T20 World Cup | చుక్కలనంటుతున్న విమానాల టికెట్ల ధరలు.. అహ్మదాబాద్‌కు స్పెషల్ రైలు..!
T20 World Cup | భారత క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగే టీ20 ఫైనల్ కోసం ప్రత్యేక రైలును నడిపించనున్నట్లు తెలిపింది. విమాన చార్జీలు ఎక్కువగా ఉండడం, టికెట్లు సైతం అందుబాటులో లేకపోవడంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
T20 World Cup | భారత క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగే టీ20 ఫైనల్ కోసం ప్రత్యేక రైలును నడిపించనున్నట్లు తెలిపింది. విమాన చార్జీలు ఎక్కువగా ఉండడం, టికెట్లు సైతం అందుబాటులో లేకపోవడంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌కు వెళ్లే అభిమానులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. స్పెషల్ రైలు దేశ రాజధాని ఢిల్లీ నగరం నుంచి శనివారం రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది. ఢిల్లీ కాంట్, గురుగ్రామ్, జైపూర్ మీదుగా ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సబర్మతి స్టేషన్‌కు చేరుకుంటుంది. రైలు నంబర్ 04062లో 19 కోచ్‌లు ఉంటాయని, ప్రయాణీకుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి బయలుదేరి ఢిల్లీ కాంట్ స్టేషన్‌లో ఆగుతుందని రైల్వేశాఖ తెలిపింది. ఈ రైలు తిరిగి ఆదివారం రాత్రి 11.45 గంటలకు సబర్మతి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సబర్మతి చేరుకుంటుంది. ప్రయాణ సమయం దాదాపుగా 14.45 గంటలు ఉంటుందని తెలిపింది.
భారీగా పెరిగిన విమాన చార్జీలు, హోటల్ గదుల అద్దె
ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించాక అహ్మదాబాద్‌ను క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కోసం నగరానికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే వేలాది మంది క్రికెట్ అభిమానులు సైతం అహ్మదాబాద్‌కు చేరుకుంటున్నారు. పొట్టి కప్ కోసం దాదాపుగా 40వేల మంది ప్రేక్షకులు వివిధ నగరాల నుంచి తరలివస్తారని అంచనా. ఈ క్రమంలో హోటల్‌లో గదులు, విమానాల టికెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే మూడు నుంచి నాలుగు రెట్లు రేట్లు పెరిగాయి. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి చాలా మంది క్రికెట్ అభిమానులు హోటల్ గదికి రూ.80వేల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఢిల్లీ, ముంబయి, బెంగళూరు తదితర నగరాల నుంచి అహ్మదాబాద్‌కు విమాన ఛార్జీలు రూ.15వేల నుంచి రూ.30వేల వరకు ధర పలుకుతోంది. అహ్మదాబాద్‌లోని చాలా హోటల్స్ గదులు దాదాపుగా బుక్ అయ్యాయి. గదుల ధరల 300 నుంచి 400 శాతం వరకు పెరిగినట్లు అంచనా.
Read Also :
T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026 ముగింపు వేడుకలు.. సింగర్ రికీ మార్టిన్‌తో ప్రోగ్రామ్..
Team India Fans | అచ్చిరాని నరేంద్ర మోదీ స్టేడియం.. టీమిండియా గెలవాలని అభిమానుల పూజలు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
- ●US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..
- ●Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు
- ●IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..
- ●Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు






