త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hardik Pandya | చిక్కుల్లో హార్దిక్ పాండ్యా.. జాతీయ జెండాను అవమానించాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు

Hardik Pandya | టీమ్ ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చిక్కుల్లో ప‌డ్డారు. పాండ్యా జాతీయ జెండాను అవమానించారని ఆరోపిస్తూ ఓ వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు (Complaint Filed Against Hardik Pandya).

D

Cricket | Published On Mar 12, 2026, 10.02 am IST

Hardik Pandya | చిక్కుల్లో హార్దిక్ పాండ్యా.. జాతీయ జెండాను అవమానించాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు
Advertisement

Hardik Pandya | టీమ్ ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చిక్కుల్లో ప‌డ్డారు. పాండ్యా జాతీయ జెండాను అవమానించారని ఆరోపిస్తూ ఓ వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు (Complaint Filed Against Hardik Pandya). అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ (T20 World Cup) విజయోత్సవాల సందర్భంగా హార్దిక్.. జాతీయ జెండాను అవమానించాడని (Insulting National Flag) వాజిద్ ఖాన్ అనే న్యాయవాది పేర్కొన్నాడు. ఈ మేర‌కు అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ పూణెలోని శివాన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విష‌యాన్ని పోలీసు అధికారులు సైతం ధృవీక‌రించారు.

కాగా, మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచిన విష‌యం తెలిసిందే. టీమ్ ఇండియా గెలుపు త‌ర్వాత ఆట‌గాళ్లు, అభిమానులంతా స్టేడియంలో సంబ‌రాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా హార్దిక్ పాండ్యా కాస్త అతి ప్ర‌ద‌ర్శించారు. జాతీయ జెండాను క‌ప్పుకుని త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో క‌లిసి హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించాడు. గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను హ‌గ్ చేసుకుని ఆమెపై ముద్దుల వ‌ర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజ‌న్లు హార్దిక్‌పై ఫైర్ అవుతున్నారు. ఇదేం ప్ర‌వ‌ర్త‌న అంటూ తిట్టిపోస్తున్నారు.

టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ స‌మ‌ష్టి కృషికి బౌల‌ర్ల ప్ర‌తిభ తోడ‌వ‌డంతో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ (T20 World Cup) ట్రోఫీని టీమ్ఇండియా (Team India) నిల‌బెట్టుకున్న‌ది. 2007, 2024లో పొట్టి క‌ప్పును చేజిక్కించుకున్న భార‌త్‌.. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్‌ ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌ను మ‌ట్టిక‌రిపించింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు మిచెల్ శాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకుంది.

దీంతో టీమిండియా అనేక రికార్డుల‌ను సైతం న‌మోదు చేసింది. వ‌రుస‌గా రెండోసారి ట్రోఫీని కైవ‌సం చేసుకున్న జ‌ట్టుగా నిల‌వ‌డంతోపాటు మూడు సార్లు ట్రోఫీని గెలిచిన తొలి జ‌ట్టుగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే స్వ‌దేశంలో టీ20 ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జ‌ట్టుగా కూడా భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. కాగా.. టీమ్ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ కప్‌ గెలుపొందడంలో హార్దిక్ పాండ్య కీలకపాత్ర పోషించాడు. లీగ్ మ్యాచ్‌లో నమీబియాపై 28 బంతుల్లో 52 పరుగులు చేయడం సహా 2 అర్ధ సెంచరీలు సాధించాడు. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ 9 వికెట్లతో రాణించి ఆల్‌రౌండర్‌గా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు హార్దిక్. అయితే, ఈ గెలుపును సెల‌బ్రేట్ చేసుకోవాల్సిన స‌మ‌యంలో ఆయ‌న త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో చిక్కుల్లో ప‌డ్డాడు.

Also Read..

Vande Bharat sleeper | సుదూర ప్రయాణాలకు వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. ఫ్లయిట్‌ టికెట్ల తరహాలోనే కన్ఫర్మ్‌ టికెట్‌..!

Admit Card | అడ్మిట్ కార్డులో అభ్య‌ర్థికి బ‌దులు కుక్క ఫొటో..

Farooq Abdullah | పాయింట్ బ్లాక్‌లో తుపాకీ.. జ‌మ్ముక‌శ్మీర్ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం

Advertisement

తాజావార్తలు

Advertisement