త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Boneless Fish | ఈ చేప‌ల్లో అస‌లు ముళ్లు ఉండ‌వు.. నూత‌న వెరైటీని అభివృద్ధి చేసిన సైంటిస్టులు..

Boneless Fish | సాధార‌ణంగా చేప‌ల‌ను తినాలంటే చాలా మంది కొన్ని సార్లు వెనుక‌డుగు వేస్తుంటారు. ఎందుకంటే చేప‌ల్లో ముళ్లు ఉంటాయి క‌నుక అవి అంటే ఇష్టం ఉన్న‌ప్ప‌టికీ వాటిని తినాలంటే ఆందోళ‌న‌గా ఉంటుంది. వాటిల్లో ఆంగ్ల అక్ష‌రం వై (Y) ఆకారంలో ఉండే ముళ్లు ఉంటాయి. కొన్ని చేప‌ల్లో ఆ ముళ్లు చాలా స‌న్న‌గా ఉంటాయి.

S

Science | Published On Jan 2, 2026, 6.24 am IST

Boneless Fish | ఈ చేప‌ల్లో అస‌లు ముళ్లు ఉండ‌వు.. నూత‌న వెరైటీని అభివృద్ధి చేసిన సైంటిస్టులు..
Advertisement

Boneless Fish | సాధార‌ణంగా చేప‌ల‌ను తినాలంటే చాలా మంది కొన్ని సార్లు వెనుక‌డుగు వేస్తుంటారు. ఎందుకంటే చేప‌ల్లో ముళ్లు ఉంటాయి క‌నుక అవి అంటే ఇష్టం ఉన్న‌ప్ప‌టికీ వాటిని తినాలంటే ఆందోళ‌న‌గా ఉంటుంది. వాటిల్లో ఆంగ్ల అక్ష‌రం వై (Y) ఆకారంలో ఉండే ముళ్లు ఉంటాయి. కొన్ని చేప‌ల్లో ఆ ముళ్లు చాలా స‌న్న‌గా ఉంటాయి. దీంతో చేప‌ల్లోని ముళ్ల‌ను చాలా సేపు క‌ష్ట‌ప‌డి ఓపిగ్గా తీసేసి మ‌రీ భ‌యంతోనే తింటారు. అయితే ఇక‌పై చేప‌ల్లో ముళ్ల‌ను తీయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఎందుకంటే అస‌లు ముళ్లే లేని చేప‌ల‌ను సైంటిస్టులు ల్యాబ్‌లో సృష్టించారు. చైనాకు చెందిన శాస్త్ర వేత్త‌లు ఈ ఘ‌న‌త సాధించారు. వారు ప్ర‌ష్య‌న్ కార్ప్ అనే జాతికి చెందిన చేప‌ల‌ను జెనిటిక‌ల్ ఇంజినీరింగ్ ద్వారా సృష్టించారు. ఆ చేప‌ల్లో అస‌లు ముళ్లే లేవు. వాటిని ల్యాబొరేట‌రీలో పెంచి విజ‌యం సాధించారు. దీంతో త్వ‌ర‌లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చేప‌లు మార్కెట్ల‌లో అందుబాటులోకి రానున్నాయి.

చైనా CAS సైంటిస్టుల ఘ‌న‌త‌..

చైనాలోని చైనీస్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ (CAS)కు చెందిన సైంటిస్టులు గుయ్ జియాన్‌ఫాంగ్ అనే శాస్త్ర‌వేత్త నాయ‌క‌త్వంలో ల్యాబ్‌లో ప్ర‌ష్య‌న్ కార్ప్ జాతికి చెందిన చేప‌ల‌ను జ‌న్యు ప‌రంగా అభివృద్ధి చేశారు. వారు CRISPR-Cas9 అనే జీన్ ఎడిటింగ్ టూల్స్‌ను వాడి ఈ చేప‌ల‌ను అభివృద్ధి చేయ‌డం విశేషం. ఇక ఈ నూత‌న త‌ర‌హా చేప‌ల‌కు వారు Zhongke No. 6 అనే పేరు కూడా పెట్టారు. ఈ చేప‌ల్లో వై (Y) ఆకారంలోని ముళ్లు ఉండవు. అవి పూర్తిగా లేకుండానే ఈ చేప‌ల‌ను పెంచారు. ఇందుకు గాను వారు ప్ర‌ష్య‌న్ కార్ప్ చేప‌ల్లో ముళ్ల పెరుగుద‌ల‌కు కార‌ణం అయ్యే runx2b అనే జ‌న్యువును పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ ప్ర‌క్రియ‌ను గుడ్డు ద‌శ‌లో ఉండ‌గానే వారు పూర్తి చేయ‌డం విశేషం. దీంతో చేప‌లు అసలు ముళ్లే లేకుండా పెరిగాయి. అవి చాలా ఆరోగ్యంగా, చురుగ్గా కూడా ఉన్నాయ‌ని సైంటిస్టులు వెల్ల‌డించారు.

ఖ‌ర్చు త‌క్కువే..

ఇక ఈ చేప‌ల‌ను పెంచేందుకు పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌నిలేద‌ని ఆ సైంటిస్టులు తెలిపారు. ఇవి చాలా తేలిగ్గా పెరుగుతాయ‌ని, త‌క్కువ స‌మ‌యంలోనే త్వ‌ర‌గా వృద్ధి చెందుతాయ‌ని, చాలా త‌క్కువ ఆహారం తింటాయ‌ని కూడా తెలిపారు. ఇక వ్యాధుల‌ను సైతం త‌ట్టుకుని పెర‌గ‌గ‌ల‌వ‌ని చెప్పారు. వీటిని పూర్తి స్థాయి ఆక్వా ఫామ్‌లలో చాలా సుల‌భంగా, త‌క్కువ ఖ‌ర్చుతోనే పెంచ‌వ‌చ్చ‌ని కూడా తెలిపారు. కాగా కార్ప్ జాతికి చెందిన చేప‌ల్లో సాధారణంగా 80 చిన్న చిన్న ముళ్లు ఉంటాయి. ఈ క్ర‌మంలో ఆ చేప‌ల‌ను తిన‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది. ఎక్కువ‌గా Y ఆకారంలో ఉండే ముళ్లు ఉంటాయి. క‌నుక ఈ చేప‌ల‌ను తిన‌డం అంటే సాహ‌సం అనే చెప్పాలి. కానీ సైంటిస్టులు అభివృద్ది చేసిన ఈ నూత‌న వెరైటీ ద్వారా ఆ చేప‌ల్లో అస‌లు ముళ్లు ఉండ‌వు. దీని వ‌ల్ల వాటిని ఎలాంటి భ‌యం, ఆందోళ‌న లేకుండా ఆర‌గించ‌వ‌చ్చు. ఇక ఈ చేప‌ల‌ను ఇలా అభివృద్ధి చేసేందుకు 6 ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింద‌ని  CASకు చెందిన సైంటిస్టులు వెల్ల‌డించారు. రానున్న రోజుల్లో ఈ చేప‌ల‌ను వాణిజ్య ప‌రంగా అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. ఇక ముళ్లే లేని చేప‌ల‌ను తినే రోజులు చాలా ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement