HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
HD Kumaraswamy | కర్నాటకలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో స్పష్టమైన లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ, దీనిని వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
HD Kumaraswamy | కర్నాటకలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో స్పష్టమైన లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ, దీనిని వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగళూరులో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సవరణకు ఇప్పటివరకు సరైన ఆధారాలు లేవని కుమారస్వామి పేర్కొన్నారు. “ఈ విధంగా సాగుతున్న ప్రక్రియకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. అందుకే దీన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందే” అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు ఇప్పటికే తమ అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు చెబుతూ.. తర్వాతి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ఓటర్ల జాబితాలో జరుగుతున్న అనుమానాస్పద మార్పులపై పూర్తి వివరాలతో సోమవారం ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, మళ్లీ పూర్తిగా పారదర్శకంగా సవరణ చేపట్టాలని అక్కడ కోరనున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. బీకే హరిప్రసాద్, హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ వ్యవహారంపై స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రామనగర వంటి ప్రాంతాల్లో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి తప్పుడు ఓట్లు నమోదు అవుతున్నాయని ఆరోపించారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో బెంగళూరులో వీధి వ్యాపారులను తొలగించడంపైనా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించకుండా చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఇటీవల ఓటర్ల జాబితా సవరణపై జనతాదళ్ (Secular)తో పాటు భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు చేస్తుండటంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






