త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BSNL Rs 251 Prepaid Plan | న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా BSNL ఆఫ‌ర్‌.. 100జీబీ ఉచిత డేటా..

BSNL Rs 251 Prepaid Plan | ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (BSNL) నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఓ నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఇప్ప‌టికే ల‌భిస్తున్న ప‌లు ప్రీపెయిడ్ ప్లాన్ల‌లో భాగంగా డేటా లిమిట్‌ను సైతం పెంచింది.

S

Technology | Published On Dec 25, 2025, 7.13 pm IST

BSNL Rs 251 Prepaid Plan | న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా BSNL ఆఫ‌ర్‌.. 100జీబీ ఉచిత డేటా..
Advertisement

BSNL Rs 251 Prepaid Plan | ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (BSNL) నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఓ నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఇప్ప‌టికే ల‌భిస్తున్న ప‌లు ప్రీపెయిడ్ ప్లాన్ల‌లో భాగంగా డేటా లిమిట్‌ను సైతం పెంచింది. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ ఆఫ‌ర్‌ల‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఇందులో భాగంగా క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ ఎత్తున మొబైల్ డేటా ల‌భిస్తుంది. అలాగే ఓటీటీ యాప్‌లు, టీవీ చానల్స్‌ను ఉచితంగా వీక్షించ‌వ‌చ్చు. ఈ మేర‌కు BSNL ఈ ఆఫ‌ర్ల వివ‌రాల‌ను ఎక్స్ వేదిక‌గా తెలియ‌జేసింది.

BSNL నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా బీఐటీవీ పేరిట ఈ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. డిసెంబ‌ర్ 24 నుంచి జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు ఈ ఆఫ‌ర్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే BSNL కు చెందిన ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు రూ.251తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా క‌స్ట‌మ‌ర్ల‌కు 100 జీబీ ఉచిత డేటా ల‌భిస్తుంది. 400కు పైగా లైవ్ టీవీ చానల్స్‌ను ఉచితంగా. వీక్షించ‌వ‌చ్చు. ప్రీమియం చాన‌ల్స్ కూడా ఉచితంగానే ల‌భిస్తాయి. ఈ ప్లాన్‌లో భాగంగా ప‌లు ఓటీటీ యాప్‌ల‌ను కూడా ఉచితంగానే పొంద‌వ‌చ్చు. జియో హాట్ స్టార్‌, సోనీ లివ్ వంటి 23 ఓటీటీ యాప్స్‌కు ఉచితంగా స‌బ్ స్క్రిప్ష‌న్‌ను పొంద‌వ‌చ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. బీఐటీవీ ఎంట‌ర్ టెయిన్ మెంట్ ఉచితంగా ల‌భిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ‌ర‌కు వాలిడిటీని క‌లిగి ఉంటుంద‌ని BSNL తెలియ‌జేసింది.

ఇక నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ప‌లు ఇత‌ర ప్రీపెయిడ్ ప్లాన్ల‌లోనూ అద‌న‌పు డేటాను అందిస్తున్న‌ట్లు BSNL తెలిపింది. రూ.225, రూ.347, రూ.485, రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్ల‌కు గాను రోజుకు అద‌నంగా 500 ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే ఈ ప్లాన్ల‌ను వాడుతున్న క‌స్ట‌మ‌ర్ల‌కు డేటా ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుంద‌ని తెలిపింది. రూ.225 ప్లాన్‌కు 30 రోజుల వాలిడిటీ ల‌భిస్తుండ‌గా ఇందులో రోజుకు 2.5 జీబీ డేటాను అందిస్తున్నారు. ఇది ఇక‌పై 3జీబీ గా మారుతుంది. అలాగే రూ.347 ప్లాన్ వాలిడిటీ 50 రోజులు ఉండ‌గా ఇందులో గతంలో రోజుకు 2 జీబీ డేటా అందించేవారు. ఇప్పుడు రోజుకు 2.5జీబీ డేటా ల‌భిస్తుంది. అలాగే రూ.485 ప్లాన్ వాలిడిటీ 72 రోజులు ఉండ‌గా, ఇందులోనూ రోజుకు 2జీబీ డేటా ల‌భించేది. కానీ ఇప్పుడు దీన్ని 2.5జీబీకి పెంచారు. ఇక ఏడాది వాలిడిటీ ఉన్న రూ.2399 ప్లాన్‌లోనూ డేటా ప‌రిమితిని రోజుకు 2జీబీ నుంచి 2.5జీబీకి పెంచారు. పెంచిన బెనిఫిట్ వినియోగ‌దారుల‌కు త‌క్ష‌ణ‌మే ల‌భిస్తోంది. ఇక ఈ ప్లాన్లు అన్నింటిలోనూ అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు సైతం ల‌భిస్తున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement