త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Salman khan | టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో స‌ల్మాన్ ఖాన్ బాలీవుడ్ మూవీ – సెన్సేష‌న‌ల్ కాంబో లోడింగ్‌!

బాలీవుడ్ భాయ్‌జాన్ స‌ల్మాన్ ఖాన్ త‌న కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ఓ తెలుగు డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నాడు. స‌ల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతుంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సోమ‌వారం అఫీషియ‌ల్ అనౌన్స్‌చేశారు.

N

Entertainment | Published On Mar 30, 2026, 2.23 pm IST

Salman khan | టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో  స‌ల్మాన్ ఖాన్ బాలీవుడ్ మూవీ – సెన్సేష‌న‌ల్ కాంబో లోడింగ్‌!
Advertisement

Salman khan | బాలీవుడ్ భాయ్‌జాన్ స‌ల్మాన్ ఖాన్ హీరోగా టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో ఓ బాలీవుడ్ మూవీ రాబోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లొస్తున్నాయి. ఎట్ట‌కేల‌కు ఈ క‌ల‌యిక‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఈ బాలీవుడ్ సినిమాను సోమ‌వారం అనౌన్స్‌చేశారు. ఈ భారీ బ‌డ్జెట్ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు నిర్మించ‌బోతున్నారు.

గౌర‌వంగా భావిస్తున్నా...

సోష‌ల్ మీడియా ద్వారా ఈ సినిమాను ప్ర‌క‌టించారు స‌ల్మాన్ ఖాన్‌. వంశీ పైడిప‌ల్లితో దిగిన ఓ ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నారు. త‌న నెక్స్ట్ సినిమాను స‌ల్మాన్‌ఖాన్‌తో చేయ‌బోతుండ‌టం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు వంశీపైడిప‌ల్లి కూడా పేర్కొన్నాడు.

భారీ బ‌డ్జెట్‌తో మాస్ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి మొద‌లుకాబోతుంది. 2027లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. స‌ల్మాన్ ఖాన్ మాస్ స్క్రీన్ ప్ర‌జెన్స్‌, వంశీ పైడిప‌ల్లి సెన్సిబిలిటీస్‌తో మంచి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దిల్ రాజు నిర్మిస్తున్న 63వ సినిమా ఇది. తెలుగు డైరెక్ట‌ర్‌తో స‌ల్మాన్ ఖాన్ చేయ‌బోతున్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ప్ర‌భుదేవా, ఏఆర్ మురుగ‌దాస్ వంటి త‌మిళ ద‌ర్శ‌కుల‌తో స‌ల్మాన్ ఖాన్ సినిమాలు చేశారు.

న‌య‌న‌తార హీరోయిన్‌....

స‌ల్మాన్ ఖాన్ వంశీ పైడిప‌ల్లి మూవీలో లేడీ సూప‌ర్ స్టార్‌ న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే న‌య‌న్‌ను క‌లిసిన వంశీపైడిప‌ల్లి క‌థ‌ను వినిపించిన‌ట్లు స‌మాచారం. త‌న పాత్ర‌కు ఉన్న ప్రాధాన్య‌త న‌చ్చ‌డంతో న‌య‌న‌తార ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఈ సినిమా కోసం న‌య‌న‌తార ఇర‌వై కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.
బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనిల్ క‌పూర్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణ‌ల వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌బోతున్నారు.
ప్ర‌భాస్ మున్నా సినిమాతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వంశీ పైడిప‌ల్లి. ఎన్టీఆర్ బృందావ‌నం, రామ్ చ‌ర‌ణ్ ఎవ‌డు, మ‌హేష్‌బాబుతో మ‌హ‌ర్షి సినిమాలు చేశాడు. ద‌ళ‌ప‌తి విజ‌య్ వారిసు మూవీతో డైరెక్ట‌ర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement