Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
భారత క్రికెట్‌లోకి మరో యువ సంచలనం ఎంట్రీ ఇచ్చాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు వైభవ్ సూర్యవంశీ. దేశం తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
భారత క్రికెట్‌లోకి మరో యువ సంచలనం ఎంట్రీ ఇచ్చాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు వైభవ్ సూర్యవంశీ. దేశం తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు భారత జట్టులో చోటు లభించింది. మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ అతడికి టీమిండియా క్యాప్ అందజేయగా.. యువ ఆటగాడి కెరీర్‌లో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాలు 205 రోజుల వయసులో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు.
ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ మాత్రం 15 సంవత్సరాలు 99 రోజులకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి కొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఒకే ఒక్క మార్పు చేసినట్లు తెలిపారు. వికెట్ కీపర్ కం బ్యాటర్ సంజు శాంసన్ స్థానంలో సూర్యవంశీకి అవకాశం కల్పించినట్లు చెప్పాడు. యువ ఆటగాడి ఎంపికపై శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిని పట్టించుకోకుండా సహజసిద్ధమైన ఆటతీరుతో ఆకట్టుకునే వైభవ్ గత కొన్ని నెలలుగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని చెప్పాడు. నెట్స్‌లో సీనియర్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్న తీరు అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని, జట్టులో చోటు సంపాదించుకునే అర్హతను తన ఆటతోనే నిరూపించుకున్నాడని పేర్కొన్నాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని
- ●Shalini Pandey | బికినీలో అర్జున్ రెడ్డి హీరోయిన్ - ఇటలీ ట్రిప్ జ్ఞాపకాల్లో...
- ●Google Pixel Watch 5 | ఏఐ మోడల్స్‌తో లాంచ్ అయిన గూగుల్ కొత్త పిక్సల్ వాచ్ 5.. ఫీచర్లు ఇవే..
- ●Nizamabad Road Accident | తీర్థయాత్రలో తీవ్ర విషాదం: డివైడర్‌పై సేదతీరుతుండగా.. మృత్యువులా దూసుకొచ్చిన లారీ
- ●Supreme Court Electrocution Ruling | విద్యుత్ మరణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. బాధ్యత ఎవరిది?
- ●CM Revanth Reddy | కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో సెక్యులర్ వర్గాలకు మనుగడ : సీఎం రేవంత్ రెడ్డి

Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని

Shalini Pandey | బికినీలో అర్జున్ రెడ్డి హీరోయిన్ - ఇటలీ ట్రిప్ జ్ఞాపకాల్లో...
Google Pixel Watch 5 | ఏఐ మోడల్స్‌తో లాంచ్ అయిన గూగుల్ కొత్త పిక్సల్ వాచ్ 5.. ఫీచర్లు ఇవే..

Nizamabad Road Accident | తీర్థయాత్రలో తీవ్ర విషాదం: డివైడర్‌పై సేదతీరుతుండగా.. మృత్యువులా దూసుకొచ్చిన లారీ






