Elephant | ఫొటోషూట్ కోసం ఏనుగుకు గులాబీ రంగేసిన టూరిస్ట్.. నెట్టింట తీవ్ర విమర్శలు
Elephant | ఫొటోషూట్ (Photoshoot) కోసం ఏనుగుకు (Elephant) గులాబీ రంగేసి ఓ టూరిస్ట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Elephant | ఫొటోషూట్ (Photoshoot) కోసం ఏనుగుకు (Elephant) గులాబీ రంగేసి ఓ టూరిస్ట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రష్యాకు చెందిన ఆర్ట్ (Foreign Artist) ఫొటో గ్రాఫర్ జూలియా బరులెవా (Art photographer Julia Buruleva) ఇటీవలే రాజస్థాన్ జైపూర్‌లో పర్యటించారు. పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా జూలియా ఓ ఫొటోషూట్ చేశారు. ఇందుకోసం ఏనుగుకు గులాబీ రంగు వేశారు. అంతేకాదు ఆమె కూడా తన బాడీ మొత్తానికి గులాబీ రంగు వేసుకున్నారు. ఏనుగుపైకి ఎక్కి దానికి అరటిపండ్లు పెడుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. జైపూర్‌లోని ఓ ఆలయంలో ఈ ఫొటోషూట్ నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన వీడియోని జూలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జైపూర్‌లో కొన్ని వారాల పాటు గడిపిన తర్వాత తనకు ఈ ఆలోచన వచ్చిందని ఆమె వివరించారు. ఏనుగులు రాజస్థాన్ సాంస్కృతిక చిహ్నమని పేర్కొంటూ.. వాటిని తన పనిలో భాగం చేయాలనుకున్నట్లు తెలిపారు. "అక్కడ వీధులు, ఆభరణాలు.. ఇలా ప్రతిచోటా ఏనుగులు కనిపిస్తాయి. ఏనుగు రాజస్థాన్ ప్రధాన చిహ్నం. ఆ సాంస్కృతిని నా ఫోటోషూట్‌లో చేర్చకుండా నేను ఉండలేకపోయాను" అంటూ అందులో పేర్కొన్నారు. అంతేకాదు, అక్కడ ఉపయోగించిన రంగులు కూడా పూర్తిగా సురక్షితమని.. ఇది ఏనుగుకు ఎలాంటి హానీ ఉండదని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు టూరిస్ట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలా చేయడం జంతువులను హింసించడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఆనందం కోసం ఏనుగును ఇబ్బంది పెట్టడం ఎందుకు..? దానికి బదులు ఏఐని ఉపయోగించుకోవచ్చు కద అంటూ సలహా ఇస్తున్నారు. మరికొందరైతే టూరిస్ట్ కళాత్మక సృజనను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.
కాగా, భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) ప్రకారం జంతువులకు రంగులు పూయడం లేదా వాటిని హింసించడం శిక్షార్హమైన నేరం. విదేశీయులైనా, స్థానికులైనా చట్టం ముందు సమానమేనని, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తించాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది.
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Rakul Preet Singh | సినిమా ప్రమోషన్స్ తెచ్చిన తంటాలు – వివాదంలో చిక్కుకున్న రకుల్…
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



