త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్‌.. జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్‌.. శాంస‌న్‌కు నో..!

P

Sports | Published On May 19, 2026, 5.05 pm IST

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్‌.. జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్‌.. శాంస‌న్‌కు నో..!
Advertisement

IND vs AFG ODI Squad | వ‌చ్చే నెల‌లో అఫ్ఘానిస్తాన్‌తో జ‌రుగ‌నున్న వ‌న్డే సిరీస్‌కు బీసీసీఐ మంగ‌ళ‌వారం జ‌ట్టును ప్ర‌క‌టించింది. గౌహ‌తిలో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మైన సెల‌క్ష‌న్ క‌మిటీ జ‌ట్టును ఎంపిక చేసింది. ఈ సిరీస్‌లో సీనియ‌ర్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌కు సైతం చోటు క‌ల్పించ‌డం విశేషం. ఐపీఎల్ ముగిసిన త‌ర్వాత వ‌న్డే సిరీస్ మొద‌ల‌నుకానుంది. వ‌చ్చే ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో ఈ సిరీస్ కీల‌కంగా భావిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌తో జూన్ 14న ధ‌ర్మ‌శాల‌లో తొలి మ్యాచ్ జ‌రుగుతుంది. జూన్ 17, 20 తేదీల్లో ల‌క్నో, చెన్నై వేదిక‌గా మ్యాచులు జ‌రుగ‌నున్నాయి. వ‌న్డేల‌కు ముందు జూన్ 6న ముల్లాన్‌పూర్‌లో టెస్ట్ మ్యాచ్ జ‌రుగ‌నుంది.

కొత్త ముఖాల‌కు ఛాన్స్‌..

అఫ్గానిస్తాన్‌తో జ‌రిగే వ‌న్డే సిరీస్‌లో బీసీసీఐ కొత్త ముఖాల‌కు చోటు క‌ల్పించింది. ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా జట్టులో చోటు సంపాదించాడు. అయితే, ఫిట్‌నెస్‌పైనే చోటు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. రోహిత్ శర్మను సైతం ఎంపిక చేసిన‌ప్ప‌టికీ ఫిట్‌నెస్‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇక సిరీస్‌లో కీల‌క ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. అలాగే, టెస్టు జ‌ట్టులోనూ చోటు క‌ల్పించ‌లేదు. అలాగే, సీనియ‌ర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే జట్టులో చోటు ద‌క్క‌లేదు. జడేజాను జట్టు నుంచి తప్పించలేదని, కేవలం విశ్రాంతి ఇచ్చినట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. ఇక ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేయ‌గా.. శ్రేయాస్ అయ్య‌ర్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. కీపర్‌గా కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్‌కు కూడా అవకాశం దక్కింది. టీ20ల తర్వాత ఇషాన్ వన్డే జట్టులోనూ చోటు ద‌క్కించుకున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్‌కు మాత్రం ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న‌ది.

భారత వన్డే జట్టు..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.

Advertisement
Advertisement