Mumbai Indians | రోహిత్ గాయంపై అప్‌డేట్ ఇచ్చిన హెడ్‌కోచ్ జయవర్ధనే..!
Mumbai Indians | ఐపీఎల్‌లో ముంబయి జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లు ఉన్నా వరుస ఓటములతో సతమతమవుతోంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించిన ముంబయి.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిది స్థానంలో ఉంది.
Mumbai Indians | ఐపీఎల్‌లో ముంబయి జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లు ఉన్నా వరుస ఓటములతో సతమతమవుతోంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించిన ముంబయి.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిది స్థానంలో ఉంది. ఇదే సమయంలో ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ముంబయి ఇండియన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ సమయంలో రోహిత్ శర్మ హామ్‌స్ట్రింగ్ సమస్యతో ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఛేజ్‌లో ఆరో ఓవర్‌లోనే గాయం కారణంగా ఇన్నింగ్స్ మధ్యలోనే క్రీజును వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. ప్రస్తుతం మళ్లీ మైదానంలోకి వస్తాడా లేదా అన్నది స్పష్టత లేదని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.
టీమ్ హెడ్‌కోచ్ మహేలా జయవర్ధనే రోహిత్ గాయంపై స్పందించాడు. గాయం తీవ్రంగా లేదని తెలిపాడు. సీజన్ ప్రారంభ దశలోనే ఉండడంతో రోహిత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు భావించడం లేదని పేర్కొన్నారు. రోహిత్ మళ్లీ పరుగులు తీస్తూ, బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. పరిస్థితిని రోజూ సమీక్షిస్తున్నామని స్పష్టం చేశారు. వరుస పరాజయాల నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి ఉందనే అభిప్రాయాలను జయవర్ధనే తోసిపుచ్చాడు. జట్టు పరాజయాలకు ఒక్కరే బాధ్యులు కాదని, మొత్తం జట్టు, మేనేజ్‌మెంట్ బాధ్యత అని స్పష్టం చేశాడు. మెరుగైన ప్రదర్శనపై అన్ని స్థాయిల్లో సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






