను అభ్యసిస్తున్న వర్గీస్ కు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రూ.2.50 కోట్ల భారీ ప్యాకేజీ లభించింది. 2008లో స్థాపించబడిన ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంతటి భారీ మొత్తంలో ఒక విద్యార్థికి క్యాంపస్ ఇంటర్వ్యూలలో ప్యాకేజీ లభించడం తొలిసారి కాగా, దీంతో ఐఐటీ హైదరాబాద్ కూడా రికార్డు సృష్టించింది. గతంలో 2017లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలలోనూ ఓ విద్యార్థికి భారీ ప్యాకేజీ లభించింది. అప్పట్లో ఓ విద్యార్థికి రూ.1.10 కోట్ల ప్యాకేజీ వచ్చింది. అయితే ఇప్పుడు అంతకు రెట్టింపు మొత్తంలో ప్యాకేజీ లభించడం విశేషం.

కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్..
ఇక వర్గీస్ తన విద్యాభ్యాసంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ తొలి ఏడాది నుంచే కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌లో దేశంలోనే టాప్ 100 లో ఒకడిగా ఉన్నాడని ఐఐటీహెచ్ తెలియజేసింది. అతను మొదటి నుంచి కోడింగ్‌పైనే దృష్టి పెట్టాడని, అలాగే కాంపిటీటివ్ సెలక్షన్ ప్రక్రియ కోసం ఎంతగానో కష్టపడ్డాడని తెలిపింది. దీంతో అత్యంత పోటీ ఉన్న ఈ రంగంలో భారీ స్థాయి ప్యాకేజీతో సత్తా చాటాడని, ఇది ఐఐటీహెచ్‌కు గర్వకారణమని ఆ విద్యాసంస్థ తెలియజేసింది. కాగా వర్గీస్ జూలైలో ఆ నెదర్లాండ్స్ కంపెనీ 2 నెలల పాటు నిర్వహించే ప్రత్యేక ట్రెయినింగ్ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొంటాడు. అనంతరం పూర్తి స్థాయిలో సెప్టెంబర్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేయనున్నాడు.
సగటు ప్యాకేజీ విలువ ఎంతంటే..?
ఇక ఐఐటీ హైదరాబాద్‌లో ఏటా నిర్వహిస్తూ వస్తున్న క్యాంపస్ ఇంటర్వ్యూలలో విద్యార్థులకు అందిస్తున్న సగటు ప్యాకేజీ విలువ నిరంతరం పెరుగుతూనే ఉండడం గమనార్హం. 2024లో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఒక విద్యార్థికి సగటున రూ.20.8 లక్షల ప్యాకేజీ లభించగా, ఇప్పుడది పెరిగి రూ.36.2 లక్షలకు చేరడం విశేషం. అలాగే గతేడాది కాలంలో 24 అంతర్జాతీయ సంస్థల్లో విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. మొత్తం 650 మంది పీజీ విద్యార్థుల్లో 196 మందికి సగటున రూ.22 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం లభించగా, యూజీ విద్యార్థుల్లో 487 మందిలో 62 శాతం మందికి ఇప్పటికే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో జాబ్ ఆఫర్లు లభించాయి. ఇలా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఐఐటీ హైదరాబాద్ ఎప్పటికప్పుడు రికార్డులను సృష్టిస్తుండడం విశేషం.
తాజావార్తలు
- ●Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్‌కుమార్ గౌడ్
- ●Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి
- ●Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?
- ●DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్
- ●Bathukamma Song in Dubai | ‘ఎడారిలో తంగేడు వనమే మొలిసేనో’.. దుబాయ్‌లో ‘మిట్టపల్లి’ బతుకమ్మ పాట ఆవిష్కరణ
- ●Land Survey | మూడు దశల్లో సమగ్ర భూసర్వే.. ఆధార్ తరహాలో భూదార్ కార్డులు

Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్‌కుమార్ గౌడ్

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి

Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?

DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్






