త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BSNL Re.1 Prepaid Plan | BSNL బంప‌ర్ ఆఫ‌ర్‌.. కేవ‌లం రూ.1 కే 30 రోజుల ప్లాన్‌..

BSNL Re.1 Prepaid Plan | ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ BSNL త‌న వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. కేవ‌లం రూ.1 కే 30 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. క్రిస్మ‌స్‌, న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది.

S

Technology | Published On Dec 24, 2025, 5.57 pm IST

BSNL Re.1 Prepaid Plan | BSNL బంప‌ర్ ఆఫ‌ర్‌.. కేవ‌లం రూ.1 కే 30 రోజుల ప్లాన్‌..
Advertisement

BSNL Re.1 Prepaid Plan | ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ BSNL త‌న వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. కేవ‌లం రూ.1 కే 30 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. క్రిస్మ‌స్‌, న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఇందులో భాగంగా కొత్త క‌స్ట‌మ‌ర్లు ఉచితంగా సిమ్‌ను పొంద‌డంతోపాటు నెల రోజుల వ‌ర‌కు కేవ‌లం రూ.1కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా క‌స్ట‌మ‌ర్ల‌కు ప‌లు ప్రయోజ‌నాలు ల‌భిస్తాయి. BSNL త‌న 4జి నెట్‌వ‌ర్క్‌ను అభివృద్ధి చేసిన అనంత‌రం ఆ నెట్‌వ‌ర్క్‌ను ఎక్కువ మంది వినియోగ‌దారులు ఉప‌యోగించుకునేలా చేస్తోంది. అందుక‌నే ఈ ప్లాన్‌ను ప్ర‌క‌టించిన‌ట్లు తెలియ‌జేసింది.

రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్‌లో భాగంగా క‌స్ట‌మ‌ర్ల‌కు 30 రోజుల వాలిడిటీ ల‌భిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు. రోజుకు 2జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌ను కూడా వాడుకోవ‌చ్చు. ఇక ఈ ప్లాన్ కేవ‌లం కొత్త క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే అని BSNL తెలియ‌జేసింది. ఇందులో భాగంగా సిమ్‌ను ఉచితంగా ఇస్తారు. కానీ ఆ త‌రువాత రూ.1 చెల్లించి ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాన్ యాక్టివేష‌న్‌కు జ‌న‌వ‌రి 5వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఇచ్చారు. క‌స్ట‌మ‌ర్లు సిమ్ తీసుకున్న త‌రువాత కేవైసీ ప్ర‌క్రియ పూర్తి చేయాలి. ఆ త‌రువాత క్రిస్మ‌స్ బొనాంజా ప్లాన్ కావాల‌ని అడ‌గాలి. దీంతో విక్రేత‌లు ఆ ప్లాన్‌ను యాక్టివేట్ చేస్తారు. ఆ ప్లాన్ 30 రోజుల వ‌ర‌కు ప‌నిచేస్తుంది. అందులో భాగంగా ముందు తెలిపిన ప్ర‌యోజ‌నాల‌ను నెల రోజుల పాటు వాడుకోవ‌చ్చు. ఇక ఆ త‌రువాత వినియోగదారులు అందుబాటులో ఉన్న ఏదో ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ ఆఫ‌ర్ ప‌నిచేస్తుంది.

ఈ ప్లాన్‌లో భాగంగా కేవైసీ ప్ర‌క్రియ పూర్తి చేసే సంద‌ర్భంలో క‌స్ట‌మ‌ర్లు త‌మ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. కొత్త‌గా తీసుకునే సిమ్ యాక్టివేష‌న్‌కు కూడా జ‌న‌వ‌రి 5వ తేదీ వ‌ర‌కు గడువు విధించారు. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న త‌మ 4జి నెట్‌వ‌ర్క్‌కు మ‌రింత ప్ర‌చారం క‌ల్పించాల‌నే ఉద్దేశంతో ఈ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని, కొత్త క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ ప్లాన్ వ‌ర్తిస్తుంద‌ని BSNL తెలియ‌జేసింది. వినియోగ‌దారులు మ‌రిన్ని వివ‌రాల‌కు bsnl.co.in అనే వెబ్‌సైట్‌ను గానీ లేదా 1800 180 1503 అనే టోల్ ఫ్రీ నంబ‌ర్‌లో కానీ సంప్ర‌దించ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement