త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Census 2027 | సెన్సస్ 2027: ఒకే ఇంట్లో కలిసి ఉంటూ సహజీవనం చేస్తుంటే.. జనాభా లెక్కల్లో భార్యాభర్తల కిందికే లెక్క..!

మొత్తం 45 రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో.. మొదటి 15 రోజులు సెల్ఫ్-ఎన్యూమరేషన్ (ఆన్‌లైన్‌లో స్వయం నమోదు) కోసం కేటాయించారు. ఆ తర్వాత 30 రోజులు ఎన్యూమరేటర్ల ద్వారా నేరుగా వివరాల నమోదు ఉంటుంది.

J

National | Published On Mar 30, 2026, 1.12 pm IST

Census 2027 | సెన్సస్ 2027: ఒకే ఇంట్లో కలిసి ఉంటూ సహజీవనం చేస్తుంటే.. జనాభా లెక్కల్లో భార్యాభర్తల కిందికే లెక్క..!

సంక్షిప్త సారాంశం

2027 జనాభా లెక్కల (Census 2027) సేకరణలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే ఇంట్లో ఉండే లివ్-ఇన్ (Live-in) జంటలను ఇకపై వివాహిత జంటలుగానే పరిగణించనున్నారు. వివరాల నమోదుకు ఎలాంటి ఆధారాలు (Proof) చూపాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారా స్వయంగా (Self-enumeration) వివరాలు నమోదు చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.

Advertisement

Census 2027 | భారతదేశ జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ఒక ఆసక్తికరమైన, కీలకమైన అప్‌డేట్ వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్రం కొన్ని నిబంధనలను సవరిస్తోంది. ఇందులో భాగంగా, ఒకే ఇంట్లో కలిసి ఉంటూ, 'స్థిరమైన బంధం' (stable union) కొనసాగిస్తున్న లివ్-ఇన్ (Live-in)(సహజీవనం చేస్తున్న) జంటలను రాబోయే జనాభా లెక్కల్లో వివాహితులుగా (married couple) పరిగణించనున్నారు. ఈ మేరకు సెన్సస్ అధికారులు స్పష్టత ఇచ్చారు.

FAQలో స్పష్టం చేసిన అధికారులు

సెన్సస్ సెల్ఫ్-ఎన్యూమరేషన్ పోర్టల్‌లోని తరచుగా అడిగే ప్రశ్నల (FAQ) విభాగంలో అధికారులు ఈ వివరాలను పొందుపరిచారు. సహజీవనం చేస్తున్న జంటను ఎన్యూమరేటర్ల సందర్శన సమయంలో లేదా స్వయం నమోదు (self-enumeration) సమయంలో వివాహిత జంటగా పరిగణిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. "ఆ జంట తమ సంబంధాన్ని స్థిరమైనదిగా భావిస్తే, వారిని ఖచ్చితంగా వివాహిత జంటగా లెక్కించాలి" అని అధికారులు పేర్కొన్నారు.

అయితే, ఈ విషయంపై బహిరంగంగా స్పష్టత ఇవ్వడం ఇదే తొలిసారి అయినప్పటికీ.. గతంలో కూడా కలిసి ఉంటున్న జంటలు తమను తాము 'వివాహితులు'గా ప్రకటించుకున్నప్పుడు, ఎన్యూమరేటర్లు అలాగే నమోదు చేసుకునేవారని ఈ ప్రక్రియలో అనుభవం ఉన్న ఒక అధికారి వెల్లడించారు.

ఆధారాలు (Proof) ఏవీ అవసరం లేదు

ఈ జనాభా లెక్కల కోసం ఏ వ్యక్తి కూడా తమ సమాచారాన్ని నిరూపించుకునేందుకు ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు (proof) సమర్పించాల్సిన అవసరం లేదు. పౌరులు తమకు తెలిసిన సమాచారాన్ని, వారి విశ్వాసం మేరకు నిజాయితీగా చెబితే చాలు. ప్రజలు చెప్పిన సమాచారాన్నే యథాతథంగా నమోదు చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

స్వయంగా నమోదు చేసుకునే అవకాశం (Self-enumeration)

ఇంటి జాబితా (House listing) ఆపరేషన్ దశలో మొత్తం 33 ప్రశ్నలు అడుగుతారు. అందులో ఆ ఇంట్లో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య కూడా ఒకటి. ఈ ప్రక్రియ ప్రతి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నోటిఫై చేసిన విధంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య జరుగుతుంది. మొత్తం 45 రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో.. మొదటి 15 రోజులు సెల్ఫ్-ఎన్యూమరేషన్ (ఆన్‌లైన్‌లో స్వయం నమోదు) కోసం కేటాయించారు. ఆ తర్వాత 30 రోజులు ఎన్యూమరేటర్ల ద్వారా నేరుగా వివరాల నమోదు ఉంటుంది. ఏప్రిల్ 1న ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ (NDMC) ఏరియాలో ఈ సెల్ఫ్-ఎన్యూమరేషన్ ప్రారంభమవుతుంది. దీని కోసం ఒక డెడికేటెడ్ వెబ్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆన్‌లైన్ సదుపాయం ఇంగ్లీషుతో పాటు 15 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ఎవరు నమోదు చేయవచ్చు?

కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టే లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే 'కుటుంబ పెద్ద' ఈ సెల్ఫ్-ఎన్యూమరేషన్ చేయవచ్చు. ఆ వ్యక్తి ఇంటి పెద్ద లేదా పురుషుడే కావాల్సిన అవసరం లేదు, బాధ్యత గల ఏ వయోజన సభ్యుడైనా ఓటీపీ (OTP) ఆధారిత మొబైల్ వెరిఫికేషన్ ద్వారా ఇంటి సభ్యులందరి వివరాలను నమోదు చేయవచ్చు.

అలాగే, స్వయం నమోదులో తమ ఇంటి లేదా నివాస ప్రాంత లొకేషన్‌ను సరిగ్గా మ్యాప్ చేయడం చాలా కీలకం. డ్రాప్‌డౌన్ మెనూ నుంచి జిల్లా పేరు, పిన్ కోడ్ ఎంచుకుని.. ఆ తర్వాత గ్రామం, వీధి లేదా సమీప ల్యాండ్‌మార్క్ వివరాలను తప్పుల్లేకుండా నమోదు చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement