Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌కు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. ఫొటో వైరల్
Hardik Pandya | టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన గర్ల్ ఫ్రెండ్ మహీకా శర్మ (Mahika Sharma)పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.
Hardik Pandya | టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన గర్ల్ ఫ్రెండ్ మహీకా శర్మ (Mahika Sharma)పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఇప్పటికే తన విజయాలకు మహీకానే కారణమని క్రెడిట్ ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్.. ఇప్పుడు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చి ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. సుమారు 1.7 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ వీ క్లాస్ (Mercedes-Benz V-Class) కారును గిఫ్ట్ చేశాడు.
మరో విశేషం ఏంటంటే..? ఈ మోడల్ కారును ఇండియాలో అందుకున్న మొట్టమొదటి వ్యక్తి మహికానే కావడం. ఆ కారు వద్ద ఈ ప్రేమ జంట దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఖరీదైన మూడు కార్లు కొనడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, వ్యక్తిగత కారణాలతో భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన లగ్జరీ లైఫ్ స్టైల్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. గత నెల తన కుమారుడు అగస్త్యకు రూ.4 కోట్ల ఖరీదైన విలాసవంతమైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ యూఎస్‌వీని బహుమతిగా అందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రూ.12 కోట్ల విలువ చేసే లగ్జరీ ఫెరారీ 12సిలిండ్రి (Ferrari 12 Cilindri) కారును కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మరో సూపర్ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ఇక ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ సారథ్యంలోని ముంబై జట్టు ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించిన విషయం తెలిసిందే.
Also Read..
టాలీవుడ్ డైరెక్టర్‌తో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ మూవీ - సెన్సేషనల్ కాంబో లోడింగ్!
ఫొటోషూట్ కోసం ఏనుగుకు గులాబీ రంగేసిన టూరిస్ట్.. నెట్టింట తీవ్ర విమర్శలు
సహజీవనం చేస్తున్నా భార్యాభర్తలే : 2027 జనాభా లెక్కల్లో కేంద్రం సంచలన నిర్ణయం
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
మే 16, 2026

Mumbai Indians | రోహిత్ గాయంపై అప్డేట్ ఇచ్చిన హెడ్‌కోచ్ జయవర్ధనే..!
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



